అంచనాలు పెంచేసిన రాజశేఖర్ ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం 'కల్కి'. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్న మూవీకి సంబంధించి కమర్షియల్ థియేట్రికల్ ట్రైలర్ గురువారం 'మహర్షి' మూవీతో పాటు విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని తన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేశారు.
భగవద్గీత సందేశంతో 'కల్కి' ట్రైలర్ మొదలైంది. రాజశేఖర్ కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నారు. ట్రైలర్లో పెద్దగా డైలాగులు ఏమీ చూపించకపోయినా విజువల్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రోటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ 'కల్కి' చిత్రాన్ని ప్రేక్షకుల ఊహకు అందని విధంగా రూపొందిస్తున్నారని స్పష్టమవుతోంది.

'గరుడ వేగ' సినిమా తర్వాత మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చి తన స్టార్ స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న రాజశేఖర్... 'కల్కి' ట్రైలర్‌తో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, రాహుల్, రామకృష్ణ, నాజర్, ఆషుతోష్ రానా, సిద్దు జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణు గోపాల్, వెన్నెల రామారావు, డిఎస్ రావు, అమిత్ శర్మ, సతీష్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్-సుబ్బు నిర్మాత: సి కళ్యాణ్ దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.


Click it and Unblock the Notifications











