మాస్ మహారాజానూ వదలని బూతం.. డిస్కోరాజాకు షాక్.. ఆన్‌లైన్‌లో పూర్తి చిత్రం
మాస్ మహారాజా రవితేజ, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన డిస్కోరాజా.. నిన్న (జనవరి 24)నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట ముగిశాక.. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం సత్తా చాటాడు. డిస్కోరాజాలో రవితేజ పర్ఫామెన్స్, విజువల్స్, మ్యూజిక్ ఇలా అన్ని కలిసొచ్చాయి. సినిమా ఇలా బాగా రన్ అవుతుందని అనుకుంటూ ఉండగానే యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది.

వదలని పైరసీ బూతం..
సినిమా మొదట ఆట పూర్తవ్వడమే ఆలస్యం ఆ మరుక్షణమే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా ఏ సినిమాను వదలకుండా పైరసీ చేసేసి ఆన్‌లైన్‌లో వదిలేస్తున్నారు. వీటిని అరికట్టడానికి ఎంత మంది ప్రయత్నాలు చేసినా.. వృథా అవుతోంది. తాజాగా ఈ పైరసీ కోరలకు మాస్ మహారాజా కూడా బలయ్యాడు.

ఆన్‌లైన్‌లో డిస్కోరాజా..
సైన్స్ ఫిక్షనల్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘డిస్కోరాజా' పైరసీ బారిన పడింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా' ఫుల్ మూవీని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని వందల లింకులు అందుబాటులో ఉన్నాయి.

కలెక్షన్లలో జోరు..
ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్‌ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Recommended Video

ప్లస్ అయిన రవితేజ..
డిస్కోరాజా సినిమాకు మంచి ఓపెన్సింగ్ రావడంలో రవితేజ ముఖ్య కారణం. సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లో రవితేజ కొత్తగా కనబడటం, ఆ ఎనర్జీ, ఆ జోష్ చూడటంతో అందరికీ అంచనాలు పెరిగాయి. అందుకే డిస్కోరాజాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని టాక్.


Click it and Unblock the Notifications











