For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోగా బండ్ల గణేష్ డిఫరెంట్ మూవీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  |

  టాలీవుడ్ లో మొదట ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా అడుగులు వేసి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకున్నాడు. అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండడం వలన చాలా తొందరగా సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నిర్మాతగా అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే టెంపర్ సినిమా తర్వాత మాత్రం మళ్లీ అతను ప్రొడక్షన్ వైపు తిరిగి చూడలేదు. సరైన ప్రాజెక్టులు సెట్ అవ్వకపోవడం వల్లనో ఏమో గానీ సినిమాలకు గతంలో కంటే కాస్త దూరంగానే ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ మళ్లీ నటుడిగా కొనసాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. త్వరలోనే అతను హీరోగా ఒక డిఫరెంట్ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బండ్ల గణేష్ ఆ సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ అంశంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

   నిర్మాతగా అడుగులు వేసినప్పుడు

  నిర్మాతగా అడుగులు వేసినప్పుడు


  గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నపాటి కామెడీ రోల్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా అడుగులు వేసి మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్లకు పైగా ఈ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ అందరితోనూ మంచి సాహిత్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక మొదట అతను నిర్మాతగా మారాలని అనుకున్నప్పుడు చాలామంది అతనిని అడ్డుకున్నారు. వ్యాపారాలతో మంచి లాభాల్లోకి వచ్చిన బండ్ల గణేష్ అనవసరంగా సినిమా ప్రొడక్షన్ లోకి రావద్దని ఎంతో మంది సలహా ఇచ్చారట కానీ బండ్ల గణేష్ మాత్రం సినిమా పై ఉన్న ప్రేమతో ప్రొడక్షన్ లోకి వచ్చాడు.

  ఆ ఒక్క సినిమాతో..

  ఆ ఒక్క సినిమాతో..

  మొదటి సినిమా ఆంజనేయులు అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ హీరోగా నటించిన ఆ సినిమా పెట్టిన పెట్టుబడిని మాత్రం వెనక్కి తీసుకు వచ్చింది. అనంతరం పవన్ కళ్యాణ్ తో తీసిన తీన్ మార్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ కోసం ఎలాగైనా మంచి హిట్ సినిమాను అందించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దబాంగ్ రీమేక్ ని గబ్బర్ సింగ్ గా తీసి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందించాడు. ఆ ఒక్క సినిమాతోనే అతని స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోని బండ్లగణేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేశాడు.

  హీరోగా మొదటి సినిమా

  హీరోగా మొదటి సినిమా


  చివరగా టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ నిర్మాతగా ఎందుకో సినిమాలను సెట్స్ పైకి తీసుకు రాలేకపోయాడు.
  అయితే నటుడిగా మళ్లీ బిజీ అవ్వాలని అనుకున్నాడు ఏమోగానీ ఆ మధ్యన సరిలేరు నీకెవ్వరు సినిమా లో చిన్న కామెడీ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ చాలా కాలం తరువాత వెండితెరపై కనిపించడానికి రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ గా కాకుండా కొంత డిఫరెంట్ గా ఒక తమిళ సినిమా రీమేక్ లో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఆ సినిమాలో బండ్ల గణేష్ మాత్రం చాలా పాజిటివ్ గా కనిపిస్తాడట. ఓ వైపు నవ్విస్తూనే ఆ సినిమాలో మంచి సందేశం కూడా ఇస్తాడాని టాక్ అయితే వస్తోంది. ఇక సినిమాకు బండ్ల గణేష్ అందుకునే రెమ్యునేషన్ ఎంత అనేది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటివరకు బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారీ స్థాయిలో అయితే రెమ్యునరేషన్ అందుకున్న సందర్బాలు లేవు. మొదటిసారి హీరోగా నటిస్తున్నాడు కాబట్టి బండ్ల గణేష్ దాదాపు 20 లక్షలకు పైగా పారితోషికం అందుకుంటున్న ట్లు అయితే టాక్ వస్తోంది.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  పవన్ కళ్యాణ్ తో మరో సినిమా

  పవన్ కళ్యాణ్ తో మరో సినిమా

  ఇక బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ సింగిల్ సిట్టింగ్ లోనే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసుకున్న విధానం బాగా నచ్చడంతో కాదనలేకపోయాడట. ఇక మరో వైపు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే మరొక చిన్న సినిమాలు కూడా నిర్మించే అవకాశం ఉన్నట్లు అయితే టాక్ వస్తోంది. మరి బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Bandla ganesh new movie as a hero shocking remuneration,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X