For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : తీవ్ర విషాదంలో సీత.. ఇంతలో మరో షాక్ ఇవ్వడానికి సిద్దమైన భరత్, సిరి!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 755వ ఎపిసోడ్ కు చేరింది. సీత, భాస్కర్ ల తల్లి, రఘురామ్ అన్నదమ్ములకు మేనత్త కన్ను మూయడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ముందుగా దుర్గ రఘు రామ్ కి ఫోన్ చేసి చెబుతుంది.. భాస్కర్ షాక్ లో ఉన్నాడు ఆయన ఫోన్ చేసే పరిస్థితిలో లేడు కాబట్టి నేను ఫోన్ చేసి మీకు చెబుతున్నాను అని ఆమె అంటుంది. అయితే భాస్కర్ సీతకు చెప్పడానికి అంటే ముందు ఈ విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చెబుతాడు. సీత వంట పనుల్లో బిజీగా ఉండటంతో ఆమెకు చెబితే ఎలా తట్టుకుంటుంది అనే విషయం అర్థం కాక రఘురాం ఆమెకు ఏమీ చెప్పలేక పోతాడు..

  తల్లి శవం మీద

  తల్లి శవం మీద

  కాసేపటికి భోజనం అయిపోయింది మీరందరూ వచ్చి భోజనం చేయండి అని సీత పిలవడంతో అక్కడికి వచ్చిన రఘురాం ఒకసారి మీ ఇంటికి వెళ్లి వద్దాం, వెళ్లి వచ్చాక భోజనం చేద్దాం అని అంటాడు. అయితే తన తల్లికి బాగోకపోయినా రాత్రి అక్కడి నుంచి వచ్చేశాను అని బాధ పడుతున్న సీత ఆ మాట అనడంతో వెంటనే వెళ్దాం పద అంటుంది. కుటుంబ సభ్యులందరూ తమ వాహనంలో భాస్కర్ ఇంటికి చేరుకుంటారు. భాస్కర్ ఇంటికి చేరుకునే లోపు అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడి ఉండటంతో సీత అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. పద చెబుతాను అని రఘు రామ్ అక్కడికి తీసుకు వెళతాడు.

  మూర్ఖత్వం

  మూర్ఖత్వం

  దీంతో చనిపోయి ఉన్న తన తల్లి శవాన్ని చూసి సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే పెద్ద ఎత్తున ఏడుస్తూ సీత తన తల్లి శవం మీద కుప్ప కూలిపోతుంది. రఘురాం అలాగే అతని సోదరులు భరత్, లక్ష్మణ్, నాని ముగ్గురు కూడా తమ మేనత్త మరణాన్ని తట్టుకోలేక పోతారు. వారు కూడా తీవ్ర విషాదంలో మునిగి పోతారు. సీతను శైలు, సిరి శిల్ప ఓదారుస్తూ ఉంటారు. భాస్కర్ ని రఘురాం ఓదారుస్తూ ఉంటాడు.

  అయితే తన వల్లే ఇలా జరిగింది అని లక్ష్మణ్, కాదు నేను చేసిన పని వల్లే ఇలా జరిగింది అని భరత్ తమలో తాము బాధపడుతూ ఉంటారు. ఇద్దరిని వారి వారి భార్యలు పక్కకు తీసుకెళ్లి ఇది జరిగింది మీ వల్ల కాదు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది కానీ మీ వల్లే జరిగిందని అనుకోవడం మూర్ఖత్వం అని అర్థమయ్యేలా చెబుతారు.

  పాడె మోయ కూడదు అని

  పాడె మోయ కూడదు అని

  ఇక అందరూ బాధ పడుతూ ఉండగా అక్కడికి పార్వతి కూడా వస్తుంది. ఇలా చనిపోవడం చాలా బాధాకరం అని చెబుతూనే తనకు స్నేహితురాలైన దుర్గను నువ్వు చాలా గొప్ప దానివి మీ అత్తమ్మ కు చాలా సేవలు చేసి ఆమెను బాగా చూసుకున్నావు అని పొగుడుతూ ఉంటుంది. అయితే భాస్కర్ ఎంతసేపటికి ఏడుస్తూనే ఉండడంతో ఇక జరగవలసిన కార్యక్రమం చేద్దాం అని అక్కడికి వచ్చిన పెద్దలంటారు. భాస్కర్ బాధలో ఉన్నాడు ఏం చేయాలో మాకు చెప్పండి అని రఘురాం అనడంతో మొత్తం మీద పాడె సహా అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తారు. పాడే ఎక్కించిన తర్వాత తల్లిదండ్రులు బతికి ఉన్నవారు పాడె మోయ కూడదు అని ఎవరో అంటారు.

  పెద్ద ఆస్తి ఇచ్చి

  పెద్ద ఆస్తి ఇచ్చి

  అలా అంటే మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు మా అమ్మ కు ఇష్టమైతే ఖచ్చితంగా మోసి తీరుతామని రఘురామ్ అంటాడు. దానికి అతని తల్లి కూడా ఏమీ కాదు ఇది కూడా ఒక రకంగా దైవ కార్యమే నిరభ్యంతరంగా మీరు పాడె మోయవచ్చు అని అంటుంది. అలా రఘురాం సహా తన మిగతా ముగ్గురు తమ్ముళ్ళు పాడే మోస్తూ తమ మేనత్తకు ఘన నివాళి అందిస్తారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఆమె ఫోటో అంత బాధ పడుతూ కూర్చుంటారు. ఇంతలో ఒక వ్యక్తి మీ అమ్మ నీకు పెద్ద ఆస్తి ఇచ్చింది అంటాడు. మాకు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు ఐదు వేల రూపాయలు మాత్రమే ఆమె అకౌంట్ లో ఉన్నాయి అని దుర్గా అంటుంది.

  సీత కోపంగా

  సీత కోపంగా

  నేను అనేది ఆ డబ్బు గురించి కాదు అమ్మ ఆమె రఘు రామ్ వంటి మంచి వ్యక్తులకు సంబంధించిన ఒక కుటుంబాన్ని మీకు అండగా నిలబడేందుకు ఇచ్చింది అని అతను అన్నాడు. దీంతో దుర్గ మొహం అప్పటికప్పుడు మాడిపోతుంది. అయితే తల్లి మరణంతో భాస్కర్, సీత ఇద్దరు కూడా తీవ్ర విషాదంలో మునిగి పోయి ఈ మాటలు పట్టించుకునే కూడా ఉండరు.. మరోపక్క ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్, సిరి ఇల్లు వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలియడంతో వెంటనే సీత, లక్ష్మణ్ అలాగే రఘురాం ఇద్దరినీ అక్కడికి రావాల్సిందిగా కోరుతుంది. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతాను అంటుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు అన్నట్లు లక్ష్మణ్ మాట్లాడతాడు.. దీంతో సీత కోపంగా మనుషులు ఇప్పటికే వేరయ్యారు ఇక ఈ ఇంటిని ముక్కలు చేసే సమయం వచ్చింది అంటుంది. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 755: Sita is heartbroken to learn about Sushela's demise. Meanwhile, Laxman feels guilty for Sita's loss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X