»   » ఎంత ఓపిక, ఏం డెడికేషన్ : మురగదాస్ సినిమా గ్యాప్ మహేష్ చేస్తున్నది ఇదే (వీడియో)

ఎంత ఓపిక, ఏం డెడికేషన్ : మురగదాస్ సినిమా గ్యాప్ మహేష్ చేస్తున్నది ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు కు ఈ యాడ్ , ఆ యాడ్ అని లేదు. తన దగ్గరకు చేయమని వచ్చిన ప్రతీ యాడ్ ని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆయన ఆన్ లైన్ లో బస్ టిక్కెట్లు బుక్ చేసుకోమంటూ వరస పెట్టి యాడ్ లు చేసాడు. ఆ యాడ్ లు మీరు క్రింద చూడవచ్చు. ఈ యాడ్ లు టీవిల్లో ప్రసారం కానున్నాయి. అలాగే ఆ యాడ్ లు డైరక్ట్ చేసింది మరెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ యాడ్ లలో మహేష్ బాబు ఆన్ లైన్ లో అభి బస్ టిక్కెట్లు కొనమని సలహా ఇస్తున్నాడు. అదేంటి మహేష్ బాబు కు ఏం పని అంటారా..మరి ఆయన ఇప్పుడు అభి బస్ ఆన్ లైన్ టిక్కెట్ పొర్టల్ కు కూడా బ్రాండింగ్ చేస్తున్నారుగా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈయాడ్ షూటింగ్ కూడా రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తైంది. ఇప్పటికే చాలా బ్రాండ్లను తన కిట్టీలో వేసుకున్న మహేష్ ...ఈ కొత్త యాడ్ తో మనలని పలకరించటానికి రెడీ అయ్యిపోయాడు. ఈ యాడ్ లపై ఓ లుక్కేయండి మరి...

వింటానికే ఎంత డివైన్ గా ఉంది

మహేష్ బాబు తన ప్రక్కన తిరుపతి వెళ్తున్న పాసింజర్ తో మాట్లాడుతూ చేసిన యాడ్ ఇది...

ఇంకొంచెం తగ్గచ్చు

ఇంకో హాఫ్ టిక్కెట్ కూడా తీసుకుని ఉండాల్సింది అంటూ కృష్ణుడుపై పంచ్ లు వేస్తూ మహేష్ ఈ యాడ్ లో...

ప్రతీఓడికీ అభి బస్సే..

తన ప్రక్క ప్రయాణికుడు ప్లైట్ మిస్సై..అభి బస్ ఎక్కితే మహేష్ బాబు ఇలా కామెంట్ చేస్తున్నాడు ఈ యాడ్ లలో...

హిందీలోనూ మహేష్ ఈ యాడ్

మహేష్ బాబు..చేస్తున్న అభి బస్ యాడ్ ని హిందీలో కూడా చేసారు. ఇదిగో ఇక్కడ ఆ వెర్షన్ ని చూడవచ్చు.

ఇవన్నీ మహేష్ ఆల్రెడీ

ఇవన్నీ మహేష్ ఆల్రెడీ

ఇప్పటికే మహేష్ బాబు.. కుర్రాళ్లతో థమ్సప్ తాగిస్తున్నాడు. అలాగే పారగాన్ చెప్పులు వేసుకోమంటున్నాడు. రాయల్ స్టాగ్ మ్యూజిక్ సిడిలు వినమంటున్నాడు. వివెల్ షాంపూతో స్నానం చేయండి.. సంతూర్ వాడండి అంటున్నాడు. అమరావతిలో ప్లాట్లు కొనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఇలాగే ఈ యాడ్ తో అభి బస్ లలో తిరగమంటూ కూడా నిర్దేశం కూడా చేయనున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఇంత స్పీడుగానా

ఇంత స్పీడుగానా

ఓ ప్రక్కన వరస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు యాడ్ అండార్స్ మెంట్స్ విషయంలో ఓ రేంజ్ స్పీడ్ చూపిస్తూ మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ప్రతీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ కంపెనీ అయినా మహేష్ తో ప్రచారం చేయించుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేక యాడ్స్ చేస్తున్న మహేష్... ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ అభిబస్ కి కూడా చేయటంలో అందరూ ఆశ్చర్యపోయారు.

బ్రహ్మోత్సవం ఎఫెక్టుతో..

బ్రహ్మోత్సవం ఎఫెక్టుతో..

కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మహేష్ బాబు ..ఫ్యామిలీ చిత్రాలకు కాస్తంత బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట

ఈ టైటిల్స్ అన్నీ...

ఈ టైటిల్స్ అన్నీ...

ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా ఎనిమి అనే టైటిల్ దాదాపుగా ఫైనల్ అన్న టాక్ వినిపించింది. తరువాత చట్టంతో పోరాటం, వాస్కోడాగామ, అభిమన్యుడు లాంటి పేర్లు తెర మీదకు వచ్చినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు ఏజెంట్ శివ అనే టైటిల్ ను నిర్ణయించారన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులో మహేశ్‌బాబు ఐబీ ఆఫీసర్ (ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్) పాత్ర చేస్తు న్నారు. అందుకే ఈ టైటిల్ అయితే యాప్ట్‌గా ఉంటుందనుకుంటున్నారట.

హైదరాబాద్ లో ప్రస్తుతం..మహేష్

హైదరాబాద్ లో ప్రస్తుతం..మహేష్

ప్రస్తుతం హైదరాబాద్ లో మహేష్ పై కార్ ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సీక్వెన్స్ కి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో ఇదివరకెప్పుడూ చూడని విధంగా ఈ సీక్వెన్స్ ఉండాలని మురుగదాస్ - సంతోష్ శివన్ ప్లాన్ చేశారట. ఆ మేరకు భారీ ఎక్విప్ మెంట్ తో సినిమాని తీస్తున్నారు. ప్రత్యేకమైన కెమెరాల్ని వాడుతున్నట్టు తెలిసింది.

ఆక్టోపస్ ని పోలీ ఉంటే...

ఆక్టోపస్ ని పోలీ ఉంటే...

ఎత్తునుంచి సన్నివేశాల్ని తీయడానికి డ్రోన్ కెమెరాలని వాడుతుంటారు. మహేష్ సినిమాకోసం ఆక్టోపస్ ని పోలివుండే డ్రోన్ ని వాడుతూ దానికి ఓ కొత్త రకమైన కెమెరాని అతికించినట్టు తెలిసింది. ఒకేసారి రెండు మూడు కెమెరాలతో ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

అమ్మో...అంత బడ్జెట్టే

అమ్మో...అంత బడ్జెట్టే

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా పని చేస్తున్నారు మురుగ, మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

ఈ దెబ్బతో మహేష్ కు...

ఈ దెబ్బతో మహేష్ కు...

ఇది మహేష్ కెరీర్ లో లాండ్ మార్క్ ఫిలిం అవుతుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు గా తమిళ్ మళయాళం, హిందీ లో కూడా ఏక కాలం లో రిలీజ్ చేసే ఆలోచనల ఉందట చిత్ర బృందం. ఇది కనుక జరిగితే బాలివుడ్ హీరో లా ఉండే మహేష్ బాలివుడ్ లో పాగా వెయ్యటం తో పాటు తమిళ్, మళయాళం లో తనకంటు మార్కెట్ సృష్టించుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటిదాకా ఇలాంటిది లేదట

ఇప్పటిదాకా ఇలాంటిది లేదట

ఈ సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ ఫైటింగ్ కమ్ చేజ్ సీన్ ను దాదాపు 3 కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్నారట. వివిధ కార్ చేజులు.. వాటి పక్కనే బోటులో మరో చేజ్.. మొత్తంగా ఒక పెద్ద ఫైటింగ్.. వాటిలో ఆసక్తిగొలిపే విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలుపుకుని ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చవుతుంది.

కథలో స్పెషాలిటి

కథలో స్పెషాలిటి

మురుగదాస్ అంటేనే సోషల్ ఎలిమెంట్స్ కి ప్రాదన్యమున్నా సినిమాలు తీస్తాడని అందరకి తెలుసున్న విషయం. ఇంకో విషయం ఏమిటంటే మురుగుదాస్ తన గత సినిమాలు సెవన్త్ సెన్స్, బ్రదర్స్, మొన్న వచ్చిన కత్తి చిత్రాలలో హీరో రెండు క్యారక్టర్స్ లో కనిపించి కనువిందు చేసారు. ఇప్పుడు మహేష్ కోసం కూడా అదే తరహాలో స్క్రిప్టు రెడీ చేసారంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే తన కొత్త చిత్రంలో మహేష్ రెండు క్యారక్టర్స్ లో కనిపించనున్నాడని, దీనిలో కూడా సోషల్ ఎలిమోంట్స్ ఉంటాయని, సెటైరికల్ డ్రామా అని ఫిల్మ్ వర్గలా సమాచారం.

కేవలం ఈ సినిమానే కాకుండా

కేవలం ఈ సినిమానే కాకుండా

మహేష్ తో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ చిత్రాలు చేసిన పూరి జగన్నాద్ ఓ ఇంటర్నేషనల్ మూవీని తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి అంతే గ్రాండ్ అండ్ రిచ్ గా ఉంటుందని సమాచారం. ఇందులో హాలీవుడ్ కి సంబందించిన నటులు కూడా ఇందులో నటిస్తారని, ఓ పెద్ద హాలీవుడ్ సంస్థ దీనిని నిర్మిస్తుందని తెలుస్తోంది. 2017 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

English summary
Superstar Mahesh Babu has more than two dozens of brands in his kitty. And the latest one to join is abhibus.com online ticketing website. Now ads of Abhibhus featuring Mahesh are released on TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu