twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections ఫైనల్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన నరేష్.. ఎప్పుడంటే?

    |

    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీ పై సస్పెన్స్ ఎట్టకేలకు నేడు ప్రకటించిన అఫీషియల్ డేట్ తో ముగిసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) యొక్క వార్షిక సాధారణ సమావేశం (AGM) రెండు రోజుల క్రితం జరిగిన తర్వాత ఈ తేదీ లాక్ చేయబడింది. ఇక ఈ అఫీషియల్ డేట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    కీలక ప్రకటన

    కీలక ప్రకటన

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అసలు ఈ ఏడాది ప్రకటన రాక ముందు నుంచి పోటీ చేసే అభ్యర్థుల మధ్య తీవ్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను పాల్గొంటున్నానని మంచు విష్ణు ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ లేఖ వెల్లడైన కొద్ది రోజులకు ప్రకాష్ రాజ్ సినిమా బిడ్డలం అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో తన ఫైనల్ సభ్యులతో సహా అందరినీ ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకు వచ్చే ఉద్దేశంతో తాను ఎన్నికల్లో దిగుతున్నాణని ప్రకాష్ రాజ్ అప్పట్లో ప్రకటించారు..

    బరిలో దిగడం ఖాయం

    బరిలో దిగడం ఖాయం

    ఇక ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జీవిత రాజశేఖర్ కూడా ఈ ఎన్నికల్లో దిగుతారని ప్రచారం జరిగింది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమి వెలువడకపోయినా ఆమె దీని మీద ఎలాంటి ఖండన చేయకపోవడంతో ఆమె కూడా బరిలో దిగడం ఖాయం. ఇక ఈ ఎన్నికల్లో తాను కూడా బరిలోకి దిగుతానని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వహించిన హేమ కూడా ప్రకటించారు.

    తెలంగాణ వారికి అన్యాయం

    తెలంగాణ వారికి అన్యాయం

    ఇదంతా ఒక ఎత్తయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తమకు ప్రత్యేక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేయాలనే వాదనతో సి ఎల్ నరసింహారావు అని నటుడు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడికే ఐదుగురు సభ్యులు కాగా తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కాదంబరి కిరణ్ కూడా తన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించి కలకలం రేపారు.

    క్రమశిక్షణా సంఘం

    క్రమశిక్షణా సంఘం

    దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆరుగురు పోటీ చేస్తున్నట్లు ప్రకటించినట్లు అయింది. సుమారు రెండు మూడు రోజుల క్రితం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని కోరుతూ ఎవరికివారు భిన్నమైన తేదీలను ప్రకటించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన తేదీ ప్రకటించడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే అయ్యేపని కాదు వీలు చూసుకుని తేదీ ప్రకటిస్తామని క్రమశిక్షణా సంఘంలో ఉన్న మురళీమోహన్ పేర్కొన్నారు.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    అక్టోబర్ 10వ తేదీన

    అక్టోబర్ 10వ తేదీన

    ఇక తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన నిర్వహిస్తామని ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వి కె నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొనాలని కూడా నరేష్ ఆ ప్రకటనలో కోరారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి అని ఆయన వెల్లడించారు.. మరి ఈ ఎన్నికల తేదీ కూడా వచ్చిన నేపథ్యంలో ఇకమీదట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో దిగబోయే వారి నుంచి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు కొన్ని రోజుల పాటు తెలుగు మీడియాలో ఈ వార్తలు హోరెత్తనున్నాయి అని చెప్పాలి.

    English summary
    The MAA elections will be held on October 10th, this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X