Karthika Deepam 2 October 10th: శివన్నారాయణ కంపెనీని కొట్టేసేలా వైరా కుట్ర.. కార్తీక్ మైండ్ గేమ్ దెబ్బకి షాక్
Photo Courtesy: JioHotstar
శివన్నారాయణ, కార్తీక్, పారులు కారులో వెళ్తుండగా.. దాస్‌తో నడిరోడ్డుపై జ్యోత్స్న మాట్లాడుతూ కనిపిస్తుంది. అలాగే తన తండ్రిని నిజం చెప్పొద్దని తలపై ఒట్టు వేయించుకుంటుంది . దాంతో ఇక్కడేం జరుగుతుందని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. దాంతో పారు, జ్యోత్స్నలకి ముచ్చెమటలు పోస్తాయి. నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పమని జ్యోత్స్న అడుగుతోందని, నేను వద్దు అనేసరికి తనతో ఒట్టు వేయించుకుంటోందని అబద్ధం చెబుతాడు దాస్. దాంతో జ్యోత్స్న, పారులు ఊపిరి తీసుకుంటారు.
మన మాటలు, ఇంట్లోని పరిణామాలతో జ్యోత్స్న, పారులు వణికిపోతున్నారని మనకి నిజం తెలిసిపోయిందని అనుకుంటున్నారని.. అందుకే దాస్ మావయ్యని జ్యోత్స్న కలిసిందని అంటాడు కార్తీక్. తాతయ్య ఏ విషయాన్ని అంత త్వరగా వదలడని ఆయనకి అనుమానం మొదలైందని చెబుతాడు. దాస్- జ్యోత్స్నలు ఎందుకు కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారని దశరథ్‌ని అడుగుతాడు శివన్నారాయణ. బోర్డ్ మీటింగ్‌కి ముందు నాకు నిర్ణయం తీసుకునే టైం వచ్చిందని శివన్నారాయణ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే కానీ ఈ సమస్యలకు చెక్ పడదని జ్యోత్స్నకి చెబుతుంది పార్ధు. నేను పెళ్లంటూ చేసుకుంటే అది బావనే అని తేల్చేస్తుంది జ్యోత్స్న. బోర్డ్ మీటింగ్ మొదలయ్యాక.. కంపెనీ నష్టాల గురించి చెబుతాడు దశరథ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 10వ తేదీ 485వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బోర్డ్ మీటింగ్‌లో కంపెనీ నష్టాల గురించి చెబుతాడు దశరథ. దాంతో జ్యోత్స్న మాట్లాడుతూ.. ఈ నష్టాల నుంచి కంపెనీని బయటపడేయాలంటే సీఈవోగా నేనొక డెసిషన్ తీసుకున్నానని చెబుతుంది. ఇంతలో బోర్డ్ మెంబర్స్ మధ్యలో మాట్లాడుతూ.. ఈ కంపెనీలో మీకు 50 శాతం షేర్స్ ఉంటే, మిగిలిన 50 శాతం షేర్లు మావని చెబుతాడు. మేమింకా మీతోనే ఉండి ఈ బిజినెస్‌ను కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదని షేర్స్ అమ్మేయాలని అనుకుంటున్నామని చెప్పడంతో శివన్నారాయణ, దశరథ, జ్యోత్స్స షాక్ అవుతారు. ఎవరికి అమ్మాలని అనుకుంటున్నారని దశరథ అడగ్గా... ఆ పర్సన్‌కి ఇక్కడికి పిలిచామని, కాసేపట్లో వచ్చేస్తాడని చెబుతారు బోర్డ్ మెంబర్స్.
ఇంతలో అక్కడికి వైరా వచ్చి కార్తీక్‌ని చూస్తాడు. ఎవరతను అని తన మనిషిని వైరా అడగ్గా.. శివన్నారాయణ గారి డ్రైవర్ అని చెబుతాడు. డ్రైవర్‌ని శివన్నారాయణ పక్కన కూర్చోబెట్టుకున్నారా? వాళ్లని కూడా ఈ పరిస్ధితికే తీసుకొద్దామని చెబుతాడు వైరా. ఆ మాటలు విన్న కార్తీక్ టెన్షన్ పడతాడు. వైరా లోపలికి వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతాడు. మీ కంపెనీలో మిగిలిన 50 శాతం షేర్స్ నేనే కొంటున్నానని అంటాడు వైరా. తప్పు చేస్తున్నారని బోర్డు మెంబర్స్‌ని హెచ్చరిస్తాడు దశరథ. నువ్వు నీ కూతురికి సీఈవోని చేసినప్పుడు నేనేమైనా ఎదురు చెప్పామా అని వాళ్లు కూడా నిలదీస్తారు. మీ కంపెనీలో మేం ఉండకూడదని అనుకుంటున్నామని అందుకే వైరా గారికి అమ్మేస్తున్నామని చెబుతారు.
నువ్వు ఈ షేర్స్ ఎందుకు కొనాలని అనుకుంటున్నావో నాకు తెలియదా? అని వైరాని దశరథ నిలదీస్తాడు. ఓటమి నా తలుపు తట్టి తట్టి విసిగిపోయిందని, అందుకే దానిని నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చానని చెబుతాడు వైరా. మేం ఎవరికీ భయపడమని, కొనుక్కుంటే కొనుక్కోండి అని ఈజీగా చెబుతుంది జ్యోత్స్న. దాంతో భయపడిన కార్తీక్ మనిషి.. వెంటనే బయటికి వచ్చి కంపెనీ వేరే వాళ్ల చేతికి వెళ్లిపోతోందని కార్తీక్‌కి చెబుతాడు. దాంతో ఒక స్లిప్ మీద ఏదో రాసి శివన్నారాయణకి ఇవ్వమని చెబుతాడు. ఈ కంపెనీలోకి వచ్చే రైట్ అతనికి లేదని, నువ్వు అది తెలుసుకోమ్మని జ్యోత్స్నపై మండిపడతాడు దశరథ. ఆ స్లిప్‌ని శివన్నారాయణకి ఇవ్వగా.. కార్తీక్‌ని లోపలికి రమ్మని పిలిపిస్తాడు పెద్దాయన. బావ ఇక్కడికెందుకు అని జ్యోత్స్న అడగ్గా.. నేను ఈ కంపెనీకి ఛైర్మన్‌ని, ఎవరిని పిలవాలో? ఎవరిని వదులకోవాలో? నాకు బాగా తెలుసని అంటాడు శివన్నారాయణ.
కిచెన్‌లో మామిడి పండు పులుపుని దీప చూస్తుండగా పారు వచ్చి పుల్లగా ఉందని చూస్తున్నావా? లేక ఏదైనా విశేషమా? అని అడుగుతుంది. నీ కూతురి బర్త్ డే ఫంక్షన్‌లో నా మనవరాలు అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకుని ఓ పాపనో, బాబునో ఇస్తున్నారా ? అని నిలదీస్తుంది పారు. ఇంతలో సుమిత్ర వచ్చి వేరే వాళ్ల వ్యక్తిగత విషయాలు మీకెందుకు అని మండిపడుతుంది. మనింటి పనిమనిషి యోగక్షేమాలు తెలుసుకోవడం యజమానులుగా మన బాధ్యత అని అంటుంది పారు. కంటికి రెప్పలా చూసుకునే భర్త ఉన్నాడు, పువ్వులో పెట్టి చూసుకునే అత్తగారుందని, మాట పడకుండా చూసుకోవడానికి మేనత్త ఉందని చెబుతుంది సుమిత్ర. దీప నెల తప్పితే మనం కూడా సెలబ్రెట్ చేసుకుంటాం కదా అని అంటుంది పారు.
దీప నీ ఆడపడుచు కోడలు, దీప నీ మేనల్లుడి భార్య కాదా? ఆ లెక్కన చూస్తే దీప నీ కూతురి వరసేనని చెబుతుంది పారు. రేపు అంతా ఒక్కటి అయిపోయి ఒకే ఇంట్లో ఉంటారేమో అని అంటుంది. దీప శ్రీమంతం ఈ ఇంట్లోనే నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుందేమో, 100 మంది పేరంటాళ్లని పిలిచి పట్టుచీరలు, బంగారు నగలు పెట్టి విందు భోజనాలు పెడతావేమో అంటుంది. ఆ మాటలతో దీప చాలా సంతోషిస్తుంది. మీరన్నవి జరిగితే నేను ఆపలేను, అలాగని జరగకూడదని నేను కోరుకోను అంటుంది సుమిత్ర. కార్తీక్ గాడు ఆఫీస్ ముందు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది పారు.
ఇంతలో కార్తీక్ వచ్చి శివన్నారాయణ పక్కన నిలబడతాడు. మీరు మీ డ్రైవర్‌ని పిలిచి ఇక్కడ జరుగుతున్న కథంతా చెప్పాల్సిన పని లేదని వైరా కోప్పడతాడు. డ్రైవర్‌ని మీరు ఛాయ్, సమోసా తీసుకురమ్మని పిలిచారా అని వైరా అనడంతో శివన్నారాయణ, దశరథ కోప్పడతారు. ఛాయ్, సమోసా, మందు అన్ని తీసుకొస్తా.. దాని కంటే ముందు మా బోర్డ్ మెంబర్స్‌తో కాస్త మాట్లాడాలని అంటాడు కార్తీక్. డ్రైవర్‌వి బోర్డ్ మెంబర్‌లా మాట్లాడతావేంటీ? అని ప్రశ్నిస్తాడు వైరా. కార్తీక్ ఈ కంపెనీకి మాజీ సీఈవో అని శివన్నారాయణ చెప్పడంతో వైరా షాక్ అవుతాడు. డ్రైవర్‌కి సీఈవో పోస్ట్ ఇచ్చారా? లేక సీఈవోని డ్రైవర్‌ని చేశారా? అని వైరా సెటైర్లు వేస్తాడు.
వాడు సీఈవోనే కాదు.. నా మనవడు అని శివన్నారాయణ చెప్పడంతో మరి డ్రైవర్‌గా ఎందుకున్నాడని వైరా అడగ్గా.. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెబుతాడు కార్తీక్. ఓ చిన్న కాకాహోటల్ పెట్టుకున్న మిమ్మల్ని జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో బోర్డ్ మెంబర్‌గా చేసిందెవరు? అని కార్తీక్ అడగటంతో శివన్నారాయణ గారు అని భరణి అనే బోర్డ్ మెంబర్ చెబుతాడు. మీ ఇద్దరి కథ కూడా ఇదే అని మిగిలిన ఇద్దరినీ ప్రశ్నిస్తాడు కార్తీక్. మీ తాతగారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, మీ మరదలు కంపెనీని రోడ్డుకు ఈడుస్తున్నా నష్టాలు భరించాలా? అని ప్రశ్నిస్తాడు బోర్డ్ మెంబర్స్. మీరు బయటికి వెళ్లిపోవడానికి మాకు అభ్యంతరం లేదు.. కానీ మన కంపెనీ రూల్స్ ప్రకారం ఈ విషయం ముందుగా ఛైర్మన్ గారికి చెప్పాలని అంటాడు కార్తీక్.
బోర్డ్ మెంబర్స్‌లో ఎవరూ షేర్స్ కొనమని చెప్పిన తర్వాతే మీరు బయటివాళ్లకు అమ్మాలని అంటాడు కార్తీక్. శివన్నారాయణ గారు కొనను అని చెప్పారా? మీరు ఎవరికి అమ్ముతున్నారో? ఆ మనిషి గురించి బోర్డుకు ముందే చెప్పాలని, అంతా ఓకే అన్న తర్వాతే ఆ మనిషిని బోర్డ్ మీటింగ్‌కి పిలవాలని చెబుతాడు కార్తీక్. బోర్డ్ రూల్స్‌ని అతిక్రమించడం క్రైమ్ అని కార్తీక్ బెదిరించడంతో బోర్డ్ మెంబర్స్ భయపడతారు. మీ మీద ఇలాంటి అభియోగాలు వస్తే రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్స్ నుంచి మిమ్మల్ని తీసేస్తారని, అప్పుడు మీరెక్కడా బిజినెస్ చేయలేరని, కనీసం కాకాహోటల్ కూడా పెట్టుకోలేరని అంటాడు కార్తీక్.
మీ వెనుక నేనున్నానని వైరా చెప్పడంతో బోర్డ్ మెంబర్స్ వద్దు అని చెబుతారు. కార్తీక్ సార్ చెప్పినదాంట్లో లాజిక్ ఉందని, నష్టాల్లో కంపెనీ ఉంది కాబట్టే షేర్స్ అమ్మాలని అనుకున్నామని చెబుతాడు. కార్తీక్ సార్ సీఈవోగా ఉన్నప్పుడు భారీగా లాభాలు వచ్చేవని వాళ్లు చెబుతారు. బావ మన కంపెనీలోనే ఉన్నాడని, ఇక మీదట కూడా ఉంటాడని జ్యోత్స్న మీద సీరియస్ అవుతాడు శివన్నారాయణ. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాడని, కానీ మాతోనే ఉంటాడని చెబుతాడు బోర్డ్ మెంబర్స్‌కి చెబుతాడు. కార్తీక్ సార్ ఉంటే మాకు ఏ అభ్యంతరం లేదని బోర్డ్ మెంబర్స్ చెబుతారు. ఈ షేర్స్ మేం అమ్మాలని అనుకోవడం లేదని చెప్పడంతో బోర్డ్ మెంబర్స్‌పై వైరా ఫైర్ అవుతాడు. అందరి ముందు నన్ను ఫూల్‌ని చేశారంటూ జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది.
కంపెనీని కాపాడినందుకు కార్తీక్‌కి శివన్నారాయణ థ్యాంక్స్ చెబుతాడు. ఆ వైరా గాడిని బయటికి గెంటకుండా కూర్చొని కబుర్లు చెబుతారేంటీ అని మండిపడతాడు కార్తీక్. షేర్స్ వాడికి అమ్మేస్తానంటే భరణి అంటే భయమేసిందని, వాడు మన షేర్స్ ఎందుకు కొనాలని అనుకుంటున్నాడో, కొంటే ఏం చేస్తాడో నాకు తెలుసని అంటాడు దశరథ. నీ వల్లే మనం బయటపడ్డామని అంటాడు. వాళ్ల మీద కేసు పెట్టే క్లాజ్ మన కంపెనీ రూల్స్‌లో ఉందా అని కార్తీక్‌ని అడుగుతాడు శివన్నారాయణ. అలాంటిదేమీ లేదని భయపెట్టడానికే అలా చేశానని కార్తీక్ చెబుతాడు. వాడు మనల్ని కాపాడానని దశరథ అనడంతో కంపెనీని కూడా కాపాడాడని అంటాడు శివన్నారాయణ. బయటికి వెళ్లి వైరాను కలుస్తాడు కార్తీక్. ఒక డ్రైవర్ కోసం నీలాంటి వాళ్లు ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. నువ్వేంటో సగం మీ తాత మాటల్లో విన్నాను, మిగతా సగం మీ మేనేజర్ మాటల్లో విన్నానని చెబుతాడు వైరా. నీతో నాకు వైరం లేదని, కానీ దశరథతో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని నువ్వు అడ్డు పడొద్దని కార్తీక్‌కి వార్నింగ్ ఇస్తాడు వైరా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications









