For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నమ్మని నిజం : వీళ్ళంతా టీవి నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చినవాళ్లే

By Srikanya
|

హైదరాబాద్ : మెల్లి మెల్లిగా బుల్లి తెరపు, పెద్ద తెరకు ఉన్న గీత చెరిగిపోతోంది. ఒకప్పుడు వెండితెరపై అవకాశాలు అడుగంటి పోయిన వాళ్ళంతా టీవి ని ఆశ్రయించేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారింది. టీవి నుంచి పెద్ద తెరకు ప్రయాణం పెట్టుకుంటున్నారు నటీ నటులు. బుల్లి తెరపై సక్సెస్ అయిన వాళ్లు..పెద్ద తెరపై దృష్టి పెట్టి అక్కడా సక్సెస్ అవుతున్నారు.

టెలివిజన్ ఆర్టిస్టులు అంటే తక్కువ...అనే భావన మెల్లిగా తొలిగిపోతోంది. వారిలోనూ హీరో,హీరోయిన్స్ అయ్యి పెద్ద తెరను ఏలే పొటిన్షియల్ ఉందని ప్రూవ్ అవుతూ వస్తోంది. చిన్న తెరపై వెలిగిన చాలా మంది ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటూ తమకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరోప్రక్క సినిమాలలో ఓ వెలుగు వెలిగిన సింగర్స్ గీతా మాధురి, సునీత వంటి వారు ఈ రోజు టీవిలో సింగిగ్ షోలకు హాజరవుతున్నారు. మంచులక్ష్మి, నీహారిక కొణిదల వంటివారు టీవిల్లో కనిపించి ఇప్పుడు సినిమాల వైపు ప్రయాణం పెట్టుకున్నారు.

మీరు నమ్ముతారా..రాజమౌళి..మొదట సినిమా డైరక్టర్ కాకముందు ఈటీవి శాంతి నివాశం అనే సీరియల్ చేసారు. అలాగే పూరి జగన్నాధ్ సైతం..దూరదర్శన్ కు చాలా ఎపిసోడ్స్ ఇచ్చారు. ఈ రోజు రిలీజ్ అవుతున్న త్రిపుర దర్శకుడు రాజ్ కిరణ్ సైతం టీవి ల నుంచి వచ్చిన వాడే.

అంతెందుకు లేటెస్ట్ సెన్షేషన్ రాజుగారి గదితో హిట్ కొట్టిన ఓంకార్ ఎక్కడి వాడు..టీవి షోల నుంచి వచ్చిన వాడు కదా. అనసూయ, సుమ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి వీళ్లంతా టాలెంటెండ్ యాంకర్స్ గా వెలిగి వెండి తెర కు వచ్చిన వాళ్లే...

స్లైడ్ షోలో మరిన్ని డిటేల్స్...

అనసూయ

అనసూయ

నాగార్జున ..తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయినా చిత్రంలో నటిస్తోంది. అలాగే క్షణం చిత్రంలో అడవి శేషు సరసన ఆమె నటిస్తోంది.

రేష్మి

రేష్మి

జబర్ధస్త్ రేష్మి చాలా చిత్రాల్లో చేసినా టీవి షో తోటే పేరు వచ్చింది.ఇప్పుడు... గుంటూరు టాకీస్ చిత్రంలో కీ రోల్ చేస్తోంది.

గాయత్రి భార్గవి

గాయత్రి భార్గవి

యాంకర్ గా పాపులర్ అయ్యి..సినిమాల్లోకి వచ్చిన ఈమె అత్తారింటికి దారేది, తీన్ మార్, గాలిపటం చిత్రాల్లో చేసింది.

సురేఖా వాణి

సురేఖా వాణి

మాటివి మొగడు పెళ్ళమ్స్ పోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన ఆమె... సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ తో బిజిగా ఉంది

సునీత

సునీత

ఈటీవి ద్వారా పాపులర్ అయిన ఆమె తర్వాత ఎన్నో సినిమాలకు పాటలు పాడిన హాట్ సెలబ్రెటీ

శ్రీముఖి

శ్రీముఖి

ఓ ప్రక్క టీవిల్లో రియాలిటీ షోలు చేస్తూనే సినిమాల్లోనూ బిజీగా ఉంది

మంచు లక్మి

మంచు లక్మి

సూపర్ హిట్ టీవీ షోలు హోస్ట్ చేసిన మంచు లక్ష్మి వెండితెరపైనా హైలీ సక్సెస్.

ఉదయభాను

ఉదయభాను

పదిహేనేళ్లకు పైగా టీవిల్లో ఉంటున్నా...ఆమె వయస్సు కనపడదు. ఆమె సినిమాల్లో ఐటం సాంగ్స్ సైతం చేసింది.

శిల్పా చక్రవర్తి

శిల్పా చక్రవర్తి

ఎన్నో గేమ్ షోలు, పోగ్రామ్ లు చేసిన శిల్ప సినిమాల్లో అప్పడప్పుడూ మెరుస్తూనే ఉంది. ఇంక సినిమా పంక్షన్స్ లో అయితే చెప్పక్కర్లేదు.

సుమ

సుమ

యాంకర్ గా సుమని ఎరగని వారుండరు. ఆమె కళ్యాణ ప్రాప్తిరస్తు, ఢీ, పవిత్ర ప్రేమ, వర్షం చిత్రాల్లో కనిపించింది.

ఝాన్సీ

ఝాన్సీ

ఎన్నో పోగ్రామ్ లకు యాంకరింగ్ చేసిన ఝాన్సీ ...ఎన్నో సినిమాల్లో కీలకమైన క్యారక్టర్స్ వేస్తునే ఉంది.

నీహారిక కొణిదల

నీహారిక కొణిదల

నాగబాబు కుమార్తె నీహారిక...టీవీ ప్రేక్షకులకుసుపరిచితమే. ఇఫ్పుడామె నాగశౌర్య సరసన నటిస్తోంది

ఓంకార్

ఓంకార్

యాంకర్ గా , గేమ్ షో నిర్వాహకుడుగా ఓంకార్ ని తెలియనివారు లేరు. ఆయన జీనియర్, రాజుగారి గది చిత్రాలతో పెద్ద తెరపైవెలుగుతున్నారు.

ఈటీవి ప్రభాకర్

ఈటీవి ప్రభాకర్

టీవిల్లో ముఖ్యంగా ఈటీవిలో ప్రభాకర్ దర్శకుడుగా, నటుడుగా,గేమ్ షో నిర్వాహకుడుగా పాపులర్. ఇప్పుడాయన పెద్ద బ్యానర్ లో సినిమా డైరక్షన్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

అవికా గోర్

అవికా గోర్

బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు)తో పాపులర్ అయిన అవికాగోర్..ఉయ్యాల జంపాల, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ చిత్రాలతో తెలుగులో హిట్స్ కొట్టింది.

ఉల్కా గుప్తా

ఉల్కా గుప్తా

ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ఆంధ్రాపోరి చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఉల్కా గుప్తా ఇంతకు ముందు టీవిల్లో ఝాన్సీకీ రాణి తో ఓ వెలుగు వెలిగిన ఆమే కావటం గమనార్హం.

కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి

ఈ రోజు రిలీజ్ అయిన త్రిపుర హీరోయిన్ ..స్వాతి..గతంలో కలర్స్ పోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

English summary
our Telugu beauties, who couldn't survive amidst the Mumbai based heroines, chose television as their best career.Nevertheless, they are popular in their own field and are nothing shot of Tollywood heroines. Apparently, you wont believe the craze these hottest television actresses have among youth. check out these pictures of glam dolls of Telugu television and let us know if you agree that Telugu TV has some of the most talented performers.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more