For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో చాలా కాలంగా అమ్మాయిలే హవాను చూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచం కావడంతో తమ అందచందాలతో కనువిందు చేస్తూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అద్భుతమైన టాలెంట్‌తో సత్తా చాటుతూ.. చేతి నిండా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదే సమయంలో లేడీ యాంకర్లకు పోటీ ఇవ్వడంతో పాటు టాప్ స్టేజ్‌లో వెలుగొందుతున్నాడు. అంతేకాదు, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడతను. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతులు మీకోసం!

  అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయ్యాడు

  అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయ్యాడు

  పక్కింటి కుర్రాడిలా ఉండే ప్రదీప్ మాచిరాజు.. ముందుగా రేడియో జాకీగా తన కెరీర్‌ను ఆరంభించాడు. అక్కడ తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ గాయ్.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. అదే సమయంలో ‘గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రదీప్.. తన హవాను చూపిస్తూ సాగిపోతున్నాడు.

  Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

   సినిమాల్లోకి కూడా ఎంట్రీ.. హీరోగా సక్సెస్

  సినిమాల్లోకి కూడా ఎంట్రీ.. హీరోగా సక్సెస్

  చాలా కాలంగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోగా మారి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ విజయవంతమైన చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ దక్కింది. దీంతో మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

  ఎక్కడ చూసినా అతడే.. ప్రస్తుతం వీటిలోనే

  ఎక్కడ చూసినా అతడే.. ప్రస్తుతం వీటిలోనే

  యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించప్పటి నుంచి ప్రదీప్ ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ఇలా అన్ని ఛానెళ్లలోనూ ఏక కాలంలో పని చేస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ‘ఢీ 13', ‘డ్రామా జూనియర్స్', ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు ఫంక్షన్లను కూడా హోస్ట్ చేస్తున్నాడు.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  అక్కడ పిల్లలో సందడి.. మంచు లక్ష్మి ఎంట్రీ

  అక్కడ పిల్లలో సందడి.. మంచు లక్ష్మి ఎంట్రీ


  ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల షోను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు టాలీవుడ్ నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌గా పలు రకాల స్కిట్‌ను చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను షో నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఇది ఆద్యంతం చాలా సందడిగా సాగింది. ఫలితంగా దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

  ప్రదీప్‌కు షాకిచ్చిన బుడతడు.. పెళ్లి గురించి

  ప్రదీప్‌కు షాకిచ్చిన బుడతడు.. పెళ్లి గురించి

  ‘డ్రామా జూనియర్స్' షోలో భాగంగా కొందరు చిన్నారులు శివుడుకు సంబంధించిన ఓ డివోషనల్ స్కిట్‌ను చేశారు. అది పూర్తైన తర్వాత సింగర్ సునీత.. మార్కండేయుడి పాత్రను పోషించిన బుడ్డోడితో ‘శివుడు ప్రత్యక్షం అయితే.. ఏ వరం కోరుకుంటావు చెప్పు' అని అడిగింది. దీనికి ఆ చిన్నారి ఏమాత్రం ఆలోచించకుండా ‘ప్రదీప్ అన్నకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటాను' అని బదులిచ్చాడు. దీంతో యాంకర్ ప్రదీప్ షాక్ అయిపోయాడు. ఆ వెంటనే తెల్లముఖం వేసేశాడు. ఆ సమయంలో ఆ చిన్నారి చెప్పిన డైలాగ్‌కు అందరూ పగలబడి నవ్వుకున్నారు.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  సునీత.. మంచు లక్ష్మిపై యాంకర్ పంచులు

  సునీత.. మంచు లక్ష్మిపై యాంకర్ పంచులు


  తర్వాత మరో స్కిట్‌లో భాగంగా ప్రజ్వల్ అనే చిన్నారి చందమామలా నటిస్తూ ఓ స్కిట్‌ను చేశాడు. ఇందులో భాగంగా ఆ బుడ్డోడు ‘అమ్మాయిలు డేంజర్‌ రోయ్.. చాలా చాలా డేంజర్' అని పవన్ కల్యాణ్ చెప్పిన ఓ డైలాగ్‌ను పలికాడు. దీన్ని స్కిట్ తర్వాత గుర్తు చేసిన యాంకర్ ప్రదీప్.. ఆ బుడతడితో మరోసారి ఆ డైలాగ్‌ను చెప్పించాడు. అప్పుడు సునీత ‘ఇక్కడ ఎంత మంది ఆడవాళ్లు ఉన్నారో చూశావా? బయటకు వెళ్లాలని ఉందా' అని ప్రశ్నించింది. అప్పుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది అమ్మాయిల గురించి అని చెప్పరా' అని ఫన్నీగా కామెంట్ చేశాడు.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
  ప్రదీప్ వివాహంపై సునీత సంచలన వ్యాఖ్యలు

  ప్రదీప్ వివాహంపై సునీత సంచలన వ్యాఖ్యలు

  పరోక్షంగా ఈ సెట్‌లో ఉన్న వాళ్లంతా అమ్మాయిలు కాదు.. ఆంటీలు అంటూ యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఆ వెంటనే జడ్జ్‌ సీటులో కూర్చున్న సింగర్ సునీత స్పందించారు. అప్పుడామె మాట్లాడుతూ.. ‘ఇది ఆడవాళ్లపై డ్యామెంజింగ్ స్టేట్‌మెంట్. అందుకే నీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కావడం లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారామె. అప్పుడు ప్రదీప్ ‘ఇది పెద్ద డైలాగే' అంటూ రెస్పాండ్ అయ్యాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా పకపకా నవ్వేశారు. మొత్తంగా ఈ ప్రోమో సందడి సందడిగా సాగింది. ఫలితంగా ఈ వీడియో యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Drama Juniors – The NEXT Superstar Show. Now Singer Sunitha Did Shocking Comments on his Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X