For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిలు అండర్ వేర్‌లు పంపి షాక్ ఇచ్చారు.. RX100 నేను చేయాల్సింది: నవీన్ చంద్ర

  |

  బెస్ట్ టాలెంటేడ్ నటులలో ఒకరైనా నవీన్ చంద్ర హీరోగానే కాకుండా విలన్ గా కూడా అడుగులు వేస్తూ ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. అందాల రాక్షసితో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్రాకు అమ్మాయిలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ఇటీవల అలీతో సరదాగా అనే షోకి గెస్ట్ గా వచ్చిన నవీన్ తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

  మెగాస్టార్ కోసం 57కిలోమీటర్లు

  మెగాస్టార్ కోసం 57కిలోమీటర్లు

  నవీన్ మాట్లాడుతూ.. పుట్టింది హైదరాబాద్ లోనే కానీ పెరిగింది మాత్రం బళ్ళారిలో. చిన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. కన్నడలో మెగాస్టార్ మూవీ రిలీజ్ అయితే సినిమా బాక్స్ మేమే తేవాలని 57 కిలోమీటర్లు వెళ్లి తీసుకొచ్చేవాడిని. ప్రత్యర్ధులు ఆపడానికి చాలా ప్రయత్నం చేసేవారు. ఇక తమిళ్ లో కమల్ హాసన్ చాలా ఇష్టం.

  పరీక్ష రాసేటప్పుడు బెంచ్ పై కత్తి..

  పరీక్ష రాసేటప్పుడు బెంచ్ పై కత్తి..

  తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలు బాగా తెలుసు. ఇక ఇంగ్లీష్ కామన్. కాలేజ్ టైమ్ లో కొంచెం రౌడీలా ఉండేవాడిని. పరీక్ష రాసేటప్పుడు ఒక కత్తి తీసి బెంచ్ మీద లేడితే లెక్చరర్ సైలెంట్ గా వెళ్లిపోయేవారు. ఒకసారి ఫేక్ పేరెంట్స్ ని క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయాను. మా నాన్న అప్పుడు దారుణంగా చితకబాదారు.

   అండర్ వేర్ లు కూడా పంపేవారు

  అండర్ వేర్ లు కూడా పంపేవారు

  ఇక నా తొలి సినిమా అందాల రాక్షసి తరువాత మంచి క్రేజ్ వచ్చింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఫోన్ కాల ఒక రేంజ్ లో వచ్చాయి. ఎక్కువగా అమ్మాయిలు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేవారు. ఇక మరికొందరు కానుకలు పంపేవారు. కొందరైతే ఏకంగా అండర్ వేర్ లు కూడా పంపేవారు. నిజంగా నా సైజ్ వాళ్లకు ఎలా తెలుసో నాకు తెలియదు.

  ఒక అమ్మాయి లేచిపోయి వచ్చేసింది

  ఒక అమ్మాయి లేచిపోయి వచ్చేసింది

  ఇక సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఒక నెంబర్ నుంచి గ్యాప్ లేకుండా ఎక్కువగా కాల్స్ వచ్చాయి. నేను ఆ గోల తట్టుకోలేక ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాను. మూడు రోజుకు తరువాత చూస్తే ఒక మెస్సేజ్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ 7లో ఉన్నాను. తప్పకుండా రావాలని లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు అని మెస్సేజ్ పట్టింది.

  నన్ను చూసి తను బాగా ఏడ్చేసింది.

  నన్ను చూసి తను బాగా ఏడ్చేసింది.

  ఆ అమ్మాయి మెస్సేజ్ కి నేను షాక్ అయ్యాను. వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేసి ఆ రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ నన్ను చూసి తను బాగా ఏడ్చేసింది. ఇంట్లో నుంచి బట్టలు సర్దుకొని వచ్చేసింది. నగలు కూడా అందులోనే ఉన్నాయి. అలా నా కోసం రావడం నిజంగా ఆశ్చర్య వేసింది.

  ఆర్ఎక్స్100 సినిమా నేను చేయాల్సింది

  ఆర్ఎక్స్100 సినిమా నేను చేయాల్సింది

  ఇక ఆర్ఎక్స్100 సినిమాలో నేను నటించాల్సింది. దర్శకుడు అజయ్ భూపతి మొదట ఆ కథ నాకు చెప్పినపుడు కొంతమంది నిర్మాతలకు పరిచయం చేయించాను. కానీ ఎవరు కూడా నా మీద అంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి ముందుకి రాలేదు.. అంటూ నవీన్ చంద్ర అలీకి తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో విషయాల గురించి చెప్పాడు.

  English summary
  Naveen Chandra, one of the best talented actors, is not only a hero but also a villain. Naveen Chandra, who was introduced to the Telugu screen with the beauty monster, has also increased her fan following as a girl. Naveen, who recently came as a showy guest to have fun with Ali, revealed some interesting things in his life. The promo for it has now gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X