For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA ఎలక్షన్ పోరు.. హేమకు కౌంటర్ ఇవ్వడానికి సిద్దమైన నరేష్.. చర్యలు తప్పవు అంటూ..

  |

  సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఎలాంటి వివాదాలు చెలరేగిన కూడా మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక సినీ ప్రముఖులు ఎలక్షన్స్, రాజకీయాలంటు ఏమాత్రం హడావుడి చేసినా మీడియా ఛానెల్స్ లో నిరంతరం అవే తరహా వార్తలు కనిపిస్తుంటాయి. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ ఏప్పుడైతే తెరపైకి వచ్చాయో అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు లేకుండా పుట్టుకొస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం మా ఎన్నికల హడావిడి మొదలైంది ఒకరిపై ఒకరు ఏ మాత్రం ఆలోచించకుండా చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నటి హేమ కూడా మా అధ్యక్షుడిపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మా కమిటీ సభ్యులు కూడా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మా మాజీ అధ్యక్షుడు నరేష్ కూడా నటి హేమపై కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో రానున్న రోజుల్లో మా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

   కావాలని ఎన్నికలు వాయిదా

  కావాలని ఎన్నికలు వాయిదా

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహేష్ ప్యానల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తదుపరి ఎన్నికల కోసం కొంత మంది సినీ తారలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మా అధ్యక్ష పదవికి పోటీ పడాలని ఇప్పటికే కొందరు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తాజాగా ఎలక్షన్స్ గురించి స్పందిస్తూ కావాలని కొంతమంది తదుపరి ఎన్నికలలో వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేదా ఎన్నికలు లేకుండానే అలాగే అధ్యక్ష పదవి కోసం కొనసాగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు చేశారు.

   హేమ వాయిస్ రికార్డ్ లీక్

  హేమ వాయిస్ రికార్డ్ లీక్


  కొంతసేపటి వరకు పరోక్షంగా మహేష్ పై వ్యాఖ్యలు చేసిన హేమ అనంతరం డైరెక్ట్ గా నరేష్ ను నిందిస్తూ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని కూడా వివరణ ఇచ్చారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోకుండా ఉండేందుకే నరేష్ గారు ఎన్నికలు జరగనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఎన్నికలు వీలైనంత త్వరగా జరగాలని శనివారం ఉదయం రెండు వేలమంది అసోసియేషన్ సభ్యులకు హేమ ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఎలాగైనా సరే ఈ ఏడాది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే తీరాలంటే ఆమె పలువురి నుంచి సంతకాలు కూడా సేకరించారు. అయితే హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ కూడా లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

  కౌంటర్ ఇచ్చిన నరేష్

  కౌంటర్ ఇచ్చిన నరేష్


  ఎన్నికల కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని సభ్యులంతా అందుకోసం సంతకాలు కూడా చేయాలని ఆమె ఆడియో రికార్డ్ లో వివరణ ఇచ్చారు దీంతో ఒక్కసారిగా కమిటీలో ఎన్నికల వాతావరణం మరోసారి వేడెక్కింది. ఎన్నికల వివాదంపై క్రమశిక్షణ కమిటీ సెప్టెంబర్ 12న నిర్వహించాలని అయితే ఈ క్రమంలో హేమ మాట్లాడిన మాటలు బయటకు లీక్ అవడంతో అసోసియేషన్ లో పలువురు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హేమ చేసిన వ్యాఖ్యలపై నరేష్ కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  హేమపై చర్యలు తప్పవు

  హేమపై చర్యలు తప్పవు

  నరేష్ మాట్లాడుతూ హేమ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలు అంటూ ఒక కమిటీ సభ్యురాలు అన్ని చూసిన అనంతరం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి హేమ గురించి ఫిర్యాదు చేశామని అనంతరం కమిటీ నిర్ణయం ప్రకారమే ఆమెపై చర్యలు కూడా తీసుకుంటామని కూడా అన్నారు.ఎన్నికల గురించి కూడా మాట్లాడుతూ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వస్తామని అందుకోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు ఈ సమావేశంలో నరేష్ జీవితంతో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు.

  Recommended Video

  Mahesh Babu Ultimate Sense Of Humour
   ఎలక్షన్స్ లో భారీగా పోటీ..

  ఎలక్షన్స్ లో భారీగా పోటీ..

  ఇక మా ఎన్నికల అభ్యర్థుల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పేరు ఎక్కువగా కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎలక్షన్స్ లో పోటీ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని అర్థమవుతోంది ఐదుగురు సినీ ప్రముఖులు ఒకేసారి పోటీ పడుతుండటం విశేషం. ఇక ఇదివరకే మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మా బిల్డింగ్ కోసం ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా ఏర్పాటు చేస్తామని తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతానని ఆఫర్ ఇచ్చాడు మరోవైపు జీవితా రాజశేఖర్, నటి హేమ, క్యారెక్టర్ ఆర్టిస్టు సీఎం నరసింహారావు వంటి నటీనటులు కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగానే పోటీ పడేందుకు దృష్టిపెడుతున్నారు. అయితే మంచు విష్ణు మాత్రం ఎన్నికలు ఏకగ్రీవం కావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  English summary
  Maa president Actor naresh counter on hema controversial comments,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X