Don't Miss!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
TeluguIndianIdol కోసం మెగాస్టార్.. రానా, సాయిపల్లవిలతో మాస్ మసాలా ఫినాలే.. ఎప్పుడంటే?
పూర్తి స్థాయి తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఆహా ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది ఆహా వీడియో. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రం లు మాత్రమే కాక ఆకట్టుకునే గేమ్ షోలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. అందులో భాగంగానే తెలుగులో ఉన్న టాలెంట్ బయటకు తీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ అనే రియాలిటీ సింగింగ్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది ఆహా. ఇక ఈ షో మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫినాలేకు రంగం సిద్దం
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ఎన్నో వైవిధ్యమైన షోలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రసారం అవుతున్న పాపులర్ షో ఇండియన్ ఐడల్ తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ షో చివరి దశకు చేరుకుంది. సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తిక్, హీరోయిన్ నిత్యా మీనన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలేకు రంగం సిద్దమయింది.

బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్‌గా
ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక వేల మందిని వడపోసిన తర్వాత మొత్తం 12 మందిని గాయకులను ఎంపిక చేశారు. అలా మొదలైన ఈ షో నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ.. చివరకు ఆరుగురిని సెమీ ఫైనల్ కు పంపించారు. ఇక ఈ షో కోసం వారం వారం ఎవరో ఒక అతిథులను షో కోసం ఆహ్వానిస్తుండగా, ఆ ఎపిసోడ్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు.

ఫినాలేకు గెస్ట్‌గా చిరంజీవి
ఇక సెమీ ఫైనల్స్ రౌండ్ లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి గాయకులను అభినందించారు. అందులో లాలస అనే గాయని ఎలిమినేట్ అవ్వగా మిగతా ఐదుగురు ఫైనల్స్ కు వెళ్ళారు. ఇండియన్ ఐడల్ తెలుగు షో చిట్ట చివరి దశకు చేరుకున్న తరుణంలో ఫినాలేకు గెస్ట్‌గా ప్రముఖ స్టార్ హీరో చిరంజీవిని ఆహ్వానించారు. ఇక ఈ షో షూటింగ్ కూడా సోమవరం జరిగినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్
ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా కొన్నాళ్ల నుండి వార్తలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ ఫినాలేకి చిరంజీవితో పాటుగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రానా, సాయి పల్లవిలు కూడా సందడి చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు ఆహా సంస్థ వదలగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జూన్ 17న
ఇక షోలో తనదైన స్టైల్‌లో కంటెస్టెంట్లతో చిరంజీవి సందడి చేశారని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు తొలి ఇండియన్ ఐడల్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 17న ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారు? అనేది.