For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nallamala సినిమాలో విషయం ఎక్కడైనా చూస్తారు.. ట్రైలర్ ఆవిష్కరణలో దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఫేమ్ అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని ప్ర‌సంగించారు.

  Bigg Boss Telugu fame Amit Tiwaris Nallamala trailer released by Dil Raju

  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలా కొత్త వాళ్లంతా కలిసి వస్తుంటే మరింత తక్కువగా ఉంటుంది. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వాళ్లని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా నన్ను ఒకరు ప్రోత్సహిస్తేనే ఇక్కడి వరకు వచ్చాను. ఈ మూవీ డైరెక్టర్ రవి చరణ్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఒకసారి కలవాలని మెసెజ్‌లు చేస్తూ వచ్చాడు. ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప నాకు టీజర్, ట్రైలర్ ఈవెంట్లకు రావాలనిపించదు. నల్లమల అని చెప్పగానే.. ఏమున్నవే పిల్లా అనే సాంగ్ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందని అర్థమైంది. అపాయింట్మెంట్ ఇచ్చాను. పార్క్ హయాత్‌లో ఈవెంట్ అని చెప్పారు. అక్కడ ఎందుకు?..అని అడిగాను మీరు వ‌స్తున్నారు క‌దా సార్ అందుకే అక్క‌డ అనుకుంటున్నాం.. అన్నారు. నేను ఎక్కడ ఈవెంట్ పెట్టినా నేను వస్తాను..నిర్మాత‌కు ఖ‌ర్చు త‌గ్గించ‌మ‌ని చెప్పాను. నేను చెప్పినందుకు రవిచరణ్ ఇలా ఈవెంట్‌ ప్లాన్ మార్చినందుకు థ్యాంక్స్. సినిమాలో విషయం ఉంటే ఈవెంట్ ఎక్కడ చేసినా చూస్తారు. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ అవ్వాలి..టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌' అని అన్నారు.

  ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. 'నిర్మాత దూరంగా ఉన్నా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. మొదటగా త్రివిక్రమ్ గారి వద్దకు మా హీరో తీసుకెళ్లారు. పాట బాగుంది.. సినిమా బాగా తీయండని అన్నారు. ఆ తరువాత నాజర్ గారు మెచ్చుకున్నారు. టీజర్ ఈవెంట్‌కు దేవాకట్టా వచ్చారు. సినిమా బాగా తీశావని రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు. సినిమా విడుదలకంటే ముందే ఇలాంటి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంత మంచి కంటెంట్‌కు ఓ పెద్ద వ్యక్తి ఉండాలని అనుకున్నాను. దిల్ రాజు గారిని కలిశాను. ఈవెంట్‌కు వచ్చేందుకు ఒప్పుకున్నారు. నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ముందు నుంచి కూడా మీడియా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా టీం అంతా కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది' అని అన్నారు.

  Bigg Boss Telugu fame Amit Tiwaris Nallamala trailer released by Dil Raju

  అమిత్ తివారి మాట్లాడుతూ.. 'నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు ఇక్కడకు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయన బ్యానర్లో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఈ రోజు నేను హీరోగా రాబోతోన్న సినిమాకు ఆయన గెస్ట్‌గా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నల్లమల సినిమాకు హీరో కథ. ఇంత మంచి కథను రాసి నాకు హీరోగా కారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ రవి చరణ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

  భాను శ్రీ మాట్లాడుతూ.. 'పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. మా టీంలో చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఆ పాటను విన్నప్పుడే చెప్పుడే ఎక్కడికో వెళ్తుందని అన్నాను. అనుకున్నట్టే జరిగింది. మా సినిమాను అందరూ థియేటర్లో చూడండి. మా సినిమాను చాలా పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారికి థ్యాంక్స్' అని అన్నారు.

  నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను తదితరులు
  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
  నిర్మాత: ఆర్.ఎమ్
  సినిమాటోగ్రఫీ: వేణు మురళి
  సంగీతం, పాటలు: పి.ఆర్
  ఎడిటర్: శివ సర్వాణి
  ఆర్ట్: పీవీ రాజు
  ఫైట్స్: నబా
  స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
  విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
  పిఆర్ఓ - శ్రీ‌ను - సిద్ధు

  English summary
  Bigg Boss Telugu fame Amit Tiwari and Bhanu Sri's Nallamala movie getting ready for release. In this occassion, trailer released by Dil Raju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X