For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆచార్య టీమ్ కు ఆర్డర్ వేసిన మెగాస్టార్.. అభిమానుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌

  |

  మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో గ్యాప్ లేకుండా సినిమాలను ఒకే చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తనయుడు రామ్ చరణ్ కంటే వేగంగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు. గతంలో మెగాస్టార్ ఖైదీ నెంబర్ వన్ 150 సినిమా స్టార్ట్ చేసినప్పుడు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ వచ్చారు. సైరా సినిమా అనంతరం వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మెగా హీరోలు కూడా ఈ రేంజ్ లో వెళ్లడం లేదు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి మెగాస్టార్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈపాటికే ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

  30 Weds 21 ఫేమ్ అనన్య గ్లామరస్ ఫోటోస్.. లేలేత అందాలతో..

  రామ్ చరణ్ ఆచార్య సినిమాలో సిద్దా అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఒక పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం మిగతా స్టార్ హీరోల సినిమాల పాటలు విడుదల చేసిన సందర్భంగా మెగా అభిమానులకు నచ్చేలా కూడా ఆచార్య నుంచి ఒక పాటను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

  Chirajeevi మనవరాలు క్యూట్ ఫోటోలు.. మెగాస్టార్ కౌగిలిలో అలాప్రేమగా!

  మణిశర్మ అయితే దాదాపు ఆచార్య మూవీకి సంబంధించిన అన్ని ట్యూన్స్ ని రెడీ చేసి ఉంచాడు. త్వరగా మరొక మాస్ సాంగ్ ను ప్రేక్షకులకు అందించాలని మెగాస్టార్ ఆచార్య టీమ్ కు అలాగే మణిశర్మకు ఆర్డర్ వేసినట్లు సమాచారం. లిరికల్ సాంగ్ గా విడుదల చేసి అందులో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి డాన్స్ చేసిన వీడియో క్లిప్స్ ను కూడా జత చేయాలని అనుకుంటున్నారట. ఇక సినిమా విడుదల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  Megastar chiranjeevi acharya new mass song release plans

  పరిస్థితులు అనుకూలిస్తే దసరా లేదా వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ కు ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే లాక్ డౌన్ ఎత్తి వేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టికెట్ రేట్స్ అంత లాభదాయకంగా లేవని విడుదల తేదీ వాయిదా వేస్తున్నారు. మళ్లీ ఎప్పటిలానే టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తేనే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఈ నెల 7న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో థియేటర్స్ కొత్త రేట్ల పై చర్చలు జరగనున్నాయి.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  ఒకవేళ ఆ చర్చలు సఫలం అయితే ఆచార్య కూడా త్వరలోనే రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మూడు సినిమాలను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. ముందుగా లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు అనంతరం బాబీ దర్శకత్వంలో మరో మాస్ మసాలా సినిమా లాంచ్ డేట్ పై చర్చలు జరుపుతున్నారు. అలాగే మెహర్ రమేష్ కూడా వేదాళం రీమేక్ ను ఇదే ఏడాది పట్టాలెక్కిన చాలని ప్రయత్నాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో ఆ సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేస్తారో చూడాలి.

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Megastar chiranjeevi acharya new mass song release plans, The megastar, who previously made one film a year, has now lined up four films in a row. It seems that he is ready to negotiate with another comedy director recently. Once you go into those details ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X