‘నా కంటే బూతులు పచ్చిగా ఎవరైనా రాయగలరా? సినిమా ఆడకపోతే ఇంత దారుణంగానా?’
యువ హీరో, హీరోయిన్లు అంకిత్ కోయా, నిలాఖీ జంటగా నటిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బ్యూటీ. జీ స్టూడియోస్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల, ఉమేష్ కుమార్ భన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి టీమ్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి. ఈ చిత్రానికి గీతా సుబ్రమణ్యం, భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్ఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాలో మారుతి ఎమోషనల్‌గా మాట్లాడుతూ..
త్రిబాణధారి బార్బరిక్ సినిమా తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ చాలా మంచి వారు. కానీ ఆ సినిమా టైటిల్ నాకు నచ్చలేదు. ఆ టైటిల్ నచ్చలేదని 100 సార్లు చెప్పాను. బార్బిక్యూ లా ఉందని చెప్పాను. చాలా టైటిల్స్ సజెస్ట్ చేశాను. అయినా తను అనుకొన్న టైటిల్‌ను మార్చడానికి దర్శకుడు మోహన్ శ్రీవత్స ఇష్టపడలేదు. ఆయన ఒక ట్రాన్స్‌లో ఉన్నాడు. బార్బరిక్ అనే క్యారెక్టర్ దేవుడు అని అనుకొన్నాడు. దానిని ఎస్టాబ్లిష్ చేయాలని భావించాడు. కానీ మనం ఫీలైతే కుదరదు. ఆడియెన్ ఫీల్ కావాలి. ఆడియెన్ మనసులో లేని దేవుడి గురించి ఎంత చెప్పినా ఎక్కదు. అయితే ఓ డైరెక్టర్‌గా మరో డైరెక్టర్ ఐడియాను బలవంతంగా మార్చలేను. అందుకే వాళ్లు నమ్మిన టైటిల్‌నే కొనసాగించమని వదిలేశాను అని మారుతి తెలిపాడు.

అయితే బార్బరిక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్ ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. మంచి సినిమా తీసి ఆడియెన్స్ చూడలేదని చెప్పుతో కొట్టుకోవడం చాలా బాధ వేసింది. డైరెక్టర్, కళాకారుడు పది మందిని క్రియేట్ చేసే వాడు దయచేసి అలాంటి పిచ్చి పని చేయకూడదు. ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. చొక్కా విప్పేస్తాని ఒకడు అంటాడు. మరొకడు సినిమాలు మానేస్తా అంటున్నాడు అని మారుతి అన్నారు.
సినిమాలు ఆడకపోతే ఇంత దిగజారిపోతావా? ఇంత దారుణంగా మాట్లాడుతారా? ఈ సినిమా ఆడకపోతే మరో సినిమ ఆడుతుంది. బూతులు మాట్లాడితే సినిమాలు ఆడుతాయా? ఆడియెన్స్ సినిమాలు చూస్తారా? నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎవరూ రాయలేరు. నేను కూర్చొంటే.. లెక్కలేనని డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కథలు రాయగలను. బస్టాప్ అనే సినిమాతో ఆపేశాను. ఆ తర్వాత ఎందుకు రాయడం లేదంటే..డబ్బులు సంపాదించాలనే కోరిక నాకు ఉండదా? నాలుగు రోజులు కూర్చొంటే.. బ్యూటీ లాంటి సినిమాలు పది రాస్తా. ఫ్యామిలీస్ రావాలని మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నాను అని మారుతి చెప్పారు.
ఈ రోజుల్లో, బస్టాప్ అనే బూతు సినిమాలు తీసిన డైరెక్టర్ ఇప్పుడు 400 కోట్ల రూపాయలతో రాజా సాబ్ సినిమా తీస్తున్నాడు. వాడి ఎదుగల చూడండి.. వాడి గ్రాఫ్ చూడండి. ఒక ఫ్లాప్ సినిమా తీసిన నాకు.. ఓ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పిలిచి సినిమా ఇవ్వడు. ఈ రోజు ప్రభాస్ మనసులో నేను ఉన్నాను. మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు. వాటి గురించి రాజా సాబ్ ప్రమోషన్స్‌లో మాట్లాడుతాను అని మారుతి చెప్పారు.
ఇక మారుతి సినిమా గురించి వస్తే.. ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











