అలా ఇళ్లలోకి దూరే రకమేగా? ఢీ కంటెస్టెంట్‌కు జబర్దస్త్ వర్ష షాక్
ఈటీవీకి కొన్నేళ్లుగా పేరు తీసుకొస్తున్న కార్యక్రమం ఢీ. తెలుగు రియాలిటీ షోలలో షోకు మంచి క్రేజ్ ఉంది. ఎంతో మంది ప్రతిభావంతులను ఈ కార్యక్రమం చిత్ర పరిశ్రమకు అందించింది. ప్రస్తుతం 20వ సీజన్‌లోకి అడుగుపెట్టిన ఈ షో ఎంతోమందిని అలరిస్తోంది. వీరిలో పండు అనే కొరియోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఢీలో డ్యాన్సర్‌గా అడుగుపెట్టినప్పటికీ ఈ కుర్రాడు.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సహా ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా తన జీవితంలోని కీలక విషయాలను పంచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..
మద్రాస్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్
పండు మాస్టర్ అసలు పేరు జీ. షణ్ముఖ్. విశాఖపట్నానికి చెందిన ఈ కుర్రాడి తండ్రి ఆటోడ్రైవర్, తల్లి పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ. పండుకు మూడేళ్లు ఉన్నప్పుడే అతని తల్లి కన్నుమూశారు. దీంతో బంధువుల ఇంట్లో పెరిగిన పండు.. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతిభావంతుడు పండు. తన చిన్నతనంలో ఏనాడు డ్యాన్స్ వేయలేదు పండు, అలాగే కొరియోగ్రాఫర్ అవ్వాలని కూడా లేదు. అలాంటిది కాలేజీలో జాయిన్ అయ్యాక ఓ డ్యాన్స్ టీమ్‌లో చేరిన పండు.. ఇక డ్యాన్సర్‌గానే కెరీర్‌లో ముందుకు సాగాలని అనుకున్నాడు.

డ్యాన్స్ ఈవెంట్స్‌లో కంటెస్టెంట్
2014లో డ్యాన్స్ తమిజ డ్యాన్స్ సీజన్ 1లో పండు పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత కింగ్స్ ఆఫ్ డ్యాన్స్‌లో పాల్గొన్న అతను సెమీ ఫైనల్ వరకు చేరుకున్నాడు. 2017లో జితు మాస్టర్ ఢీ 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వెతుకుతుండగా.. అతని ఫ్రెండ్ పంకజ్ ద్వారా ఈ విషయం తెలిసి జితూని సంప్రదించాడు పండు. దీంతో పండుకు ఢీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. కొన్నేళ్లుగా ఢీ షోలో ట్రావెల్ చేస్తోన్న ఈ కుర్రాడు ఇప్పటి వరకు కప్పు కొట్టలేదు. అతని కంటే వెనుక వచ్చిన జూనియర్స్ కప్ కొడుతుండగా అతని కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. తాజాగా వర్ష పొడ్‌కాస్ట్‌లో పండు కీలక విషయాలు చెప్పాడు.
బాబు ఇళ్లలో దూరే రకం
ఇటుక మీద ఇటుక పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు అని వర్ష ప్రశ్నించగా.. ఇటుక మీద పెట్టడం వరకే అవుతోందని పండు ఆన్సర్ ఇచ్చాడు. బాబు ఇల్లులు కట్టే టైప్ కాదు.. ఇంట్లో దూరే రకమని వర్ష పంచ్ విసిరింది. పిలిచి బ్యాడ్ చేస్తున్నారని పండు అనగా.. మిమ్మల్ని కొత్తగా చేయాలా? ఏంటీ అని వర్ష ప్రశ్నించింది. ఎన్ని సీజన్ల నుంచి ఢీ చేస్తున్నారు మీరు? ఈసారైనా కప్ కొడతారా? అని నిలదీసింది. దానికి ఈ సాల కప్ నమదే అంటూ వేలెత్తి తన మేనరిజం చూపించాడు పండు. కొన్ని విషయాలు వినడానికి బాధగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు డ్యాన్స్ చేసినా కూడా డ్యాన్స్ చేయడం లేదని అంటారు. ఏ జడ్జిమెంట్‌తో డ్యాన్స్ చేయడం లేదని అంటారో నాకు అర్ధం కావడం లేదని సీరియస్ అయ్యాడు పండు.
ఇల్లు కూడా లేదు
మీ కంటే జూనియర్స్ మీ కళ్లముందే కప్ తీసుకుని వెళ్లినవారు ఉన్నారని వర్ష ప్రశ్నించగా.. ఎవరైతే నన్ను చూస్తున్నారో, వాళ్లని ఎంటర్‌టైన్ చేయగలిగానా? లేదా? అన్నదే నేను చూస్తాని చెప్పాడు. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రదీప్ అన్నే నాకు హెల్ప్ చేశాడు. ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ.. నీకు అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని నీకు మైండ్ సెట్‌లో ఉన్నప్పుడు దానిని లవ్ అని చెప్పుకోవడం వేస్ట్. నిజంగా ఎవరైనా మోసం చేస్తే కర్మ అనేది ఒకటుంటుంది.. అది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. డబ్బులు లేకపోతే ఎవ్వరూ మనకి వాల్యూ ఇవ్వరు.. నాకు ఇప్పటి వరకు సొంతిల్లు కూడా లేదు, నేను ఇంత కష్టపడేది నా ఫ్యామిలీ కోసం అని ఎమోషనల్ అయ్యాడు పండు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











