twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుద్ధం శరణం గచ్ఛామి అంటున్న లైట్‌హౌస్ సినీ మేజిక్.. నందితశ్వేత, రాశితో కలిసి

    |

    Recommended Video

    Light House Cine Magic, Production No.2 Movie Opening || Filmibeat Telugu

    శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్‌. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి 'వాసవి గ్రూప్‌' విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... అశోక్‌ కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు.

    శివ కంఠమనేని మాట్లాడుతూ ఇంతకు ముందు మేం లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై 'అక్కడొకటుంటాడు' సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్‌. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్‌ థ్రిల్లర్‌! ఇందులో నేను, రాశిగారు లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాం. హీరోయిన్‌గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు అని అన్నారు.

    Light House Cine Magic banner was launched new movie

    అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ''లైట్‌ హౌస్‌ అంటే చాలా వెలుతురుగా ఉంటుంది. చాలా దూరం కనిపిస్తుంది. మా సినిమా కూడా చాలా బాగా, బ్రహ్మాండంగా ఉంటుంది. నా క్యారెక్టర్‌ కూడా బావుంటుంది. రాశి చెప్పినట్టు నాదీ ఇండిపెండెంట్‌ క్యారెక్టర్‌. ఇందులో రాశి నా కుమార్తెగా, నందిత నా మనవరాలిగా నటిస్తున్నారు. అందరి ఆశీర్వాదంతో నాకు వెరైటీ క్యారెక్టర్లు లభిస్తున్నాయి'' అని అన్నారు.

    దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ''నేను చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్లాను. కన్నడలో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. స్క్రీన్ ప్లే రైటర్‌గా కన్నడ, తెలుగు ఛానల్స్‌లో బిజీగా ఉన్నాను. మంచి ప్రాజెక్ట్‌ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో కొత్తదనంతో కూడిన కథ రెడీ చేశా. కథ ప్రకారం 40, 45 సంవత్సరాల వయసు ఉన్న హీరో కావాలి. సరైన కథకు సరైన నటీనటులు లభిస్తే ఎంత బావుంటుందో ప్రేక్షకులందరికీ తెలుసు. శివ కంఠమనేని, రాశి, నందిత, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, అజయ్‌ ఘోష్‌... ఇలా మంచి మంచి నటీనటులు కుదిరారు. కథకు ఏం కావాలో చెప్పమని అడిగిన నిర్మాతలకు థ్యాంక్స్‌. 'బుద్ధం శరణం గచ్చామి'... అంటే శాంతంగా ఉండాలన్న దేవకి పాత్రలో రాశిగారు నటిస్తున్నారు. 'బుద్ధం శరణం గచ్ఛామి కాదు... యుద్ధం శరణం గచ్ఛామి'... అంటే ఇప్పుడున్న కాలంలో శాంతంతో కాదు, ఆలోచిస్తూ ఆవేశంతో సమస్యలను ఎదుర్కొవాలన్న పాత్రలో శివ కంఠమనేనిగారు నటిస్తున్నారు. శాంతం, ఆవేశం అన్నీ కలగలిపితేనే జీవితం అనే క్యారెక్టర్‌లో నందితా శ్వేతాగారు నటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఢిఫరెంట్‌ క్యారెక్టర్లలో కనిపిస్తారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో, సెకండ్‌ షెడ్యూల్‌లో వైజాగ్‌లో చేస్తాం'' అని అన్నారు.

    నిర్మాతలలో ఒకరైన ఆర్‌. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ''గత ఏడాది శివ కంఠమనేని హీరోగా 'అక్కడొకటుంటాడు' సినిమా చేశాం. ఇప్పుడు మా రెండో సినిమా ప్రారంభించాం. ఇందులోనూ శివ కంఠమనేని హీరో. ఈ సినిమా కంటే ముందు చాలా కథలు విన్నాం. సంజీవ్‌ మేగోటిగారు మంచి కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టాం. అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా తీస్తున్నాం'' అని అన్నారు.

    నిర్మాతలలో ఒకరైన రాంబాబు యాదవ్‌ మాట్లాడుతూ ''కథ నచ్చి మేమంతా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాం. ఈ సినిమా బాగా వస్తుందని మా దర్శకుడు, మాటల రచయిత పనితనం చూస్తే అర్థమవుతుంది. పెద్దలు, పిల్లలు, కుటుంబం అందరూ రెండు గంటలు ఆనందించే సినిమా తీయాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలు మొదటి సినిమాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ సినిమాకూ అదే విధంగా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని, ఆశ్వీరదిస్తారని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

    సంగీత దర్శకుడు సుధాకర్‌ మారియో మాట్లాడుతూ ''యశస్వినీ గున్నుగారితో కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. సంజీవ్‌గారు ఇంతకు ముందు చేసిన సినిమాలకు నేను కీబోర్డ్‌ ప్లేయర్‌గా పని చేశా. నాకు సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి థ్యాంక్స్‌'' అని అన్నారు.

    మాటల రచయిత అంజన్‌ మాట్లాడుతూ ''ప్రముఖ ఛానల్స్‌లో వస్తున్న మెగా సీరియల్స్‌కి నేను మాటలు రాశా. ఇంతకు ముందూ చాలా వాటికి రాశాను. సినిమాకు మాటలు రాయాలన్న తపన, ఆశయం నాలో ఉన్నాయి. లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ వాళ్లు నాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కథకు మంచి మాటలు రాస్తే వచ్చే ఆనందం, రిజల్ట్‌ అందరికీ తెలిసిందే. సంజీవ్‌గారు మంచి కథ అందించారు. ఇటువంటి కథకు కమర్షియల్‌ హంగులు, మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నప్పుడు మాటలు రాయడం ఎంత ఉత్సాహంగా ఉంటుంది'' అని అన్నారు.

    నటీనటులు, సాంకేతిక వర్గం
    శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, కె. అశోక్‌కుమార్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, 'బిత్తిరి సత్తి, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ తదితరులు
    స్టంట్స్‌: సతీష్‌
    కూర్పు: ఆవుల వెంకటేశ్‌
    కళా దర్శకుడు: కె.వి. రమణ
    మాటలు: అంజన్‌
    ఛాయాగ్రహణం: హరీష్‌
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
    నిర్మాణ సంస్థ పేరు: లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌
    సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో
    నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు
    కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి

    English summary
    The Production No. 2 of Light House Cine Magic banner was launched on Saturday at Hyderabad's Ramanaidu Studios with a puja ceremony. Siva Kantamaneni is the hero of the project. To be directed by Sajeev Megoti, this one is produced by G Rambabu Yadav, R Venkateswara Rao, KS Sankara Rao, and V Krishna Rao. Nandita Swetha, Raashi, K Ashok Kumar and Srinivasa Reddy play key roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X