For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma August 12th Episode: ప్లేటు మార్చిన పార్వతి.. శాడిస్ట్ కాదంటూ, రౌడీలతో శాడిజం!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ తాజా ఎపిసోడ్ గా ఆసక్తికరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ ప్రకారం రఘురాం తెల్లవారకముందే డబ్బు తీసుకుని హాస్పిటల్ కి చేరుకుంటాడు. అయితే ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు రఘురాం ఎక్కడ అని ప్రశ్నిస్తారు.. అయితే రఘురాం లేకపోతే మీకు ఏమైంది ? మీరు ఉన్నారు కదా ఆయన లేకపోతే మీ జీవితంలో ఏం మార్పులు ఉంటాయి అన్నట్టు సీత ప్రశ్నిస్తోంది. ముందు సీత మాటలకు బాధపడ్డా తర్వాత ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని వాళ్ళందరూ భావిస్తారు. ఇక అలా జరుగుతూ ఉండగా తన కూతురు ఇంటికి పార్వతి దురుద్దేశంతో వస్తుంది. పాపను అపహరించాలి అనే ఉద్దేశంతో అంతా ప్లాన్ చేసుకుని వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఇంట్లో అందరూ కాస్త పనిలో పడటంతో వెంటనే ఆమె పాపను తీసుకుని ఇంటికి బయల్దేరుతుంది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  పాప మిస్సింగ్

  పాప మిస్సింగ్

  అనుకోకుండా ఈ విషయాన్ని పరిశీలించిన సిరికి తన తల్లి వైదేహిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అన్న విషయం అర్థమవుతుంది. ఇంతలో సీతక్కని కూడా పిలవడంతో ఆమె కూడా వచ్చి చూస్తుంది. ముందుగా కుటుంబ సభ్యులందరూ ఇల్లంతా వెతుకుతారు అయినా పాప కాదు కదా పార్వతి కూడా కనిపించకపోవడంతో ఆమెనే ఎక్కడికో తీసుకు వెళ్ళింది అని భావిస్తూ ముందు ఇంటి చుట్టుపక్కల అంతా వెతికి వస్తారు. ఎక్కడా లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు వరుసగా ఫోన్లు చేయడం మొదలుపెడతారు. అయితే అప్పటికే పార్వతీ పాపను తీసుకుని ఆటోలో తన ఇంటికి బయలు దేరుతుంది. వరుసగా ఫోన్లు చేస్తూ ఉండడంతో ఇక మీ ఫోన్ ఎత్తే పనిలేదని మీ అందరికీ నేను ఏంటో చూపిస్తానని అంటుంది. అలాగే పాప తో మాట్లాడుతూ మీ అమ్మ ఒక పిచ్చి దని నా ప్లాన్ లు ఏవి పారనివ్వ లేదని నువ్వే నన్ను అర్థం చేసుకోమని నూరిపోస్తూ ఉంటుంది.

   పాప కిడ్నాప్

  పాప కిడ్నాప్

  మరో పక్క సీత ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు వరుసగా పార్వతికి ఫోన్లు చేస్తున్న ఆమె వెంట వెంటనే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది..అయితే ఒకవేళ తీసుకు వెళ్ళితేతీసుకు వెళ్లనివ్వండి తీసుకువెళ్ళింది అమ్మే కదా అని అంటే అమ్మే అయినా చెప్పకుండా అలా తీసుకుని పోవడం తప్పని అర్జెంటుగా పాప ఇంట్లో ఉండాలి అంటూ సీత హుకుం జారీ చేస్తుంది. కాస్త బాధ పడినా సిరి వెంటనే తేరుకుని ఫోన్ చేస్తూ ఉంటుంది. అయినా సరే పార్వతి ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ ఎత్తదు కదా అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పాపతో ఇంటికి చేరిన భార్యను పార్వతి భర్త అడ్డగిస్తాడు? పాప ఒకటే వచ్చింది ఏమిటి ? వాళ్ళ అమ్మానాన్న ఏరి ? అంటే ఈ పాపని ఎరవేసి తీసుకోచ్చానని వాళ్ళందరూ చచ్చినట్టు నా గుమ్మం ముందు క్యూ కడతారని పార్వతి అంటుంది. అయితే అలా చేయడం కరెక్ట్ కాదని భర్త వారించే ప్రయత్నం చేస్తాడు.

  రానీ చూసుకుందాం

  రానీ చూసుకుందాం

  వెంటనే అంతెత్తున లేచిన పార్వతి నువ్వు ఏ విషయంలో నాకు సహాయపడలేదు నేను అనుకున్నది సాధించేవరకు ఈ పాపాను విడిచిపెట్టేది లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా మాట్లాడుతుంది. అలాగే తాను రౌడీలను కూడా తీసుకు వచ్చానని ఆమె భర్తకు చూపిస్తుంది.. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావు ? నేను రఘురాం తో మాట్లాడతాను అని చెప్పాను కదా అంటే మీకు ఏం తెలీదు మీరు గమ్మున ఉండండి అంటూ భర్తను భయపెడుతుంది. ఇంతలో సీతకు అనుమానం వచ్చి మీ నాన్నకు ఫోన్ చేసి అడగాలని తిరిగి చెబుతుంది. సిరి వెంటనే తండ్రి కి ఫోన్ చేయగా నిజమేనని మీ అమ్మ నీ కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చింది అని చెబుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి భర్తను మళ్లీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. విషయం చెప్పావు కదా రానీ చూసుకుందాం ఏమవుతుందో అంటుంది.. అలాగే తాను పెట్టిన మనుషులను పిలిచి అప్రమత్తంగా ఉండాలని ఆ మూకంతా వచ్చే అవకాశం ఉందని అంటోంది.

  సైదులుతో కలిసి

  సైదులుతో కలిసి

  వెంటనే ఇంటికి వెళ్దాం పద అని సీత అంటే నువ్వు వద్దని నేను బావ కి ఫోన్ చేసి బావ నేను వెళ్తాను అని అంటుంది. ఇప్పుడు భరత్ కి ఈ విషయం చెప్పొద్దని అంతా సర్దుకున్నాక చెబుదామని అంటుంది. అలా అనుకుంటూ ఉండగానే పార్వతి తాను పెట్టిన సైదులు ని పిలిచి వాళ్ళంతా వచ్చే సమయం అయిందని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. అంతేగాక భర్తను కూడా భయపెట్టి నువ్వు పాపను చూసుకో నేను బయటకు వచ్చే వాళ్లతో మాట్లాడుతాను, పాప ఏడుపు కనుక బయటకి వచ్చింది అంటే నీ సంగతి తేలుస్తాను అంటుంది. ఇదంతా ఏమీ వద్దు అని చెప్పబోతున్న పార్వతి భర్త తో సైదులు మాట్లాడుతూ నీ నోట్లో గుడ్డలు కుక్కాలా అంటూ ప్రశ్నిస్తాడు.

  మొగుడికి వార్నింగ్

  మొగుడికి వార్నింగ్

  ఈ విషయంలో కల్పించుకున్న పార్వతి చూశావుగా మా మనుషులు ఎలా ఉన్నారో! నువ్వు మర్యాదగా నేను చెప్పిన మాట వినకపోతే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి మరీ నా పని చేయించుకుంటాను అంటుంది.. అంతేకాక పాపను చూసుకోవాలంటే నా మొగుడు అవసరం కాబట్టి కాళ్లు చేతులు విరగ్గొట్టే పని ప్రస్తుతానికి ఏమీ వద్దులే అని చెబుతుంది. అంతేగాక తన పాచికలు పారబోతున్నాయని త్వరలోనే తాను ఊహించిన వన్నీ జరగబోతున్నాయి అని పార్వతి ఆనంద పడుతూ ఉంటుంది. మరో పక్క సీత సిరి ఇద్దరూ కలిసి ఇ పార్వతి ఇంటికి బయలు దేరుతారు. పార్వతి ఈ విషయం తెలుసుకుని ఆరుబయట కూర్చుని పాపని గదిలో పెట్టి తాళం వేస్తుంది. అంతేగాక సైదులుని పిలిచి నువ్వు వద్దని పరిస్థితి చేయి దాటింది అనిపిస్తే నేనే నీకు చెబుతాను అని ఆమె అంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నేను అంత శాడిస్ట్ కాదు

  నేను అంత శాడిస్ట్ కాదు

  వాళ్ళంతా నా బంధువులు అని పేర్కొన్న పార్వతి నా కూతుర్ని నాకు కాకుండా చేశారని బాధ తప్ప వాళ్ళందరూ తనకు శత్రువులు ఏమీ కాదని తనకు తన కూతురే ముఖ్యమని మళ్ళీ కాస్త సౌమ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. నేనేమీ అంత శాడిస్ట్ కాదు అని అంటుంది. ఇంతలో సిరి, సీత ఇద్దరు వచ్చి ఈ పాప ఎక్కడ అని అడిగితే పాప గురించి నాకేమీ తెలియదని బుకాయించబోయే ప్రయత్నం చేస్తుంది. ఇది నిజమే అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్లినట్లు నేటి ఎపిసోడ్ లో చూపించారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసినట్లే చెప్పాలి. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది.

  English summary
  Vadinamma Episode 619 : Sita is terrified as Vaidehi goes missing. Elsewhere, Parvati threatens Satyamurthy when he stops her from troubling Raghuram's family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X