twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాపై పోరాటం: నారా రోహిత్, సందీప్ కిషన్ విరాళం

    |

    కరోనా కారణంగా దేశంలోని అన్నిరంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా సినీ రంగంపై ఈ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా పడింది. సినిమా షూటింగ్స్‌తో పాటు కొత్త సినిమాల విడుదల నిలిచిపోవడంతో సినీ రంగంపై ఆధారపడిన కార్మికులు ఆకలితో అలమటించి పోతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు టాలీవుడ్ నటీనటులు.

    ఈ నేపథ్యంలో తనవంతుగా 30 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు యంగ్ హీరో నారా రోహిత్. కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

    Corona Effect: Nara Rohit, Sundeep Kishan Donations

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాలని ప్ర‌జ‌ల‌ను నారా రోహిత్ కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు.

    ఇకపోతే మరో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా తన వంతుగా రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి ఈ విరాళం అందించారు. అదేవిధంగా తన సొంత రెస్టారెంట్ 'వివాహ భోజనంబు'లో పని చేస్తున్న 500 మంది ఉద్యోగుల బాధ్యతలను చూసుకుంటానని ఆయన చెప్పారు.

    English summary
    In Corona Effect Nara Rohit gave Donations To CM and PM Relief funds. Also Sundeep Kishan gave donation for Corona Crisis Charity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X