Don't Miss!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- News
Union Budget 2023: రైల్వే ప్రయాణికులు కోరుకుంటోన్నది ఇదే..!!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
భగవద్గీత వివాదంలో కమిట్‌మెంట్ మూవీ.. ఆఫీస్ ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు!
అన్వేషి జైన్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో నటించిన కమిట్‌మెంట్ మూవీ విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. తాజాగా రిలీజ్‌కు సిద్ధమైన ఓ సినిమాలో ట్రైలర్ చివర్లో భగవద్గీతలో ప్రవచనం చెప్పడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా ఆఫీస్ ద్వంశం చేస్తామని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి లాంటి తారలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'కమిట్‌మెంట్'. ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది కానీ కరోనా సహా అనేక ఇతర కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, పోస్టర్లు అప్పట్లో వివాదం సృష్టించాయి..
తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ మొత్తం లిప్ లాక్స్, రొమాన్స్, బూతు డైలాగ్స్ తో నింపేశారు. అక్కడితో ఆగకుండా వివాదం కోసమే అన్నట్లుగా భగవద్గీత శ్లోకాన్ని వాడారు. 'మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది' అంటూ భగవద్గీతలో ప్రవచనం చెప్పారు ఈ ప్రవచనం చెబుతున్నప్పుడే కొన్ని అశ్లీల సన్నివేశాలు చూపించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంతో వివాదాస్పదమయింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర దర్శకనిర్మాతలు, నటీనటులపై విరుచుకుపడగా ఇప్పుడు కమిట్మెంట్ సినిమా ట్రైలర్ పై తెలంగాణలో కేసు నమోదయింది. హైదరాబాద్ సీసీఎస్ లో 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీసీఎస్ లో సినీ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు కించ పరిచే విధంగా ట్రైలర్ ఉందంటూ, బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడతారు అంటూ కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోపక్క ఈ ట్రైలర్ ను కనుక డిలీట్ చేసి క్షామాపణలు చెప్పకుంటే సినిమా ఆఫీస్ ధ్వంసం చేస్తామంటూ హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కమిట్మెంట్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హిందూ సంఘాలతో టచ్ లోకి వచ్చినట్టు చెబుతున్నారు. అసలు తమ సినిమా ట్రైలర్ లో అలాంటి మ్యూజిక్ వాడనే లేదు అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కవర్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. చూడాలి ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది.