Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 తెలుగు డైలాగ్స్ కోసం రంగంలోకి టాలెంటెడ్ డైరెక్టర్ కం యాక్టర్.. ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాను ఇండియాలో కూడా భారీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే ఇక్కడ కలెక్షన్స్ పై స్పెషల్ ఫోకస్ అయితే ఉంది. ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం ప్రముఖ డైరెక్టర్ కం యాక్టర్ ను సెలెక్ట్ సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అతను ఎలా సెలెక్ట్ అయ్యాడు అని వివరాల్లోకి వెళితే..

తెలుగులో హై డిమాండ్
అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతొంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను మొత్తంగా 160 భాషల్లో విడుదల చేస్తున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా తెలుగులోనే ఈ సినిమాకు 100 కోట్ల వరకు మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు డైలాగ్స్ కోసం
జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న అవతార్ 2 సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. అయితే డబ్బింగ్ వెర్షన్ డైలాగ్స్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ చాలామందిని అనుకున్నారట. అయితే ఫైనల్ గా శ్రీనివాస్ అవసరాల సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

అవసరాల ట్రాక్ రికార్డ్
అష్టా చమ్మా సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమైన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత మంచి కమెడియన్ గా కూడా గుర్తింపు అందుకున్నాడు. కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్స్ లో కూడా అతను అద్భుతంగా నటించగలరు. అలాగే కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ కూడా చేశాడు. ఒక దర్శకుడిగా కూడా ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

సెలెక్షన్ ఎలా అంటే..
శ్రీనివాస్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు అని అతని మొదటి సినిమా రచనలోనే బాగా అర్థమయింది. అయితే అతను అవతార్ 2 సినిమా కోసం సెలెక్ట్ అవ్వడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీనివాస్ అవసరాలను మొదట తెలుగులో అవతార్ సినిమాను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ సెలెక్ట్ చేసి అతని పేరును అవతార్ 2 టీమ్ కు పంపినట్లుగా తెలుస్తోంది.

ఆ అనుభవంతో..
మొత్తంగా ఒక ఐదు మందిని రైటర్లను సెలెక్ట్ చేసి పేర్లు పంపడంతో అవతార్ 2 డబ్బింగ్ వెర్షన్ కు సంబంధించిన టీం వారిని ఇంటర్వ్యూ చేసింది. ఇక ఇదివరకే శ్రీనివాస్ అవసరాల అమెరికాలో చదువుకొని అక్కడ జాబ్ చేసిన అనుభవం కూడా ఉంది. హాలీవుడ్ సినిమాలపై మంచి పట్టు ఉంది కాబట్టి అతను తనదైన శైలిలో ఆ ఇంటర్వ్యూలో పాల్గొని అవతార్ 2 టీమ్ ను ప్రత్యేకంగా ఆకర్షించినట్లుగా తెలుస్తోంది.

ఆ బాధ్యత కూడా అతనిదే..
ఆ విధంగా అతనికి అవతార్ 2 సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వెర్షన్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. కేవలం డైలాగ్స్ రాయడమే కాకుండా అవసరాల శ్రీనివాస్ ఏ క్యారెక్టర్ కు ఎలాంటి వాయిస్ అయితే సెట్ అవుతుంది అనే విషయంలో కూడా అతని నిర్ణయం ద్వారానే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా తెలుగు వెర్షన్ అందరికీ నచ్చే విధంగా డైలాగ్స్ రాయాలని కూడా అతను హార్డ్ వర్క్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమా డైలాగ్స్ ద్వారా అతనికి ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.