‘వర్కవుట్ కాదనుకొంటే బ్రేకప్ చెప్పేస్తా.. ఆ విషయంలో టైమ్ వేస్ట్ చేయను’
యాంకర్‌గా, మోడల్‌గా రాణిస్తూనే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో తనకు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకొని తన ప్రతిభను ప్రూవ్ చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆమె జీవితాన్ని ఆస్వాదించే తీరు, సోషల్ మీడియాలో ఆమె లైఫ్ స్టైల్ ఎప్పటికీ ప్రశ్నగానే ఉంటుంది. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన బ్రేకప్, లవ్ అఫైర్ విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తర్వాత నా కెరీర్ రకరకాలుగా మలుపు తిరిగింది. సోహైల్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే ఓ వ్యక్తితో అఫైర్, బ్రేకప్ విషయాలు తనదైన శైలిలో వెల్లడించారు. తన ప్రేమ, కెరీర్, బ్రేకప్ విషయాలను ఆసక్తిగా పంచుకొన్నారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

నా ప్రియుడితో బ్రేకప్‌కు విషయంలో నేనే నిర్ణయం తీసుకొంటాను. బ్రేకప్ విషయాన్ని నేనే చెప్పాలి. నా పార్ట్‌నర్ చెబితే నేను ఒప్పుకొను. ప్రతీ బ్రేకప్‌లో జీవితం గురించి, వ్యక్తుల గురించి తెలుసుకొంటాను. ఎదుటి మనిషిని నమ్మకూడదు. ముఖ్యంగా మగాళ్లను నమ్మకూడదు అని తెలుసుకొంటాను. అఫైర్ సమయంలో అబ్బాయిలను అసలే నమ్మకూడదు అని ఇనయ సుల్తానా అన్నారు.
ఫస్ట్ బ్రేకప్.. నా లాస్ట్ బ్రేకప్‌కు పెద్దగా తేడా ఏమీ లేదు. ఏ బ్రేకప్ అయినా నా వైపు నుంచే ఆ నిర్ణయం రావాలనేది నా మనస్తత్వం నాది. పరస్పర ఒప్పందంతో జరిగితే అందులో స్పార్క్ ఉండదు. బ్రేకప్‌లో ఆ ఫ్లో ఉండదు. మనకు నచ్చిన వాడు బ్రేకప్ అయినా మన వద్దకు వస్తాడని నా అభిప్రాయం. బ్రేకప్ విషయంలో బాధపడుతూ కూర్చోకూడదు. నీకు నచ్చలేదా? రిలేషన్ కొనసాగించడం ఆపేయాలి. బాధపడుతూ రిలేషన్‌లో ఉండటం టైమ్ వేస్ట్ అని ఇనయా సుల్తానా అన్నారు.
నాకు అఫైర్, డేటింగ్, రిలేషన్‌షిప్ కంటే.. కెరీర్.. నా లైఫ్ గోల్స్ ముఖ్యం. ఒక ఎమోషన్ కోసం జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. బిగ్‌బాస్ తర్వాత ఓ వ్యక్తితో ట్రావెల్ అయ్యాను. విదేశాల్లో అతడితో వాష్ రూమ్‌లో ఫోటోలు దిగాను. బీచ్‌లో ఎంజాయ్ చేసిన విషయం నిజమే. అయితే ఆయనతో నాకు బ్రేకప్ చెప్పలేదు. కేవలం రిలేషన్‌లో బ్రేక్ తీసుకొన్నాను. కొంత సమయం తర్వాత మళ్లీ కలువాలని ఓ నిర్ణయానికి వచ్చాం అని ఇనయ సుల్తానా తెలిపారు.
రిలేషన్‌షిప్‌లో పర్‌ఫెక్షన్ గురించి ఆలోచిస్తే.. అది వర్కవుట్ కాదు. అన్ని విషయాల్లో ఎవరూ కూడా ఫర్‌ఫెక్ట్ కూడా ఉండలేరు. జీవితంలో అన్ని సక్రమంగా జరుగాలనే రూల్ లేదు. నాకు నచ్చిన వ్యక్తి కావాలనుకొంటే ఎప్పటికైనా తిరిగి వస్తాడు. వారి కోసం వేచి ఉండాలి అనేది నా అభిప్రాయం. నా మనసులో ఉన్న విషయాన్ని నేను బాగా నమ్ముతాను అని ఇనయ సుల్తానా చెప్పింది. అయితే ఒక బంధం వర్కవుట్ కాదనుకొంటే.. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోననే విధంగా ఆమె క్లారిటీ ఇచ్చారు


Click it and Unblock the Notifications











