ప్రేమకి వయసుతో పనేముంది.. రూమర్లపై అలా హింట్ ఇచ్చిన సురేఖావాణి!
సురేఖ వాణి అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. చేసేది సాంప్రదాయబద్ధమైన పాత్రలే అయినా బయట మాత్రం ఆమె ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా అక్క, వదిన, అమ్మ పాత్రలతో సినిమాల్లో కనిపించే ఈ నటి రియల్ జీవితంలో మాత్రం కూతురితో పోటీపడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమ వివాహం
స్వతహాగా సీరియల్స్ కి దర్శకత్వం వహించే సురేష్ తేజతో ప్రేమలో పడిన సురేఖ వాణి ఆయనను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆయన అనుకోకుండా కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే బహార్థ మరణంతో చాలా రోజులు బాధలో మునిగిపోయిన ఆమె తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది

కూతురితో పోటీ పడుతూ
భర్త ఉన్న సమయంలో సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు మాత్రం కూతురు తో పోటీ పడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం చూసి ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నా సరే ఆమె ఏ మాత్రం పట్టించుకోదు.. తన పని తాను చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది.

ఏజ్ అనేది ప్రేమలో ఒక నెంబర్
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, అప్ డేట్స్ ఇస్తూ ఉండే సురేఖ వాణి నిన్న సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. ప్రేమకు వయసుతో పనిలేదు అని పేర్కొన్న ఆమె ఏజ్ అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దానిని ఉదాహరిస్తూ తన కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటల ఫోటోలను పోస్ట్ చేసింది.. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ తో పాటు మరో మూడు హాలీవుడ్ జంటలను ఆమె పోస్ట్ చేసింది.

మళ్ళీ పెళ్లి
అయితే ఆమె ఉద్దేశంతో దీన్ని షేర్ చేసిన తెలియదు కానీ ఇప్పుడు చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కూడా మరో వివాహం అది కూడా చిన్న వయసు వాడిని చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండో పెళ్లి గురించి చర్చ జరిగినప్పుడు ఆమె స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు.. రెండో వివాహం చేసుకోవడం తప్పేమీ కాదని కాకపోతే తాను మాత్రం ఇప్పట్లో చేసుకోలేని చెప్పుకొచ్చింది.. అంతేకాక డబ్బున్న వాడిని చూసి పెట్టమని కూడా ఆ మధ్య సరదాగా కామెంట్ చేసింది.

రెండో పెళ్లి
ఇక ఈ మధ్యనే సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడంతో సురేఖా వాణి కూడా రెండో వివాహం చేసుకోబోతోంది అని ప్రచారం జరిగింది ఈ విషయాన్ని సురేఖ వాణి 1,2 సార్లు ఖండించింది. అయినా అదే ప్రచారం తరచూ జరుగుతూనే రావడంతో ఆమె ఈసారి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











