»   » భవనం నుంచి దూకి ప్రముఖ యాంకర్ ఆత్మహత్య.. వైవాహిక జీవితం, కొడుకు పరిస్థితి ఈ రెండే!

భవనం నుంచి దూకి ప్రముఖ యాంకర్ ఆత్మహత్య.. వైవాహిక జీవితం, కొడుకు పరిస్థితి ఈ రెండే!

Subscribe to Filmibeat Telugu
ప్రముఖ యాంకర్ ఆత్మహత్య.. వైవాహిక జీవితం, కొడుకు పరిస్థితి ఈ రెండే!

ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఛానల్ లో ఆమె యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాధిక మూసాపేట్ లోని గూడ్స్ షెడ్ రోడ్ లో సువీల అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే ఆదివారం విధులు పూర్తి చేసుకుని ఆమె 10.30 గంటలకు అపార్ట్ మెంట్ కు తిరిగి వచ్చారు. అంతలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడడం షాక్ కి గురిచేస్తోంది. రాధిక ఆత్మహత్యలు పలు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఓ లేఖ రాసి మరణించినట్లు పోలీస్ లు చెబుతున్నారు.

ప్రముఖ ఛానల్‌లో యాంకర్‌గా

ప్రముఖ ఛానల్‌లో యాంకర్‌గా

రాధిక ప్రముఖ న్యూస్ ఛానల్ లో చాలా కాలంగా యాంకర్ గా పనిచేస్తున్నారు. ఇంతలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడడం కుటుంబ సభ్యులని తీరని శోకంలోకి నెట్టింది.

భవనం నుంచి దూకి

భవనం నుంచి దూకి

రాధికా ఎప్పటిలాగే విధులు పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకుంది. కొద్ది సమయానికే ఆమె భవనం పైకి వేగంగా ఎక్కుతుండడంతో ఇరుగుపొరుగువారు సందేహించారు. స్పందించేలోపే ఘోరం జరిగిపోయింది. ఐదంతస్తుల భవనం నుంచి దూకి రాధిక మరణించింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

తండ్రి, చెల్లెలితో కలసి

తండ్రి, చెల్లెలితో కలసి

రాధిక తన తండ్రి, చెల్లెలితో కలసి మూసాపేట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. రాధిక ఆత్మహత్య చేసుకుకోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సూసైడ్ నోట్‌లో అలా

సూసైడ్ నోట్‌లో అలా

నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా అంటూ రాధిక సూసైడ్ నోట్ లో పేర్కొనట్లు తెలుస్తోంది.

మానసిక వేదన

మానసిక వేదన

గత కొంత కాలంగా రాధిక మానసిక వేదనని అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వేదనకు గల స్పష్టమైన కారణాలు తెలియవు. కానీ ఇటీవల ఆమె వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు

రాధిక కొన్ని నెలల క్రితం తన భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. రాధిక పదిహేను ఏళ్ల క్రితం అనిల్ కుమార్ తో వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తన భర్త నుంచి విడిపోయినప్పటి నుంచి రాధిక మానసిక వేదన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.

కుమారుడి పరిస్థితి

కుమారుడి పరిస్థితి

తన కుమారుడి పరిస్థితి కూడా రాధికని మరింతగా మానసిక వేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది. రాధిక కుమారుడు మానసిక వైకల్యంతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతన్నారు. ఈ కారణాలే ఆమె బలవన్మరణానికి దారి తీసి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

English summary
TV anchor Radhika commits suicide. She jumps from building to death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X