For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చావు బతుకుల్లో ఉన్న విలన్‌కి చిరంజీవి సాయం.. ''అన్నా మీ సాయం మరువలేను''.. ఎమోషనల్‌గా వీడియో మెసేజ్!

  |

  దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించిన తర్వాత ఆయన పోషించిన టాలీవుడ్ పెద్దన్న పాత్ర ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నారు. టాలీవుడ్ నుంచి సాయం అంటూ అడిగిన అందరికీ అండగా నిలుస్తున్నారు. ఈ మధ్యనే పావలా శ్యామలకు మా మెంబర్షిప్ కార్డ్ ఇప్పించిన ఆయన ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తనతో కలిసి నటించిన ఒక నటుడికి అవసరమని తెలిసి ఆర్థిక సహాయం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  దాసరి బాటలో

  దాసరి బాటలో

  సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, రీ ఎంట్రీ తర్వాత ఎక్కువగా టాలీవుడ్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. టాలీవుడ్ కి ఒకప్పుడు పెద్దన్నగా నిలిచి ఎవరికి అవసరం వచ్చినా అండగా నిలిచిన దాసరి బాటలో చిరంజీవి కూడా పయనిస్తూ అవసరం అంటూ వచ్చిన వారికి కాదనకుండా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే కారోనా క్రైసిస్ ఛారిటీ అనే ఫండ్ రైజింగ్ చేసి ఇండస్ట్రీలో చాలా మంది కడుపు నింపారు.

  తోటి నటుడి కోసం

  తోటి నటుడి కోసం

  తాజాగా ఆయన తమ తోటి నటుడికి ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలుసుకున్నారు. అంతే కాక ఆయన ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు అనే విషయం తెలుసుకుని ఆయన రెండు లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఆ నటుడు మరెవరో కాదు పొన్నాంబళం. చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్ళు తదితర సినిమాల్లో విలన్ గా ఫైటర్ రోల్స్ లో నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.

  ఏమాత్రం ఆలోచించకుండా

  తాజాగా ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. కిడ్నీ మార్పిడి కోసం అవసరమయ్యే రెండు లక్షలు పొన్నాంబళం బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. తమిళనాడు వాసి అయిన పొన్నాంబళం ప్రస్తుతం చెన్నైలో ఉండి కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో చిరంజీవి సాయం అందడంతో పొన్నాంబళం ఆనందం వ్యక్తం చేశారు.

  చాలా ధన్యవాదాలు అన్నా

  చాలా ధన్యవాదాలు అన్నా

  తన ఆరోగ్యం కుదుటపడేందుకు గాను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిమిత్తం రెండు లక్షల రూపాయల సాయం చేశారు అని తెలిసిన వెంటనే ఒక వీడియో మెసేజ్ ద్వారా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ''చాలా ధన్యవాదాలు అన్నా, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి, ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేని'' ఆయన చెప్పుకొచ్చారు.

  Kalika Director Navarasan, Producer Natti Karuna Interview Part - 3
  చిరంజీవిగానే ఉంచాలి

  చిరంజీవిగానే ఉంచాలి

  చిరంజీవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్న ఆయన మీ పేరున్న ఆ దేవుడు ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగానే ఉంచాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.. ఇక జైశ్రీరామ్ అంటూ ఈ వీడియో మెసేజ్ మొదలు పెట్టిన పొన్నాంబళం వీడియో ఆద్యంతం తమిళంలోనే మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  బుజ్జిగాడుతో ఫైనల్

  బుజ్జిగాడుతో ఫైనల్

  నిజానికి సినీ స్టంట్ మాన్ గా కెరీర్ మొదలు పెట్టిన పొన్నాంబళం తెలుగులో ఘరానా మొగుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అల్లరిప్రియుడు, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్ళు, హిట్లర్, పవిత్ర ప్రేమ, నువ్వు వస్తావని, చూసొద్దాం రండి, ఎదురులేని మనిషి, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మ నాయుడు, పెదబాబు, గుడుంబా శంకర్, కొడుకు, అన్నవరం, వీరభద్ర, బుజ్జిగాడు లాంటి సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం ఆయన తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నారు కానీ అనారోగ్య కారణంతో ఆయన కొన్నాళ్లుగా మంచానికి పరిమితం అయ్యారు.

  English summary
  Multilingual actor Ponnambalam asked for financial help few days back. he is suffering from ill health and lack of money for medical expenses. Ponnambalam is an actor who played various roles in various languages ​​like Telugu and Tamil. Recently chiranjeevi helped him for kidney transplantaion. so the actor released a video thanking chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X