»   » ఫోటోలు : స్టార్లుగా మారిన టీవీ ఆర్టిస్టులు

ఫోటోలు : స్టార్లుగా మారిన టీవీ ఆర్టిస్టులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : బుల్లితెరగా పరిగణించబడే టెలివిజన్ పరిశ్రమ సినిమా పరిశ్రమకంటే చిన్నదే అయినా....దాని పరిధి మాత్రం సినిమా పరిశ్రమకంటే ఎక్కువే. టెలివిజన్ పరిశ్రమ ఎంతో మంది టాలెంట్ ఉన్న నటులకు అతితక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చి వారు సినిమా రంగంలో పెద్ద స్టార్స్ కావడానికి దోహదం చేసింది.

తమ ప్రతిభను ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఒక మంచి వేదికగా ఉపయోగించుకుంటున్నారు పలువురు నటులు. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ఓవర్ నైట్ స్టార్స్‌గా అవతరిస్తున్నారు. అందుకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌ను బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1980ల్లో టీవీ ఆర్టిస్టుగా రాణించిన షారుక్ తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుని పెద్ద స్టార్‌గా మారారు.

వీరే మాత్రమే కాదు...ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, విద్యా బాలన్ ఇలా ఎంతరో స్టార్స్ బుల్లి తెర నుంచి వెండి తెర వైపు అడుగులేసి సక్సెస్ అయిన వారే. వారిలో పాపులర్ అయిన కొందరు స్టార్స్ వివరాలు స్లైడ్ షోలో

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

సినిమాల్లోకి రాక ముందు షారుక్ ఖాన్ "ఫౌజి", "సర్కస్" , "దిల్ దరియా" అనే టీవీ కార్యక్రమాలలో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంటరై బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగారు. ఇంటర్నేషనల్‌ లెవల్లో పేరు సంపాదించారు. ఆయన సినిమాల మార్కెట్ ఇప్పుడు వందల కోట్లలో ఉంది.

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ రేంజి ఏంటో కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ అనే తేడా లేకుండా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో తన సత్తా చాటుతున్నాడు. సినిమాల్లోకి రాక ముందు ప్రకాష్ రాజ్ బుల్లితెరపై తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నారు.

విద్యా బాలన్

విద్యా బాలన్

2005లో పరిణీత చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ సరరసన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి...ఇప్పుడు పాపులర్ హీరోయిన్‌గా మారిన విద్యా బాలన్ ఒకప్పుడు బుల్లితెరపై నటించింది. హమ్ పాంచ్ అనే కామోడీ సిరీస్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది.

కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి

తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తున్న కలర్స్ స్వాతి ఒకప్పుడు తెలుగు టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా రాణించిన సంగతి తెలిసిందే. కలర్స్ అనే బుల్లితెర కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన స్వాతిని ఇప్పటికీ అంతా అలానే పిలుస్తుంటారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.

హన్సిక

హన్సిక

దక్షిణాదిన ప్రస్తుతం పాపుల్ హీరోయిన్లలో ఒకరుగా మారిన హన్సిక ఒకప్పుడు బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్టుగా రాణించింది. షకలక భూం భూం అనే టీవీ కార్యక్రమం ద్వారా హన్సిక కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు సినిమాల్లో పాపులర్ స్టార్ గా మారింది.

English summary
Television industry may have been considered as a smaller industry comparatively with films but it has proved time and again that it has a wider-reach. Not to forget, small screen gives popularity to talents in a very short time and makes an actor a star overnight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu