For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 20th Episode: గుక్క పెట్టి ఏడ్చిన రఘురామ్.. ఆ సీక్రెట్ బయట పెట్టాలని ఫిక్స్?

  |

  ఎట్టకేలకు రఘురాం కుటుంబంలో ఏర్పడిన ఒక పెద్ద గండం తప్పినట్లు అయింది. పాప ఆపరేషన్ సక్సెస్ కావడంతో రఘురాం కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే పాప విషయంలో తన భార్య చేసిన పని నచ్చకపోవడంతో పార్వతి భర్త ఆమెను మందలిస్తాడు. అయితే తాను తెలియక ఈ పని చేశానని పార్వతి కూడా బాధపడుతుంది. అంతేగాక ఇక మీదట మంచిగా ఉంటానని కూడా ఆమె భర్తతో అంటుంది. ఇక మరో పక్క సీత ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ హారతి తీసుకెళ్లి ముందు పాపకు ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో అందరికీ ఇస్తుంది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   వెక్కి వెక్కి ఏడ్చిన రఘురామ్

  వెక్కి వెక్కి ఏడ్చిన రఘురామ్

  అలాగే సిరి దగ్గరకు వెళ్లి పాపను ఒక నెల రోజుల పాటు గాజు బొమ్మ లాగా చూసుకోవాలి అని నీకు ఎలాంటి అనుమానం వచ్చినా తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని చెబుతుంది. జాగ్రత్తగా ఉంటూ పాపను జాగ్రత్తగా చూసుకోమని కూడా ఆమె సలహా ఇస్తుంది. ఇక మరో పక్క రఘురామ్ కి కూడా ఆమె హారతి ఇచ్చి వెనక్కి వెళుతుంది. ఆమె అటు వెళ్లిందో లేదో రఘురాం వెక్కి వెక్కి ఏడుస్తాడు. దీంతో రఘు తల్లి అసలు ఏమైంది రా ? ఎందుకు ఏడుస్తున్నావు అంతా సవ్యంగానే జరిగింది కదా పాప ప్రాణాలతో ని తిరిగి వచ్చింది కదా ఎందుకు అలా బాధపడుతున్నావు? అని ప్రశ్నిస్తుంది.

  పాప విషయంలో

  పాప విషయంలో

  దానికి రఘురాం మాట్లాడుతూ తాను పాప విషయంలో చాలా బాధపడ్డాను అని, తన జీవితంలో జరిగిన విషయం తమ్ముడికి కూడా ఎక్కడ జరుగుతుందో పాప ఎక్కడ దూరం అయిపోతుందో అని చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పుకొచ్చాడు.. అలాగే తాను పడుతున్న బాధ తన భార్య సీతకు తెలియకూడదు అని ఆమె పిల్లలు లేక పోవడంతో తాను చాలా బాధపడుతున్నాను అని అంటాడు. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని ఆ బాధ ఇప్పటికీ తాను గుండెల్లోనే మోస్తున్నానని రఘురామ్ చెప్పుకొస్తాడు. అంతే కాక పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అలాగే తాను బాధ పడుతున్న విషయం సీతకు తెలియకూడదని కూడా తల్లితో చెబుతాడు.

  దత్తత ఇచ్చేద్దామా

  దత్తత ఇచ్చేద్దామా

  అయితే రఘురాం మాట్లాడుతున్న మాటలు అన్ని వెనుకనుంచి సీత వింటూనే ఉంటుంది. రఘురాం బిడ్డ విషయంలో ఇంత బాధ పడుతున్నారు అనే విషయం తెలియక ఇంట్లో అందరూ ఆయన పడుతున్న బాధలు చూసి ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యంగా సిరి, భరత్ అయితే మన పాపను వాళ్లకు దత్తత ఇచ్చేద్దామా అని కూడా ఆలోచిస్తారు. అయితే మనం ఇద్దాం అనుకుంటున్నా కరెక్టే కానీ ఆయన తీసుకోవాలని అనుకుంటున్నాడో లేదో తెలియదు కదా అంటే ఒక సారి అడిగి చూడాలని కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అయితే రిషిని మార్చి శైలు దగ్గర పెట్టిన విషయాన్ని సీత ఎలా అయినా రఘు రామ్ కి చెప్పాలనుకుంటుంది. ఆయన ఇన్ని రోజుల నుంచి ఈ బాధ మోస్తున్నాడు అనే విషయం తనకు తెలియదని ఇకమీదట ఆ విషయానికి చెప్పేస్తానని దేవుడి ముందు అంటుంది.

  రిషి దగ్గరకు వెళ్లి

  రిషి దగ్గరకు వెళ్లి

  మరోపక్క లక్ష్మణ్ శైలు కూడా సీతమ్మకు పిల్లలు లేరు అనే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.. మరోపక్క రఘురాం అనూహ్యంగా రిషి దగ్గరకు వెళ్లి రిషి తో మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటాడు. బొమ్మలు కూడా ఇచ్చి కాసేపు సరదాగా గడుపుతుంటాడు.. అయితే రిషి మన కొడుకే అనే విషయం చెప్పడానికి వచ్చిన సీత ఈ దృశ్యాన్ని చూసి దేవుడా నీ లీలలు ఇంతలా ఉంటాయా ? నేను ఎవరు గురించి అయితే చెప్పాలని వచ్చానో అప్పుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేసావా అంటూ ఉంటుంది. అయితే రఘురాంతో బావా నీకు ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు కాదు నేను వీడితో ఆడుకుంటున్నాను ఏ విషయం అయినా తర్వాత చెప్పాలని అంటాడు. లేదు బావ ఈ విషయం నీకు ఎలా అయినా చెప్పి తీరాలి అని సీత పట్టుబడుతుంది. ఈ విషయం చెప్పే లోపు శైలు పరిగెత్తుకు వచ్చి రిషి కనపడటం లేదని వెతుకుతున్నాను అని అంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  సీన్ వేరేలా

  సీన్ వేరేలా

  చివరికి శైలుకి చేసిన రఘురాంతో రిషి కనపడగా ఆనంద పడుతూ ఉంటుంది. మరో పక్క సిరి సహా వైదేహిని ఇంట్లో వాళ్ళందరూ ముద్దు చేస్తూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా పాపని ఎత్తుకొని ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. మరోపక్క శ్రావణమాసం రావడంతో శిల్పను ఇంటికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలని సీతకు అత్తగారు చెబుతుంది. అయ్యో అదేమిటి కచ్చితంగా చేస్తానని చెప్పి ఆమె దమయంతికి ఫోన్ చేస్తుంది. ఈలోపు రఘురాం శిల్ప కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలని ఎదురుచూస్తూ ఉంటుందని వాళ్ళ అమ్మను ఇప్పటికే ఈ విషయం మీద టెన్షన్ పెడుతూ ఉంటుందని రఘురామ్ సరదాగా ఉంటాడు. అక్కడ మాత్రం సీన్ వేరేలా జరుగుతూ ఉంటుంది. శిల్ప ఎలా అయినా నేను ఆ ఇంటికి వెళ్ళను నానిని ఇక్కడికి రప్పించాలని తల్లిని కోరుతుంది. అలా ఎలా వస్తాడు రాడు కదా అని తండ్రి అంటూ ఉంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం నాన్న ఇంటికి కార్ రావడం చూపించారు.

  English summary
  Vadinamma Episode 626 : Sita takes a stern decision to reveal the truth to Raghuram. Later, Raghuram's family spends some quality time with Vaidehi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X