Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
‘హాఫ్ స్టోరీస్’ మోషన్ పోస్టర్.. డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్
చిన్న చిత్రాలను జనాల్లోకి తీసుకెళ్లాలంటే.. మంచి క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలతో ప్రమోషన్ చేయించాల్సి ఉంటుంది. అందుకే కొందరు పెద్ద పెద్ద స్టార్స్ చేత ప్రమోషన్స్ చేయిస్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా దర్శకుల చేత ఫస్ట్ లుక్, పోస్టర్లు, సాంగ్స్ రిలీజ్ చేయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ విషయంలో దర్శకుడు మారుతిది లక్కీ హ్యాండ్ అవుతోంది. చాలా మంది మేకర్స్ మారుతి చేతుల మీదుగా ప్రమోషన్స్ చేయిస్తున్నారు.
రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందుమౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో.. బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివ వరప్రసాద్ కె. దర్శకత్వంలో.. యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం "హాఫ్ స్టోరీస్". షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో బేబీ లాలిత్య, నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు శివ వరప్రసాద్ కె., హీరో రాజీవ్ పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మోషన్ పోస్టర్ విడుదల అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తోన్న 'హాఫ్ స్టోరీస్' చిత్ర గ్లింప్స్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అంథాలజీ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. అంథాలజీ కాన్సెప్ట్ అంటేనే మంచి హిట్ కాన్సెప్ట్. ఆ జానర్‌లో వచ్చే సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఒకే టోన్‌లో ఐదు రకాల కథలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డిగారిని ముందుగా అభినందిస్తున్నాను. డైరెక్టర్ శివ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడనేది ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది.

ఇందులో హీరో రాజీవ్ పాత్ర సినిమాకి ప్లస్ అవుతుంది. అలాగే ఇందులో కోటీగారు యాక్ట్ చేశారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఎస్సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆయన లుక్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేసి.. మళ్లీ ఇలాంటి మంచి మంచి సినిమాలు వీరి నుంచి వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు.