Vadinamma : బాబు మిస్సింగ్.. సీత ఇంటికి వచ్చిన అరెస్ట్ చేయబోయిన పోలీసులు.. భరత్ ఎంట్రీతో రచ్చ!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 725వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవఋ. అయితే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటారు. రాజేశ్వరి ప్లాన్ తో అందరి కంటే ముందు వాళ్ళ చేతుల మీదుగా బాబుకు అక్షింతలు కూడా పడతాయి.

వ్యాపారం మీద పూణే
దీంతో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కార్తీక మాసం సంబరాల్లో మునిగి పోయి ఉంటారు. అయితే దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్ళు రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు. దీంతో రగిలిపోయిన శైలు తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది. అయితే ఇందులో అల్లుడి హ్యాండ్ కూడా ఉందని నిరూపించాలనుకున్న రాజేంద్ర కుమార్తెకు ప్లాన్ చెబుతాడు. ఆ ప్లాన్ మేరకు ఆమె అమలు పరుస్తుంది కూడా. అయితే అనూహ్యంగా రిషి కనిపించకుండా పోతాడు, అదే సమయానికి రఘురాం వ్యాపారం మీద పూణే వెళతాడు, దీంతో అతనే తీసుకువెళ్లాడు అని భావిస్తారు.

ప్లాన్ తో సిద్ధం
శైలు కళ్ళు తిరిగిపోవడంతో ఇంటికి వచ్చిన జనార్దన్ కూతుర్ని తీసుకువెళతాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే తన భార్య కళ్లు తిరిగి పడిపోవడంతో పాటు అందరూ రఘురాం బాబు ని తీసుకు వెళ్లాడని అంటూ ఉండడంతో లక్ష్మణ్ బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో సిరి, సీత ఇద్దరు కూడా బాబును తీసుకువెళ్ళింది రఘురాం అయితే కాదు అన్నట్లు ఆయనకు ధైర్యం చెబుతూ ఉంటారు. నువ్వు వెళ్లి నీ భార్యకు ధైర్యం చెప్పు అని సీత సిరి ఇద్దరు చెప్పడంతో ఇక ఏదయితే అదయిందని చెబుతూ లక్ష్మణ్ తన భార్య చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్దకు వెళతాడు. అయితే ముందు ఒక ప్లాన్ తో సిద్ధంగా ఉన్న జనార్ధన్ నీ వల్ల నా కుమార్తె చావుబతుకుల్లో ఉంది.

మనవడు దొరకాలి అంటే
నీ లాంటి వాడిని ప్రేమించినప్పుడు దానికి ఈ పరిస్థితి వస్తుందని ఊహించాను అన్నట్లు మాట్లాడుతారు. మాట్లాడ వద్దు అంటే తన కుమార్తెకు తన మనవడు దొరకాలి అంటే నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని చెబుతాడు. తన అన్నకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో లక్ష్మణ్ ఆలోచిస్తూ ఉండగా అలాంటివి చేయొద్దు నేను నా కూతురు ఏదైనా చేసుకుని వస్తా అన్నట్లు మాట్లాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరోపక్క నాని తన అత్తారింటికి వెళ్లిన సంగతి తెలిసిందే. నానిని తన వ్యాపార సంస్థలు అన్నింటికీ వైస్ చైర్మన్ గా ప్రకటిస్తుంది. మామూలుగానే దమయంతి మాయలో పడిన నాని తనను వైస్ చైర్మన్ గా ప్రకటించడంతో ఆనంద పడుతూ ఉంటాడు.

సీత అరెస్ట్
అయితే ఈ కార్యక్రమం అంతా తన అన్న వదిన కళ్ళముందు జరిగితే బాగుంటుంది అని భావిస్తూ ఉంటాడు. అయితే జనార్ధన్ దగ్గర వివరాలు అందుకున్న పోలీసులు హుటాహుటిన రఘురాం ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ముందు అక్కడ ఉన్న రాజేశ్వరి తో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు.. రఘురాం ఒక కిడ్నాపర్ అన్నట్లుగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో సీత అక్కడికి వస్తుంది. ఇలా ఎవరూ లేని సమయంలో నుంచి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదని అంటూ ఉండటంతో మిమ్మల్ని అరెస్టు చేస్తే రఘురాం ఎక్కడ ఉన్నా బయటకు వస్తాడు అని చెబుతూ ఎస్సై దౌర్జన్యం చేస్తాడు. అయితే విషయం అర్థం చేసుకున్న సీత అరెస్ట్ అయి వెళ్ళడానికి సిద్ధమవుతోంది.

భరత్ అరెస్ట్
అయితే అలా సీత వెళ్ళబోతూ ఉండటంతో భరత్ అప్పుడే ఇంటికి వస్తాడు, అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అరెస్టు చేసి తీసుకు వెళుతున్నారు అని ప్రశ్నిస్తాడు. విషయం అంతా చెప్పిన ఎస్సై తప్పుకోమని అడుగుతాడు. అయితే భరత్ కోపంతో వాళ్ల మీదకు వెళ్లబోయే ప్రయత్నం చేయడంతో ఆమెను కాకుండా భరత్ ను అరెస్టు చేసి తీసుకు వెళతారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఉండగా సీతా పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. మా మరిది ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నిస్తుంది. బాబు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద ఏమైనా సమాచారం అందిందా? అని ప్రశ్నిస్తారు. మొత్తం మీద రఘురాం లేదా లక్ష్మణ్ పోలీస్స్టేషన్కు వచ్చినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











