షూటింగులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. తృటిలో తప్పించుకొన్న యంగ్ టైగర్
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. షూటింగులో ఆయనకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ప్రథమ చికిత్స చేసి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే అభిమానులు, సన్నిహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన పీఆర్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వార్ 2 సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఓ యాడ్ ఫిలిం చేసేందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లో ఈ యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతున్నది. ఈ షూటింగ్‌లో స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయనకు గాయాలు అయ్యాయి. అయితే అంతగా టెన్షన్ పడాల్సినంత గాయలేమీ కావు అని ఫ్యాన్స్‌కు తెలిపారు.

యాడ్ షూట్ సందర్భంగా స్టేజ్‌పై నుంచి పడిపోయారు. చీకట్లో చూసుకోకుండా స్టేజ్ చివరకు రావడంతో కాలు స్లిప్ అయి కిందపడిపోయాడు. చేతికి, పక్కటెముకలకు మధ్య గాయమైంది. వైద్యులు వెంటనే పరీక్షించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఎన్టీఆర్ జరిగిన ప్రమాదంపై ఆయన ఆఫీస్ వర్గాలు ప్రకటన జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడు. ఆయనకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. వైద్యుల సూచనలు, సలహా ప్రకారం.. కొన్ని వారాలపాటు ఆయనకు విశ్రాంతి అవసరం. ఆయన రికవరీ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఊహాగానాలు, రూమర్లకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్, మీడియాకు, ప్రేక్షకులకు సూచిస్తున్నాం అని పీఆర్ వర్గాలు వెల్లడించాయి.
ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, క్రిటిక్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆ మూవీ కోసం ఆయన బాడీ బిల్డింగ్ చేస్తూ.. సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











