For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శుభవార్త చెప్పిన ‘అదిరింది’ యాంకర్ సమీరా: భర్తతో కలిసి అలా ప్రకటన.. ఆ సినీ నటి ఇంట్లో సంబరాలు

  |

  సినిమా వాళ్లకే కాదు.. సీరియల్ నటీమణులకు కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో అయితే అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది బుల్లితెర హీరోయిన్లను మన వాళ్లు అలా ఆదరించిన విషయం తెలిసిందే. అందుకే ఎంతో మంది నటీమణులు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను అందుకుంటున్నారు. అలాంటి వారిలో సమీరా షరీఫ్ ఒకరు. ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈమె.. 'అదిరింది' షోతో యాంకర్‌గానూ మారింది. ఇక, తాజాగా సమీరా.. తన భర్తతో కలిసి ఓ శుభవార్తను చెప్పింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా మొదలైన ప్రయాణం.. ఫుల్ పాపులారిటీ

  అలా మొదలైన ప్రయాణం.. ఫుల్ పాపులారిటీ

  2006లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘ఆడపిల్ల' అనే సీరియల్‌తో సమీరా షరీఫ్ తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయిన ఆమె.. మంచి పేరును సంపాదించుకుంది. ఆ క్రమంలోనే ‘అభిషేకం', ‘భార్యమణి', ‘మూడు ముళ్ల బంధం', ‘ప్రతిబింబం', ‘మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించిందామె.

  ఇక్కడ ఆపేసిన సమీరా.. అక్కడ ఫుల్ బిజీగా

  ఇక్కడ ఆపేసిన సమీరా.. అక్కడ ఫుల్ బిజీగా

  తెలుగులో చాలా కాలం పాటు వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడిపిన సమీరా షరీఫ్.. 2016లో వచ్చిన ‘మంగమ్మ గారి మనవరాలు' తర్వాత ఆమె మరో దానిలో నటించలేదు. కానీ, తమిళంలో మాత్రం వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉంది. దీంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇక, ఈ మధ్యనే ప్రముఖ చానెల్‌లో ‘అరవింద సమేత' అనే దానితో రీఎంట్రీ ఇచ్చింది.

  ‘అదిరింది’ అంటూ యాంకర్‌గా.. పది వారాలకే

  ‘అదిరింది’ అంటూ యాంకర్‌గా.. పది వారాలకే

  సీరియల్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమీరా షరీఫ్.. తెలుగు బుల్లితెరకు సుదీర్ఘ విరామం తీసుకుంది. ఈ క్రమంలోనే కెరీర్‌లో ‘అదిరింది' అనే కామెడీ షోతో తొలిసారి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు పది ఎపిసోడ్ల వరకూ అందులో కనిపించిన ఈమె.. ఆ తర్వాత షోకు దూరమైపోయింది. ఆ సమయంలో తనకు చెప్పకుండానే దీని నుంచి తప్పించారని ఆరోపించింది.

  ఆ హీరోతో ప్రేమాయణం... వైభవంగా వివాహం

  ఆ హీరోతో ప్రేమాయణం... వైభవంగా వివాహం

  వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సినీ నటి సన కుమారుడు, సీరియల్ హీరో సయ్యద్ అన్వర్ అహ్మద్‌తో ప్రేమలో పడింది సమీరా. తన సోదరి కోసం అతడితో పరిచయం పెంచుకున్నప్పటికీ.. క్రమంగా అతడి ప్రేమలో మునిగిపోయింది. దీంతో పెద్దలను ఒప్పించి ఈ జంట ఒక్కటైంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారు.

  స్పీడు తగ్గించిన సమీరా.. అక్కడ వీడియోలతో

  స్పీడు తగ్గించిన సమీరా.. అక్కడ వీడియోలతో

  గతంలో వరుస పెట్టి సీరియళ్లలో నటించిన సమీరా షరీష్.. పెళ్లి తర్వాత మాత్రం కొంత స్పీడు తగ్గించేసింది. బుల్లితెరపై సందడి చేయకున్నా.. భర్త సహాయంతో యూట్యూబ్‌లో మాత్రం వీడియోలు చేస్తోంది. అలాగే, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్నింటిని పట్టాలెక్కించేసింది కూడా. మరోవైపు.. అన్వర్ మాత్రం తమిళంలో వరుసగా సీరియళ్లు చేస్తున్నాడు.

  శుభవార్త చెప్పిన ‘అదిరింది’ యాంకర్ సమీరా

  శుభవార్త చెప్పిన ‘అదిరింది’ యాంకర్ సమీరా

  ఇటీవల భర్తతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సమీరా. ఈ సందర్భంగా తన ప్రేమ.. జీవితం.. ఆటుపోట్లను గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఎందులోనూ నటించకున్నా చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ బుల్లితెర హీరోయిన్ తన అభిమానులకు శుభవార్తను చెప్పింది. భర్తతో కలిసి అసలు విషయాన్ని వెల్లడించింది.

  అలా ప్రకటన.. ఆ సినీ నటి ఇంట్లో సంబరాలు

  అలా ప్రకటన.. ఆ సినీ నటి ఇంట్లో సంబరాలు

  బుల్లితెర హీరోయిన్ కమ్ యాంకర్ సమీరా షరీష్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో భార్య భర్తలిద్దరూ ధరించిన టీ షర్ట్‌ల మీదే అసలు విషయాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ఈ శుభవార్తతో సమీరా షరీష్ అత్తయ్య.. సినీ నటి సన ఇంట్లో సంబరాలు మొదలైపోయాయి.

  English summary
  Sameera Sherief is an Indian television actress and producer who acted in Bharayamani serial and serials like Prathibimbam, Mangamma Gari Manavaralu and played the lead role in the Tamil serial Rekka Katti Parakkudhu Manasu in 2018.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X