Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
క్యూట్ సితారకు మహేష్ బాబు స్పెషల్ విషెస్.. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే అంటూ..
మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా తన స్థాయి ఎంత పెంచుకున్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా భార్య, పిల్లలను ఏ మాత్రం వదిలి పెట్టడు. కొంచెం గ్యాప్ దొరికినా కూడా కూతురు సితారతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు.
మహేష్ బాబుకు తన కూతురు అంటే ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తండ్రి అంటే కూడా సితార ఎంతగానో లైక్ చేస్తుంది. ఇక నేడు సితార 9వ పుట్టినరోజు కావడంతో మహేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే మై లిటిల్ వన్.. నా ప్రపంచంలో ఎల్లప్పుడు ఒక కాంతిని కలిగిస్తావు. హ్యాపీ 9. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

అభిమానులు కూడా సితారకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక సితార యూ ట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
నిత్యం ఏదో ఒక వీడియోతో సితార సందడిగా కనిపిస్తుంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.