»   » ధనరాజ్ ముదురు, ‘బిగ్ బాస్’ ఎలిమినేట్ చేసిందెవరినో తెలుసా?

ధనరాజ్ ముదురు, ‘బిగ్ బాస్’ ఎలిమినేట్ చేసిందెవరినో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ ఇంట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలివారం బిగ్ బాస్ ఇంటి నుండి అందరూ ఊహించిన విధంగానే ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఇంటి నుండి బయటకు వచ్చిన సదరు వ్యక్తి వారం పాటు ఇంట్లో జరిగిన పరిణామాలను షో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్‌తో పంచుకున్నారు.

ఎలిమినేషన్ కంటే ముందు ఎన్టీఆర్ ఇంటి సభ్యులకు ఆసక్తికర క్విజ్ నిర్వహించారు. కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనికి ఇంటి సభ్యులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇలా రకరకాల ఊహించని టాస్క్‌లతో బిగ్ బాస్ తొలి ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగింది.

అర్చన గురించి

అర్చన గురించి

మధు ప్రియగారు యాటిట్యూడ్ తగ్గించుకోవాలని అర్చన ఇచ్చిన ఉచిత సలహా కరెక్టా కాదా?... అనే ప్రశ్నకు ఇంటి సభ్యుల నుండి 5 అవును, 6 కాదు అని సమాధానాలు వచ్చాయి.

Bigg Boss Telugu: NTR Warning To DhanRaj
ధనరాజ్ ముదురు

ధనరాజ్ ముదురు

బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో ధనరాజ్ అందరి కంటే ముదురు అని ఎంత మంది భావిస్తున్నారు అనే ప్రశ్నకు 11 మంది సభ్యుల నుండి అవును సమాధానం వచ్చింది.

ముమైత్ వల్ల పనిష్మెంట్

ముమైత్ వల్ల పనిష్మెంట్

ముమైత్ తెలుగు నేర్చుకోకుండా మాకు పనిష్మెంట్ ఇస్తోంది. మాకు అవకాశం వస్తే ఆమెకు పనిష్మెంట్ ఇస్తాం అని ఎంతమంది కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ఇంటి సభ్యులు స్పందిస్తూ... 10 మంది ఎస్, ఒకరి నుండి నో అని సమాధానం వచ్చింది.

కల్పన కావాలనే

కల్పన కావాలనే

హౌస్ మేట్స్ అందరి దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేయడానికే కల్పన పనులు నెత్తిమీద వేసుకుంటుంది, అందరి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటోందనే ప్రశ్నకు నలుగురు ఇంటి సభ్యుల నుండి నో, ఏడుగురు ఇంటి సభ్యుల నుండి అవును అని సమాధానం వచ్చింది.

ఆదర్శ్ చేసిన ప్రాంక్

ఆదర్శ్ చేసిన ప్రాంక్

ఆదర్శ్ ఆ మధ్య పిచ్చివాడిలా ప్రవర్తింనట్లు ప్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. ఆదర్శ్ చేసిన ప్రాంక్ ఎవరికీ నచ్చలేదు? అనే ప్రశ్నకు 8 మంది ఇంటి సభ్యుల నుండి నో, ఇద్దరి నుండి ఎస్ అని సమాధానం వచ్చింది.

కత్తి కార్తీక గురించి

కత్తి కార్తీక గురించి

కత్తి కార్తీక నామినేషన్ నుండి అనవసరంగా సేఫ్ జోన్ లోకి వెళ్లింది అనే ప్రశ్నకు 4గురు వ్యక్తుల నుండి ఎస్.... 5 గురు వ్యక్తుల నుండి నో అనే సమాధానం వచ్చింది.

ప్రిన్స్ గోడమీద పిల్లి

ప్రిన్స్ గోడమీద పిల్లి

ప్రిన్స్ గొడమీద పిల్లి లాంటోడు.... అనే ప్రశ్నకు ఏడుగురు సభ్యుల నుండి ఎస్, నలుగురు సభ్యుల నుండి నో అనే సమాధానం వచ్చింది.

సంపూ నాటకం

సంపూ నాటకం

ఆరోగ్యం బాగోలేదని సంపూ చేసిందంతా నాటకం అనే ప్రశ్నకు నలుగురు ఇంటి సభ్యుల నుండి ఎస్, ఆరుగురు ఇంటి సభ్యుల నుండి నో అనే సమాధానం వచ్చింది.

మధు ప్రియ

మధు ప్రియ

గతంతో పోలిస్తే మధు ప్రియ ఇపుడు కొంత సెటిలయ్యారు అనే ప్రశ్నకు స్పందిస్తూ.... 11 మంది నుండి ఎస్ అనే సమాధానం వచ్చింది.

శివ బాలాజీ కావాలనే

శివ బాలాజీ కావాలనే

తన మీద ఫోకస్ ఎక్కువగా ఉండాలని శివ బాలాజీ చిన్న విషయంపై రచ్చ చేశారు అనే ప్రశ్నలకు 11 మంది ఇంటి సభ్యుల నుండి నో అనే సమాధానం వచ్చింది.

సమీర్ సీక్రెట్

సమీర్ సీక్రెట్

సమీర్ కేప్టెన్ కాక పోయినా ఒక సీక్రెట్ కెప్టెన్ లా బిహేవ్ చేశాడు అనే ప్రశ్నకు నలుగురు సభ్యుల నుండి ఎస్ అని, ఆరుగురు సభ్యుల నుండి నో అనే సమాధానం వచ్చింది.

అంతా హానెస్ట్

అంతా హానెస్ట్

ఇంట్లో ఉన్నవారంతా ఈ క్విజ్‌లో హానెస్టుగా ఆన్సర్ చెప్పారు అనే ప్రశ్నకు.... ముగ్గురు ఎలిమినేషన్ నామినేషన్ సభ్యుల నుండి ఎస్ అనే సమాధానం వచ్చింది.

ఎలిమినేట్ అయిన జ్యోతి

ఎలిమినేట్ అయిన జ్యోతి

ముగ్గురు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వగా... అందులో నుండి చివకు జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ కావడానికి కారణం ఇంటి సభ్యులు కాదని, ప్రేక్షకులే వారి ఓటు ద్వారా మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అని ఎన్టీఆర్ జ్యోతికి వివరించారు.

శతృత్వం లేకుండా బయటకు వచ్చా

శతృత్వం లేకుండా బయటకు వచ్చా

తాను బిగ్ బాస్ ఇంట్లో అందరితో మంచిగా ఉన్నాను, అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాను. నిన్నటి నుండి అందరి యాటిట్యూడ్ చేంజ్ అయింది. అందరూ నన్ను కార్నర్ చేశారు. అందరూ గ్రూపులుగా మారారు. ఈ క్రమంలో నన్ను సైడ్ చేశారు. తొలి రెండు రోజులు కాస్త ఆరగెంటుగా ఉన్న మాట నిజమే. తర్వాత చాలా మారాను. బయటకు రావడం నా బ్యాడ్ లక్. ఎవరితో శతృత్వం లేకుండా బయటకు వచ్చాను... అది చాలు అని జ్యోతి తెలిపారు.

జ్యోతికి ప్రశ్నలు

జ్యోతికి ప్రశ్నలు

బిగ్ బాస్ ఇంట్లో ఎవరి డ్రెస్సింగ్ సెన్స్ బావుంది?

కల్పన బాగాలేదు
ప్రిన్స్ బావుంది

ఎవరు బెస్ట్ కెప్టెన్

ఎవరు బెస్ట్ కెప్టెన్

బిగ్ బాస్ హౌస్ లో 13 మందిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటే ధనరాజ్ అని సమాధానం ఇచ్చింది జ్యోతి. అతడు ఏమీ మనసులో పెట్టుకోడు, ఏదైనా గొడవలు వస్తే తొందరగా క్లియర్ చేయాలని చూస్తారు అని జ్యోతి తెలిపారు.

బిగ్ బాస్ విన్నర్

బిగ్ బాస్ విన్నర్

మీ ఉద్దేశ్యం ప్రకారం బిగ్ బాస్ విన్నర్ఎవరు? అనే ప్రశ్నకు జ్యోతి సమాధానం ఇస్తూ..... శివ బాలాజీ అని చెప్పారు.

తర్వాత ఎలిమినేట్ అయ్యేది

తర్వాత ఎలిమినేట్ అయ్యేది

మీ తర్వాత బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే ప్రశ్నకు జ్యోతి స్పందిస్తూ..... సంపూ మెంటల్లీ సిక్ అయ్యాడు, అతడు ఎలిమినేట్ అయిపోతాడేమో? లేక పోతే మహేష్ కత్తి అని జ్యోతి సమాధానం ఇచ్చారు.

జ్యోతికి రాపిడ్ ఫైర్ ప్రశ్నలు, ఆమె సమాధానాలు

జ్యోతికి రాపిడ్ ఫైర్ ప్రశ్నలు, ఆమె సమాధానాలు

మానిప్యులేటర్ ఎవరు? అర్చన

అట్రాక్టివ్? ధనరాజ్
ఇన్నోసెంట్? మధుప్రియ
ఫేక్ ? ముమైత్ ఖాన్
బెస్ట్ బడ్డీ? సమీర్
వీకెస్ట్ ? మధు ప్రియ
స్మార్ట్: ఆదర్శ్

జ్యోతి మీద ఆరోపణలు

జ్యోతి మీద ఆరోపణలు

జ్యోతి మీద బిగ్ బాస్ ఇంట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అందులో మొదటిది పని దొంగ అని, రెండోది ఆమెది ఫేక్ యాటిట్యూడ్ అని, ఎప్పుడూ నటిస్తూ ఉంటుందని, మూడోది ముమైత్‌కు ఖాన్ టీచర్‌గా సరిగా బాధ్యతలు నిర్వహించలేదనే ఆరోపణలు వచ్చాయి. తాను పని దొంగ కాదని....తాను రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో బిగ్ బాస్ ఇంట్లో అలాగే ఉన్నానని...... ముమైత్ ఖాన్ తాను చెప్పేది వినేది కాదని జ్యోతి వివరణ ఇచ్చుకుంది.

English summary
Jyothi Eliminated From Bigg Boss House. The first week's elimination episode of the controversial reality show 'Big Boss Telugu' was aired.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu