»   » మంచు లక్ష్మీ కొత్త టాక్ షో ...డిటేల్స్

మంచు లక్ష్మీ కొత్త టాక్ షో ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో ‘లక్ష్మీ టాక్ షో', ‘ప్రేమతో మీ లక్ష్మీ' అనే టాక్ షోలతో మంచు లక్ష్మి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు లక్ష్మీ మరో టాక్ షో తో మనముందుకు రానుంది. లక్ష్మీ మంచు చేయనున్న లేటెస్ట్ టాక్ షో పేరు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మంచు లక్ష్మి మాట్లాడుతూ... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పేరుతో జీ తెలుగులో సెలబ్రిటీ టాక్ షో చేయబోతున్నాను. త్వరలో దాని వివరాలు వెల్లడిస్తాను అని అన్నారు. ఈ షోని తను చేసిన షోస్ కంటే డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ప్రోగ్రాంకి సంబందించిన షూటింగ్ ని మే 25న మొదలు పెట్టనున్నారు. అలాగే ఓ ప్రముఖ చానల్ లో జూన్ 1 నుంచి ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. లక్ష్మీ మంచు ఈ షో తో పాటు తన తదుపరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Laksmi Manchu’s new talk show

సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీసిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తదుపరి చిత్రం ఉంటుంది. తొలిసారి బయట ఆర్టిస్టులతో చిత్రం తీస్తారు. మంచు లక్ష్మి నటించడం లేదు, నిర్మాత మాత్రమే.

మంచు లక్ష్మీ నటించిన ‘దొంగాట' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా పలు ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శిచబడుతోంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ అంతా మే 20న జరగనున్న మంచు మనోజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

English summary
Lakshmi Manchu returns to TV with 'Malli Malli Idi Rani Roju'."I will be hosting the show and I'm eagerly waiting to stage a comeback to television. I'm excited about this wonderful opportunity. This show will be a tad different from my previous shows," Lakshmi told.
Please Wait while comments are loading...