twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ.. శుభవార్త అందించిన మంత్రి తలసాని

    |

    కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్, సినిమా పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై సినీ ప్రముఖులతో చర్చించేందుకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి సమావేశమయ్యారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి నిర్మాతలు సీ.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని చెప్పారు.

    లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది అని మంత్రి శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు.

    Minister Talasani Srinivasa Yadav meeting with Film makers

    ఇప్పటికే పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షూటింగ్ ప్రారంభించడం, థియేటర్లలో సినిమా ప్రదర్శనకు అనుమతులు, ఇతర అంశాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

    ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై పలు అంశాలను చర్చించిన విషయాలను గుర్తు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తున్నదని మంత్రి అన్నారు. 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుంది అని మంత్రి శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు.

    English summary
    Minister Talasani Srinivasa Yadav meeting with Film makers, Minister Talasani Srinivasa Yadav speaks about film issues, CM KCR nods positive for Tollywood shootings within lockdown norms, Telangana Government positive for Post production works in Tollywood, CM to take decisions to open Theatres very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X