X
కస్టడీ

కస్టడీ

Action | 12 May 2023 | U/A | 148 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కస్టడీ స్టోరీ

కస్టడీ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టి, శరత్ కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ ప్రభు వహించారు. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సంగీతం ఇళయరాజ, యువన్ శంకర్ రాజా కలిసి అందించారు.  కథ శివ (నాగచైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్. అదే గ్రామానికి చెందిన కారు డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రేవతిని ప్రేమిస్తుంటాడు. రేవతికి బలవంతంగా పెళ్లి చేయాలని భావిస్తున్న సమయంలో లేచిపోవాలని డిసైడ్ అవుతారు. అయితే అదే రోజు రాత్రి డ్యూటీ చేస్తున్న శివ.. కారులో తప్ప తాగిన రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేస్తాడు. లాకప్‌లోనే ఉండగానే ఐజీ నటరాజ్ (శరత్ కుమార్) ఇద్దరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. శివ పోలీస్ కానిస్టేబుల్‌ ఎందుకు కావాలనుకొన్నాడు? సీబీఐ ఆఫీసర్ జార్జ్, రౌడీ రాజును నటరాజ్ ఎందుకు చంపాలనుకొన్నాడు? అయితే నటరాజ్‌ కాల్పులు జరిపిన రౌడీ రాజును శివ ఎందుకు కాపాడాలని అనుకొన్నాడు. శివ జీవితంలో సోదరుడు విష్ణు (జీవా) ఎలాంటి ప్రభావాన్ని చూపాడు? శివ జీవితంలోకి ముఖ్యమంత్రి దాక్షాయిణి ఎందుకు ప్రవేశించింది? ఈ కథలో మిలటరీ ఆఫీసర్ (సింధూర పువ్వు రాంకీ కథ ఏమిటి? చివరకు రౌడీ రాజును రక్షించాడా? తన ముప్పు తిప్పలు పెట్టిన సీఎం, ఐజీలకు ఎలాంట గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కస్టడీ సినిమా.  రిలీజ్  ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది  ట్రైలర్  ముఖ్యంగా ట్రైలర్ ని పరిశీలిస్తే హీరో నాగచైతన్య సూపర్ యాక్షన్, డైలాగ్స్, స్టైల్ వంటివి అదిరిపోయాయి. అలానే కృతి శెట్టి సీన్స్ తోపాటు విజువల్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ సన్నివేశాలు వంటివి కూడా బాగున్నాయి. మొత్తంగా అయితే కస్టడీ ట్రైలర్ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి అనే చెప్పాలి. 
Read More

కస్టడీ కాస్ట్ & క్రూ

కస్టడీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకట్ ప్రభు
డైలాగ్ అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ ఎస్ ఆర్ కథిర్ ఐ ఎస్ సి
సంపాదకుడు వెంకట్ రాజేన్
సంగీతం ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా
నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కస్టడీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
బ్రదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కస్టడీ. కథకు బలంగా అనిపించే ఎమోషన్స్ పూర్తి స్థాయిలో పండకపోవడం ఈ సినిమాకు కొంత మైనస్. సినిమా నిండా కథను ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో స్టార్లు కనిపించడం కొత్తగా ఉంది. వెంకట్ ప్రభు టేకింగ్, నాగచైతన్య పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఎసెట్. యాక్షన్ డ్రామాను, స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే సినిమాలను ఇష్టపడే వారికి కస్టడీ నచ్చే అవకాశం ఉంది. అంచనాల లేకుండా వెళితే మంచి అనుభూతిని పంచుతుంది.

కస్టడీ ట్రైలర్

Video Thumbnail

కస్టడీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కస్టడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+