»   » 'జబర్దస్త్' నుంచి తప్పుకోబోతోందనే వార్తపై రేష్మి స్పందన

'జబర్దస్త్' నుంచి తప్పుకోబోతోందనే వార్తపై రేష్మి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈటివీ పాపులర్ ప్రోగ్రాం 'జబర్దస్త్' లో యాంకర్ గా చేస్తున్న రేష్మిని తెలియని టీవి ప్రేక్షకులు ఉండరు. అనసూయ తప్పుకున్న తర్వాత ఆమె ప్లేస్ లోకి వచ్చిన రేష్మి సమర్దవంతంగానే యాంకర్ గా ముందుకు దూసుకు వెళ్తోంది. వచ్చీరాని తెలుగుతో బాగానే మ్యానేజ్ చేస్తూ తన అందాల ప్రదర్శనతో షోకు లుక్ తీసుకువచ్చి యూత్ ని కనెక్టు చేస్తోంది.

'Jabardasth' anchor Rashmi Gautham is not quitting

అయితే గత కొద్ది రోజులుగా రేష్మి 'జబర్దస్త్' నుండి తప్పుకోబోతుందనే వార్త మీడియాలో గుప్పుమంది. 'జబర్దస్త్' తో బాగా ఫేమస్ అయిన రేష్మి కి వరుస సినిమా అవకశాలు వస్తున్నాయని, దాంతో ఈ ప్రోగ్రాం కు పుల్ స్టాప్ పెట్టేసి వెండి తెర ఫై మెరవాలని చూస్తుందని ఆ వార్తల సారాంసం. అయితే వీటిని ఆధారం లేని రూమర్స్ అని రేష్మి కొట్టిపారేసింది తన ట్విట్టర్ ద్వారా. ఆమె ఏమందో మీరూ చూడండి.

ప్రస్తుతం రేష్మి... చారుశీల అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో జశ్వంత్ అనే కొత్త హీరో, శ్రీనివాస్ ఉయ్యూరు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. చారుశీలను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్ అనే చిత్రం లో కూడా రేష్మి నటించింది.

English summary
"Too many baseless rumours. Time to clear the air. I'm not quitting or getting replaced or exiting jabardast or extra jabardast", says Rashmi Gautham, clarifying that the rumours in existence are not true.
Please Wait while comments are loading...