ఆబాలగాపాలాన్ని అలరించనున్న “ఏ చోటనువ్వున్నా”

ఓటీటీల పుణ్యమాని రియాలిటీకి దగ్గరగా ఉన్న కథలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో దర్శక-నిర్మాతల ఆలోచనా తీరులోనూ భారీ మార్పులే చోటుచేసుకుంటున్నాయి. ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్న కొందరు ఫిల్మ్ మేకర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మనసుకుహత్తుకునే కథలతో మన్ననలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పసలపూడి ఎస్.వి. దర్శకత్వంలో లిఖిత ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కొల్లా శివ పార్వతి వెంకట్రావ్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం "ఏ చోట నువ్వున్నా" ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రశాంత్-అంబికా ముల్తానా, నిహార్-గీతారాణి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

పూర్తి గ్రామీణ నేపథ్యంలో, సహజత్వానికి పెద్ద పీట వేస్తూ తెరెకెక్కిన ఓ స్వచ్ఛమైన ప్రేమకథే ఏ చోట నువ్వున్నా అని దర్శకుడు ఎస్వీ చెబుతున్నారు. నవరసాలూ మిళితమైన ఈ ప్రేమకథా చిత్రం కుటుంబం సాంతం ఏ అరమరికా లేకుండా చూసేవిధంగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న "ఏ చోట నువ్వున్నా" ఫస్ట్ కాపీ త్వరలోనే సిద్ధం కానుందని, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర దర్శకుడు పసలపూడి ఎస్.వి. పేర్కొన్నారు.

Ee chota nuvvunna A complete family flick

పూర్తిస్థాయి సహజసిద్ధమైన లొకేషన్లలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా అంతే నాచురల్ గా ఉంటాయిని చిత్ర బృందం తెలిపింది. లీడ్ యాక్టర్స్ తో పాటూ మధుబాబు, ముఖేష్, సతీష్ సరిపల్లి, మహి, శ్రీను సినిమాలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక పాటలు ఈ సినిమాకు హైలైట్ అవుతాయని నిర్మాత తెలిపారు. తరుణ్ రాణా ప్రతాప్ స్వరాలకు సురేశ్ బనిశెట్టి, ప్రీతి పదాలు ప్రాణం పోశాయని వెల్లడించారు. ఇక అని పి.జి కెమెరా హ్యాండిల్ చేయగా, కథ-మాటలు కుమార్ పిచుక అందించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో దర్శకుడు పసలపూడి ఎస్వీ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X