»   »  అన్నీ డౌట్సే:‘చిన్నారి పెళ్లికూతురు’నటి ఆత్మహత్య,లాస్ట్ వాట్సప్ మెసేజ్,బోయ్ ఫ్రెండ్ పరార్

అన్నీ డౌట్సే:‘చిన్నారి పెళ్లికూతురు’నటి ఆత్మహత్య,లాస్ట్ వాట్సప్ మెసేజ్,బోయ్ ఫ్రెండ్ పరార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించారు. 'బాలికా వధు' (తెలుగులో ప్రసారమవుతున్న చిన్నారి పెళ్లికూతురు) హిందీ ధారావాహికలో ఆనందిగా ఆమె నటించింది. ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెను చికిత్స నిమిత్తం కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బాలికా వధు ధారావాహికలో ఆనందీ పాత్రలో ఆమె నటించింది. ఓ ప్రముఖ ఛానెల్‌ రూపొందించిన 'బిగ్‌బాస్‌-7' రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది.

ఆనంది ఫేం ప్రత్యూష అనుమానాస్పద మృతి అంటున్నారు ఆమె తోటి వాళ్లు. డబ్బింగ్ తో 'చిన్నారి పెళ్లికూతురు' ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకూ చిరపరిచితురాలైంది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నవార్త తెలుగు వారిని కలవరపరిచింది.

ఇక ఆమె మృతిపై రకరకాల అనుమానాలతో కూడిన కథనాలు మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె బోయ్ ప్రెండ్ పరారవటం, అతను వేరే నటితో రిలేషన్ వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

మృతిపై అనుమానాలు, చివరి వాట్సప్ మెసేజ్... స్లైడ్ షోలో ...

చివరి క్షణాలు

చివరి క్షణాలు


అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తన బోయ్ ఫ్రెండ్ రాహుల్ తో కలిసి,మలాంద్ లో ఉన్న కార్నివాల్ మాల్ కు వెళ్లింది.

పెద్ద గొడవైంది

పెద్ద గొడవైంది

కార్నివాల్ మాల్ లో ఆమె, బోయ్ ఫ్రెండ్ తో పెద్ద గొడవైంది. ఆమెను లెంపపై కొట్టాడు. ఆమె పడిపోయింది. లేవటానికి చెయ్యి కూడా రాహుల్ ఇవ్వలేదు.

కొద్ది సేపటి తర్వాతే

కొద్ది సేపటి తర్వాతే

ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చాలా హర్ట్ అయ్యిందని, తట్టుకోలేక ఈ సూసైడ్ కు ప్రయత్నించిందని చెప్తున్నారు.

అంకుల్ కు చెప్పి

అంకుల్ కు చెప్పి

ఆమె సూసైడ్ విషయం తెలుసుకున్న రాహుల్ వెంటనే హాస్పటిల్ కు తీసుకు వెళ్లి ఆమె అంకుల్ కు తెలియచేసాడు.

హాస్పటిల్ దగ్గర చిప్స్ తింటూ

హాస్పటిల్ దగ్గర చిప్స్ తింటూ

హాస్పటిల్ కు వెళ్లాక అక్కడ చిప్స్ తింటూ గడిపాడని, అతని లో టెన్షన్ గానీ, బాధ కానీ ఏ మాత్రం కనపడలేదని అక్కడి వారు చెప్తున్నారు.

టిక్కెట్లు బుక్ చేయాలని

టిక్కెట్లు బుక్ చేయాలని

ప్రత్యూష తల్లి తండ్రులకు టిక్కెట్లు బుక్ చేయాలని చెప్పి రాహుల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కానీ చేయలేదు.

పారిపోయాడు

పారిపోయాడు

రాహులో ఫోన్ కట్టేసి ఉంది, అతను తన ప్లాట్ కి కానీ, స్నేహితుల ప్లాట్ లకు కానీ వెళ్లకుండా మాయమయ్యాడు.

సూసైడ్ నోట్ లేదు

సూసైడ్ నోట్ లేదు

ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో సీలింగ్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. అయితే, సూసైడ్ నోట్ ఏదీ అక్కడ లభించలేదన్నారు.

పోస్ట్ మార్టం తర్వాతే..

పోస్ట్ మార్టం తర్వాతే..

శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగి ఉండొచ్చని, మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం అనంతరమే తెలుస్తుందని స్పష్టం చేశారు.

అతనితో అనుబంధమే...

అతనితో అనుబంధమే...

టీవీ ప్రొడ్యూసర్ అయిన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

వాట్సప్ మెసేజ్

వాట్సప్ మెసేజ్

చివరి వాట్సాప్ సందేశంలోనూ.. 'మరణం తరువాత కూడా నీ నుంచి ముఖం తిప్పడంలేదు' అని ఒక స్మైలీతో పాటు ఉంది.

ఆత్మహత్య కాదు..

ఆత్మహత్య కాదు..

ప్రత్యూష మృతిపై సహనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు ఆమె మృతి ఆత్మాహత్య కాదేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.

తొలిసారి కాదు..

తొలిసారి కాదు..

ఆమె ఇలా ఎక్సట్రీమ్ స్టెప్ తీసుకోవటం తొలిసారి కాదని, గతంలో ఎక్స్ బోయ్ ఫ్రెండ్ మకరంద్ మల్హోత్రాతో విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసిందని, అప్పుడు అదృష్టవశాత్తు బ్రతికిందని చెప్తున్నారు.

సమస్య

సమస్య

గత కొద్ది రోజులుగా ఆమె తన బోయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె సన్నిహితులు పోలీసులతో చెప్తున్నారు.

టెలీ చాక్కర్ రిపోర్ట్స్ ప్రకారం

టెలీ చాక్కర్ రిపోర్ట్స్ ప్రకారం

రాహుల్ వేరే నటి సోనాలి శర్మతో ఎఫైర్ పెట్టుకున్నాడనే గొడవైందని చెప్తున్నారు. అయితే ఆమె ఈ విషయాన్ని ఖండించింది.

ఫోన్స్ ఎందుకు పట్టుకెళ్లాడు

ఫోన్స్ ఎందుకు పట్టుకెళ్లాడు

రాహుల్...బయిటకు వెళ్లేటప్పుడు ప్రత్యూష ఫోన్ ఎందుకు పట్టుకెళ్లాడు..ఆ ఫోన్ ఉంటే కొన్ని సమస్యలుకు ఖచ్చితంగా పరిష్కారం దొరికేదంటున్నారు.

తెలియటం లేదు..

తెలియటం లేదు..

ప్రత్యూష మరణానికి కారణాలు తెలియవని చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)లో ఆమె సహనటుడు సిద్ధార్థ్ శుక్లా తెలిపారు.

రెండో ఆనంది

రెండో ఆనందిచిన్నారి పెళ్లి కూతురులో చిన్నప్పటి ఆనంది పాత్రను అవికా గోర్ పోషించగా, అనంతరం యుక్త వయస్సు ఆనందిగా ప్రత్యూష నటించారు. 2013లో ప్రత్యూష స్థానంలో తోరల్ రసపుత్రాను ఆ పాత్ర కోసం తీసుకున్నారు.

English summary
Popular TV actress and Balika Vadhu fame Pratyusha Banerjee has committed suicide. Reportedly, 24 year old actress hung herself at her flat in Bangur Nagar in suburban Kandivli. According to Tellychakkar reports, Rahul had an affair with another actress, Saloni Sharma. But the actress has denied the report.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu