For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీవీ యాక్టర్ అరెస్ట్.. మహిళపై రేప్.. సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేస్తానని బ్లాక్‌మెయిల్

|

మహిళపై దారుణంగా లైంగిక దాడి చేసిన వ్యవహారంలో టీవీ నటుడు కరణ్ ఒబేరాయ్ కటకటాల లెక్కిస్తున్నాడు. కరణ్ ఒబేరాయ్ అరెస్ట్ వారం హిందీ టెలివిజన్ ఇండస్ట్రీని కుదిపేసింది. సోమవారం ఉదయమే మీడియాలో ఈ వార్త ప్రముఖంగా మారడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకొన్నది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ముంబై పోలీసుల కథనం ప్రకారం..

ముంబై పోలీసులు వెల్లడించిన ప్రకారం. . ఓ మహిళను టీవీ నటుడు ఒబేరాయ్ మానభంగం చేశాడు. అంతేకాకుండా ఆ వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పకపోతే వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు అతడిని తనను వదిలేయాని ప్రాధేయపడినా గానీ స్పందించలేదు అని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుతోనే

బాధితురాలి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్ష్మాసృతి కింద సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 384 (బెదిరింపులు, డబ్బు గుంజేందుకు ప్రయత్నం) ప్రకారం కేసు నమోదు చేశాం. కేసు ఆధారంగా కరణ్ ఒబేరాయ్‌ని అరెస్ట్ చేశాం. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపాం. మెడికల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీసులు వెల్లడించారు.

గాయకుడిగా కరణ్ ఒబేరాయ్

వాస్తవానికి కరణ్ ఒబేరాయ్ గాయకుడు. దేశవ్యాప్తంగా తన పాటలతో ఆకట్టుకొన్నాడు. బాయ్ అనే పాప్ బ్యాండ్‌లో సభ్యుడు కూడా. ఈ బ్యాండ్‌లో సుధాంశ్ పాండే, షెరీన్ వర్గీస్, సిద్ధార్థ్ హల్దీపూర్, చైతన్య భోస్లే తదితరులు ఉన్నారు. 2001 నుంచి ఈ బ్యాండ్ హిందీ ర్యాప్ ప్రపంచంలో సత్తా చాటుతున్నది. పలు వెబ్ సిరీస్‌లో కూడా కరణ్ ఒబేరాయ్ నటించాడు.

టెలివిజన్ నటుడిగా

కరణ్ ఒబేరాయ్ నటించిన ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ మంచి ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ నటి రిచా చద్దా‌కు బాయ్‌ఫ్రెండ్‌గా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌లో కనిపించాడు. తాజాగా జస్సీ జైసీ కోయి నహీ హై హిందీ సీరియల్‌లో నటించాడు. ఈ సీరియల్‌లో రాఘవ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు.

మే 9వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో

గాయకుడు, నటుడిగానే కాకుండా మోడల్‌గా కూడా కరణ్ ఒబెరాయ్ పాపులర్. ఎఫ్‌బీబీ, రాయల్ ఎన్‌ఫీల్డ్, అల్టో, జాక్ అండ్ జోన్స్, లంబొర్గిని తదితర ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరించాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తాజా కేసులో కరణ్ మే 9వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడని సమాచారం.

English summary
TV actor Karan Oberoi who is known for his role in Jassi Jaisi Koi Nahin was arrested by Mumbai Police on Monday morning for allegedly raping and blackmailing a woman. In Jassi Jaisi Koi Nahin, he played the part of Raghav. As per ANI, an FIR was registered with the Oshiwara Police Station in Mumbai under two sections of the Indian Penal Code 376 (rape) and 384 (extortion). In a statement, the police said, "Oberoi not only raped the woman and filmed the act but also demanded money from the victim threatening to release the video if she did not pay up."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more