‘బిగ్‌బాస్‌’ కోసం సిద్ధమైన రమ్యకృష్ణ.. మరోసారి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్

కరోనావైరస్ కారణంగా నిలిచిపోయిన షూటింగులన్నీ ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగాను, చెన్నైలో కోవిడ్ పరిస్థితులు హంగామా చేస్తుండటంతో టెలివిజన్, సినిమా షూటింగులు నిలిపివేయడం తెలిసిందే.

అయితే తాజాగా పరిస్థితులు అదుపులోకి రావడంతో రమ్యకృష్ణతోపాటు వనితా విజయ్ కుమార్ షూటింగు సెట్లో అడుగుపెట్టారు. వీరద్దరి కలిసి చేస్తున్న బిగ్‌బాస్ జోడిగల్ (బీబీ జోడిగల్) షూటింగుకు హాజరైనట్టు రమ్యకృష్ణ, వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ షోలో నకుల్ జైదేవ్‌తో కలిసి సహ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో రమ్యకృష్ణ స్పందిస్తూ.. బీబీ జోడిగల్ సెట్‌కు మళ్లీ వచ్చేశఆం. సురక్షిత ప్రమాణాలతో షూటింగ్ కొనసాగుతున్నది. మాస్కులు పెట్టుకొని, సురక్షితంగా షూటింగు చేస్తున్నాం అంటూ ఓ పోస్టు పెట్టారు. దాంతో రమ్యకృష్ణ ఫ్యాన్స్ చాలా సంతోషంగా విషెస్ అందజేస్తున్నారు.

Ramya Krishnan steps into at Bigg Boss Jodigal shoot

ఇక వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. కంటెస్టెంట్‌గా బీబీ జోడిగల్‌ షోకు వెళ్తున్నాను. షూటింగు స్పాట్‌ వెళ్తున్నాననే ఆనందంలో ఈ పోస్టు పెట్టాను అని ఆమె పేర్కొన్నారు.

బీబీ జోడిగల్‌లో పాల్గొన్న సెలబ్రిటీ జంటల విషయానికి వస్తే.. సురేష్ చక్రవర్తితో కలిసి వనితా విజయ్ కుమార్, సోమశేఖర్‌తో శివానీ నారాయణ్, అజిద్ ఖాలీక్యుతో గ్యాబ్రియెల్లా చార్లటన్, షరీఖ్ హసన్‌తో అనితా సంపత్, సంయుక్త కార్తీక్‌తో జితన్ రమేష్ తదితరులు పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X