X
మైఖేల్

మైఖేల్

Drama | 03 Feb 2023 | U/A | 155 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మైఖేల్ స్టోరీ

మైఖేల్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, వారలక్షి శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంగీతం సామ్ సి ఎస్ అందించారు.  కథ గురునాథ్‌, చారులత దంపతులు (గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ) ముంబైలో బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొంటారు. రథన్ (అనీష్ కురువిల్లా)కు గురునాథ్‌కు మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతుంటుంది. గురనాథ్‌పై రెండుసార్లు హత్య ప్రయత్నం జరుగగా మురికివాడలో నివసించే అబ్బాయి మైఖేల్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. దాంతో అయితే తనపై జరిగిన హత్యా ప్రయత్నానికి కారణం రథన్ అనే విషయం తెలిసిన గురునాథ్.. రథన్‌ను, ఆయన కూతురు తీర (దివ్యాంశ కౌశిక్)ను చంపమని మైఖేల్‌ను ఆదేశిస్తాడు. వారిద్దరిని చంపడానికి వెళ్లిన మైఖేల్ మనసు మార్చుకొని రథన్, తీరను వదిలేస్తాడు. గురునాథ్‌పై గురుభక్తిని ప్రదర్శించే మైఖేల్ ఆయన ప్రత్యర్థులను ఎందుకు వదలేశాడు? రథన్, తీరను చంపకుండా వదిలేయడానికి కారణాలు ఏమిటి? తన ప్రత్యర్థి రథన్‌ను, తీరను చంపకుండా వదిలేసిన మైఖేల్‌పై గురునాథ్ ఎలా స్పందించాడు. తనకు జీవితాన్ని ప్రసాదించిన గురునాథ్‌కు వ్యతిరేకంగా మైఖేల్ ఎందుకు తిరుగుబాటు చేశాడు? తీరతో ప్రేమ వ్యవహారం , మైఖేల్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేసింది? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రల పరిధి ఏమిటి? మైఖేల్, గురునాథ్ మధ్య అధిపత్య పోరాటంలో చివరకు ఏం జరిగింది? గురునాథ్ కొడుకు వరుణ్ సందేశ్‌కు మైఖేల్‌కు మధ్య గొడవేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మైఖేల్ సినిమా కథ.  రోటీన్‌గా సాగే గ్యాంగ్ వార్ మధ్యకు విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ల ఎంట్రీతో కథ, కథనాలు మారిపోయి.. మరోసారి ప్రేక్షకులకు ఊపు తెచ్చినట్టు అనిపిస్తాయి. కానీ ఆ ఊపు ఎక్కువ సేపు కొనసాగలేకపోవడంతో మళ్లీ తెరమీద ఎప్పటి ఆటే కనిపిస్తుంది. చివరల్లో గౌతమ్ వాసుదేవన్ క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్టు కొత్తగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు మైఖేల్ కథకు పలు సినిమాల కారణం అంటూ నిజాయితీని చాటుకోవడం ఈ సినిమాకు కొసమెరుపు.
Read More

మైఖేల్ కాస్ట్ & క్రూ

మైఖేల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రంజిత్ జయకొడి
స్టోరీ రంజిత్ జయకొడి
డైలాగ్ రంజిత్ జయకొడి, రాజన్ రాధామానలన్
సినిమాటోగ్రఫీ కిరణ్ కౌశిక్
సంపాదకుడు NA
సంగీతం శ్యామ్ సి ఎస్
నిర్మాత భరత్ చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మైఖేల్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మాఫియా గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటం, పాత్రల మధ్య ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిని చిత్రం మైఖేల్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రదానంగా బలంగా కనిపిస్తాయి. అయితే కథలో వెరైటీ లేకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా అనిపిస్తుంది. సినిమా తొలి ఫ్రేమ్ చూడగానే కేజీఎఫ్‌ మూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫీల్ చివరి వరకు సాగడంతో మైఖేల్‌లో కొత్తదనం కనిపించదు. సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి మైఖేల్‌ కూడా నచ్చుతుంది.
Telugu.Filmibeat.com
మాఫియా గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటం, పాత్రల మధ్య ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిని చిత్రం మైఖేల్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రదానంగా బలంగా కనిపిస్తాయి. అయితే కథలో వెరైటీ లేకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా అనిపిస్తుంది. సినిమా తొలి ఫ్రేమ్ చూడగానే కేజీఎఫ్‌ మూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫీల్ చివరి వరకు సాగడంతో మైఖేల్‌లో కొత్తదనం కనిపించదు. సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి మైఖేల్‌ కూడా నచ్చుతుంది.

మైఖేల్ ట్రైలర్

Video Thumbnail

మైఖేల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మైఖేల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+