»   » బిగ్‌బాస్‌లో ధన్‌రాజ్‌తో ముమైత్ జోరుగా రొమాన్స్.. దుమ్మురేపుతున్న కెమిస్ట్రీ

బిగ్‌బాస్‌లో ధన్‌రాజ్‌తో ముమైత్ జోరుగా రొమాన్స్.. దుమ్మురేపుతున్న కెమిస్ట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో డ్రగ్ కేసు ప్రకంపనాలతో ఓ వైపు సినీ నటులు బెంబేలెత్తుతుంటే... ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముమైత్‌ మాత్రం పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించడం లేదు. ఈ కేసుకు నాకు సంబంధం లేదన్నట్టు బిగ్‌బాస్‌లో జోరుగా హుషారుగా చిందులేస్తున్నది. డ్రగ్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బిగ్‌బాస్ రూపంలో మంచి అవకాశాన్ని కొట్టేసిందనే మాట వినిపిస్తున్నది.

జోరుగా ముమైత్, ధనరాజ్ కెమిస్ట్రీ

జోరుగా ముమైత్, ధనరాజ్ కెమిస్ట్రీ

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ మూడో ఎపిసోడ్‌లో ముమైత్ ఖాన్ వ్యవహారం హైలెట్‌గా మారింది. తనదైన శైలిలో హౌస్‌లో ముమైత్ ఆకట్టుకొంటున్నారు. ముఖ్యంగా ధన్‌రాజ్‌తో అతిసన్నిహితంగా మెదగడం చర్చనీయాంశమైంది. వీరద్దరి జోడి బిగ్‌బాస్‌లో హైలెట్‌గా మారింది.

Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
ధన్‌రాజ్‌కు టవల్ తెచ్చిన తంటా

ధన్‌రాజ్‌కు టవల్ తెచ్చిన తంటా

బిగ్‌బాస్‌లో తోటి పార్టిసిపెంట్ అయిన ధన్‌రాజ్ నుంచి ఓ టవల్‌ను ముమైత్ అరువుగా తీసుకొన్నది. తన వద్ద ఓ టవల్ ఎక్స్‌ట్రా ఉన్న కారణంగా దానిని ముమైత్ ఇచ్చాను అని ధన్‌రాజ్ తన సహచరులకు చెప్పడం గమనార్హం. అయితే ఈ టవల్ వ్యవహారం హౌస్‌లో విచిత్రమైన చర్చకు దారి తీసింది.

టవల్‌తో ముమైత్‌ను ఆటపట్టించిన సభ్యులు

టవల్‌తో ముమైత్‌ను ఆటపట్టించిన సభ్యులు

ధన్‌రాజ్ ఇచ్చిన టవల్‌ వాడుకొంటూ.. తడిగా ఉండటంతో హౌస్ ఆవరణలో ఆరబెట్టింది. అయితే ముమైత్‌ను ఆటపట్టించడానికి సభ్యులందరూ ఓ ప్లాన్ వేశారు. ముమైత్ ఆరేసిన తడి టవల్‌ను జిమ్ వస్తువులపై ధన్‌రాజ్ ఆరవేసి దానిని ఓ ఇష్యూ చేశాడు.

సభ్యులపై అలిగిన ధన్‌రాజ్

సభ్యులపై అలిగిన ధన్‌రాజ్

టవల్‌ను ఆసరాగా చేసుకొని హౌస్‌ను శుభ్రంగా ఉంచడం లేదని పార్టిసిపెంట్స్ ధన్‌రాజ్‌, ముమైత్‌పై ఆటపట్టించారు. అందుకు ముమైత్‌కు టవల్ ఇవ్వడం నా తప్పు కాదు. అక్కడ ఆరబెట్టుకోవడం ఆమె తప్పని ధన్‌రాజ్ వాదించాడు. సభ్యుల వాదనతో చిన్నబుచ్చుకొన్న ధన్ రాజ్ ఓ మూలకు కూర్చుని అలిగాడు.

ముమైత్ కౌగిలిలో బందీగా..

ముమైత్ కౌగిలిలో బందీగా..

అలిగిన ధనరాజ్‌ను ముమైత్ తన ఒడిలోకి తీసుకొని ఓదార్చింది. గుండెలకు హత్తుకొని కౌగిలిలో బంధించింది. దాంతో సభ్యులందరూ ఒక్కసారిగా నవ్వడంతో ముమైత్‌కు అసలు విషయం అర్థమై అక్కడి నుంచి పారిపోయింది. ముమైత్ కౌగిలో ధన్‌రాజ్ మాత్రం ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.

పట్టిపట్టనట్టు కత్తి మహేశ్ తదితరులు

పట్టిపట్టనట్టు కత్తి మహేశ్ తదితరులు

గత రెండు రోజులు ఎపిసోడ్స్‌లో ధన్‌రాజ్, ముమైత్‌లో దగ్గర కావడం ఈ షోలో ప్రత్యేకతగా మారింది. మిగితా సభ్యుల్లో కత్తి మహేశ్, కత్తి కార్తీక, మధుప్రియ, ప్రిన్స్ తదితరులు పెద్దగా కలివిడితనాన్ని ప్రదర్శించకపోవడం గమనార్హం. అయితే వీరందరూ మాత్రం అందర్ని చేష్టలను ఆసక్తిగా గమనిస్తూ షోను ఎంజాయ్ చేస్తున్నారు.

అందర్నీ ఆకట్టుకొంటున్న సింగర్ కల్పన

అందర్నీ ఆకట్టుకొంటున్న సింగర్ కల్పన

ఇక బిగ్‌బాస్‌ షోలో అందర్ని ఆకట్టుకొంటున్నది సింగర్ కల్పన. ఈ హౌస్‌కు పెద్దదిక్కులా మారింది. ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిలా, అక్కలా తన బాధ్యతను నిర్వర్తించడం గమనార్హం. తలనొప్పి పుడుతున్నదని ధన్ రాజ్ చెప్పగా ఇంట్లో నుంచి మందు తెచ్చి తలకు రాసి తన ప్రేమను కురిపించడం ఆసక్తిగా మారింది.

English summary
Biggboss contestant Mumaith Khan facing allegations in Drug case. But Mumaith is enjoying her time in Biggboss. Her chemistry with Dhanraj is talk of the town. Their pair become interesting point in the reality show.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu