For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది టాలెంటెడ్ కుర్రాళ్లు తమదైన శైలి కామెడీతో తెగ సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు ముక్కు అవినాష్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతడు.. ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

  అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ తాజాగా ఓ షోలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి? ఆ సంగతులు మీ అందరి కోసం!

  అలా మొదలైన కెరీర్.. చాలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. చాలా ఫేమస్

  ముక్కు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించాడు. హీరోల వాయిస్‌లు, బాడీ లాంగ్వేజ్‌లను అనుకరిస్తూ అలా స్టేజ్ షోలు, ఈవెంట్లలో దూసుకుపోతోన్న సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందాడు. దీంతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా పొందాడు.

  హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

  జబర్ధస్త్‌కు గుడ్‌బై.. ఆ షోలోకి ఎంటర్

  జబర్ధస్త్‌కు గుడ్‌బై.. ఆ షోలోకి ఎంటర్

  జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే.. ముక్కు అవినాష్‌కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ వైపు వాటిని చేసుకుంటూనే.. షోలో కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ షోకు గుడ్‌బై చెప్పేశాడు. దీనికి కారణం అతడికి బిగ్ బాస్ షోలో అవకాశం దక్కడమే. అంతేకాదు, అందులో మానేసినందుకు పది లక్షలు కూడా చెల్లించాడని చెప్పుకొచ్చాడు.

  బిగ్ బాస్ షోలో నిరాశ.. పేరు మాత్రం

  బిగ్ బాస్ షోలో నిరాశ.. పేరు మాత్రం

  ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలోనే అతడిని టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. అందుకు అనుగుణంగానే అతడు చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. దీంతో ఈ యంగ్ కమెడియన్ టైటిల్ గెలవడం ఖాయం అన్న టాక్ కూడా వినిపించింది. అయితే, అతడు చివరి వారంలో ఎలిమినేట్ అయ్యాడు. కానీ, బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు దక్కించుకున్నాడు.

  హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

  బిగ్ బాస్ తర్వాత అందులో సెటిల్

  బిగ్ బాస్ తర్వాత అందులో సెటిల్

  బిగ్ బాస్ షోలో విజయం సాధించకున్నా.. దాని పుణ్యమా అని ముక్కు అవినాష్ స్టార్ మాలోనే వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఈవెంట్లలో భాగం అయిన అతడు.. చాలా సినిమాల్లోనూ నటించాడు. అలాగే స్టార్ మాలో ప్రారంభమైన 'కామెడీ స్టార్స్' అనే షోలోనూ భాగం అయ్యాడు. అందులో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అప్పటి నుంచి సత్తా చాటుతున్నాడు.

  భార్యతో కలిసి ఆ షోలో.. రచ్చ రచ్చ

  భార్యతో కలిసి ఆ షోలో.. రచ్చ రచ్చ

  ముక్కు అవినాష్ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భార్యతో కలిసి ఓంకార్ నిర్వహిస్తోన్న 'ఇస్మార్ట్ జోడీ' రెండో సీజన్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నాడు. ఇందులో నిర్వహకులు ఇచ్చే టాస్కులను చక్కగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో షోలో ఉన్న అన్ని జోడీల్లో వీళ్లిద్దరు మాత్రం తెగ హైలైట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు.

  బట్టలున్నా లేనట్లే రాశీ ఖన్నా ఫోజులు: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించిన హీరోయిన్

  మరోసారి కొత్తగా మొదలైన కామెడీ షో

  స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిలో మార్పులు చేసి 'కామెడీ స్టార్స్ ధమాకా' అని మొదలెట్టారు. దీనికి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా, దీపిక పిల్లి యాంకర్‌గా చేస్తోంది. ఇందులో జిగేల్ జీవన్‌తో కలిసి ముక్కు అవినాష్ ఓ టీమ్‌గా ఏర్పడ్డాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ కమెడియన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

  Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
  నన్ను నాలుగు ఎపిసోడ్స్‌ తప్పించారు

  నన్ను నాలుగు ఎపిసోడ్స్‌ తప్పించారు


  స్కిట్‌లో భాగంగా జిగేల్ జీవన్ 'ఇది మా అడ్డా' అని పాట పాడాడు. అప్పుడు అవినాష్.. 'నేను కూడా మా అడ్డానే అనుకున్నా. కానీ, ఒక ఈవెంట్‌ కోసం పక్కకు వెళ్లగానే.. నన్ను నాలుగు ఎపిసోడ్లలో లేకుండా తప్పించారు' అంటూ సరదాగానే సదరు ఛానెల్‌పై ఆరోపణలు చేశాడు. దీంతో ఈ ప్రోమో వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే, అవినాష్ కూడా హైలైట్ అవుతున్నాడు.

  English summary
  Jabardasth fame Self-made comedian Mukku Avinash Now Working on Star Maa. Now He Did Shocking Comments in Comedy Stars Dhamaka Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X