Intinti Gruhalakshmi July 7 Episode: బలాదూర్ తిరగడానికే తులసి విడాకులు.. తప్పు అక్కడే జరిగిందంటూ!
ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాయర్ వచ్చి విడాకులపై విచారణ కోసం రేపు ఉదయం కోర్టుకు రావాలని తులసికి చెబుతాడు. అప్పుడామె ఈ సారి కచ్చితంగా విడాకులు కావాలని చెబుతుంది. అలాగే, నందూకు కూడా వాయిదా వేయొద్దని చెప్పమంటుంది. ఈ విషయం లాయర్ అతడికి చెబుతాడు. దీంతో లాస్య నందూ మనసును విరగ్గొట్టే ప్రయత్నాలు చేసేస్తుంది.

తలసిని చూసి బాధ పడిపోయిన పిల్లలు
కోర్టుకు వెళ్లేందుకు తులసి సిద్ధం అవుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆమె బయలుదేరే సమయంలో అందరూ బాధ పడుతుంటారు. అప్పుడు అభి, దివ్య తన తల్లి పరిస్థితి చూసి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. దీనికి తులసి 'మీరు చిన్న పిల్లలు. ఈ విషయాలను పట్టించుకోకూడదు' అని చెబుతుంది. ఆ తర్వాత మామగారు కూడా ఎప్పటిలాగే ఆమె ధైర్యం చూసి షాకవుతాడు.

బలాదూర్ తిరగడానికే విడాకులు అంటూ
అందరూ ఎమోషనల్ అవుతోన్న సమయంలో అనసూయ అక్కడకు వస్తుంది. అప్పుడు 'నీ డ్రామాలు ఆపమ్మా. త్వరగా వెళ్లి నా కొడుక్కి విడాకులు ఇచ్చేయ్' అంటుంది. దీనికి తులసి 'మీరు అనుకున్నదే చేస్తా. మీ పూజలు ఫలిస్తాయి' అంటుంది. దీంతో అనసూయ 'నువ్వేమైనా నాకోసం ఇస్తున్నావా? బలాదూర్ తిరగడానికి, వ్యాపారాలు చేయడానికే ఇస్తానంటున్నావ్' అని అంటుంది.

అనసూయపై మాధవి.. మోహన్ ఆగ్రహం
తులసి బయటకు రాగానే మాధవి, మోహన్ కనిపిస్తారు. వాళ్లిద్దరూ 'తులసి.. నువ్వు మరోసారి ఆలోచించు' అని అంటారు. దీనికి ఆమె అన్నీ ఆలోచించే నిర్ణయించుకున్నా అంటుంది. అప్పుడు అనసూయ బయటకొచ్చి నోటికొచ్చినట్లు తిడుతుంది. దీంతో మాధవి, మోహన్ ఆమెపై ఫైర్ అవుతారు. 'నీ కూతురిని అయినందుకు సిగ్గుగా ఉంది' అని మాధవి తన తల్లిని ఓ రేంజ్‌లో తిడుతుంది.

అత్తగారికి మోహన్ బుద్ది చెప్పే ప్రయత్నం
తులసిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో మోహన్ అత్తగారిపై తిరగబడతాడు. 'నేను మీ కూతురికి విడాకులు ఇస్తానంటే బాధ పడ్డారు. అదే మీ కొడుకు తులసికి విడాకులిస్తానంటే ప్రోత్సహిస్తున్నారు. మీకు కూతురు ఒకలా.. కోడలు ఒకలానా? మీ పోలికలు మాధవికి రానందుకు సంతోషం. తులసి నువ్వేమీ బాధ పడకమ్మా. నీకు అండగా ఉంటాము' అంటూ చెబుతాడు.

లాస్యను మరొక్కసారి అలెర్ట్ చేసిన భాగ్య
తులసి విడాకులకు సిద్ధం అయిన సంతోషంలో భాగ్య.. లాస్య దగ్గరకు వస్తుంది. 'తులసక్క.. బావగారు విడాకులు తీసుకుంటున్నారన్న సంతోషంలో ఇంత మంచిగా రెడీ అయ్యావా? ముందు వాళ్లకు విడాకులు రానివ్వు తర్వాత సంతోష పడుదువు గానీ. తులసక్క రెడీగానే ఉంది.. కానీ బావ గారి మీదే నా డౌట్. ఆయనెక్కడ మనసు మార్చుకుంటారో' అని ఆమెను అలెర్ట్ చేస్తుంది.

లాస్య కన్నింగ్ ప్లాన్... ఓదార్చిన నందూ
కోర్టుకు వెళ్లేందుకు రెడీ అయిన నందూతో లాస్య 'ఈ సారి కచ్చితంగా విడాకులు ఇస్తావు కదా' అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు నందూ 'అప్పుడంటే తులసి ఏమైపోతుందో అని వాయిదా వేశా. ఇప్పుడు ఆమె బిజినెస్ చేస్తూ తన పని తాను చేసుకుంటుంది. ఈ సారి కచ్చితంగా ఇస్తాను. ఆ వెంటనే మనిద్దరం ఒక్కటవుతాం' అని అంటూ ఆమెను హత్తుకుని ఓదార్చుతాడు.
Recommended Video

తప్పక్కడే జరిగిందని తులసి మదర్ బాధ
తులసి కోర్టు దగ్గరకు వెళ్లగానే ఆమె తల్లి అక్కడ కనిపిస్తుంది. ఆ వెంటనే ఇక్కడికి నువ్వెందుకు వచ్చావని ఆమెను ప్రశ్నిస్తుంది. అప్పుడామె 'అసలు నేను మీ ఫంక్షన్‌కు రాకున్నా బాగుండేది. నేను రావడం వల్లే గొడవ జరిగింది. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు' అని బాధ పడుతుంది. దీనికి తులసి 'నీ తప్పేమీ లేదమ్మా.. ఇది ఎప్పుడో అనుకున్నదే కదా' అని బదులు ఇస్తుంది.


Click it and Unblock the Notifications











