For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ghani Release Date: బాక్సాఫీస్ లాంటి బాడీతో.. మరో ఫెస్టివల్ ను టార్గెట్ చేసిన వరుణ్ తేజ్

  |

  మరోసారి సినిమాల విడుదల విడుదల తేదిలను టార్గెట్ చేయడంలో స్టార్ హీరోల దూకుడు మొదలైంది. ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఏడాది నుంచి విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ ను చా ఫాస్ట్ గా ఫిక్స్ చేసుకుంతున్నారు. అందులో ఎక్కువగా స్టార్ హీరోలందరూ కూడా ఫెస్టివల్స్ టార్గెట్ చేయడంతో చిన్న సినిమాలకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.

  మీడియం రేంజ్ హీరోలు సైతం పెద్ద పండగలపైనే పడుతున్నారున్ వీలైనంత వరకూ సేఫ్ జోన్ లోనే సినిమాలను పోటీ లేకుండా విడుదల చేయాలని భావిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ మరో ఫెస్టివల్ ను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న F3 సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా వస్తున్న ఈ సినిమా లోవెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు .

  సినిమా షూటింగ్ అయితే దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక సంక్రాంతి బరిలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి వారు పోటీలో ఉన్నప్పటికీ దిల్ రాజు ఏ మాత్రం భయపడకుండా వెంకటేశ్ వరుణ్ తేజ లతో పోటీ పడుతున్నాడు. మరో వైపు వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో గని అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా సిద్దు, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమా విడుదలై డేట్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు అసలైన క్లారిటీ ఇచ్చేశారు . సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

  Ghani movie new release date fix and new poster viral in social media

  అయితే దీపావళికి మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా రావచ్చని తెలుస్తోంది. దీపావళికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే ఒకటే విడుదలకు సిద్ధమైంది. మిగతా పెద్ద సినిమాలు కూడా ఆ ఫెస్టివల్ ను టార్గెట్ చేయవచ్చు. ముందుగానే బుక్ చేసుకుంటే మిగతా సినిమాలు వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే వరుణ్ తేజ్ గనిని ఆ డేట్ కు ఫిక్స్ చేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ డ్రామా. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోలు ఉపేంద్ర, జగపతిబాబు సునీల్ శెట్టి వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర కూడా స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడు.

  ప్రస్తుతం షూటింగ్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను త్వరలోనే థమన్ స్వరపరిచిన మరొక డిఫరెంట్ సాంగ్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ బాలీవుడ్ లో కూడా త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. పాన్ ఇండియా ఆఫర్స్ కూడా వస్తున్నప్పటికీ వరుణ్ తేజ్ ఆ విషయంలో తొందర పడడం లేదు. సరైన కథలు సెట్టయిన తరువాతేనే పాన్ ఇండియా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

  English summary
  In the meantime varun tej changed into a completely new look for the movie ghani. Needless to say, what it would be like to have a body like Bahubali added to that height. And now Varun is extracting in the same way. Recently, it seems that Varun has got a solid offer for the film. It is also reported that a plan has been set for a Bollywood entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X