twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    No Vaccine.. No Shooting.. సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ

    |

    కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగులను ప్రారంభించేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ సిద్ధమవుతున్నది. ఈ మేరకు కొన్ని ప్రమాణికాలను, మార్గదర్శకాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. సమావేశమనంతరం ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్‌కు సంబంధించిన నిపుణులు, కార్మికులకు మార్గదర్శకాలు జారీ చేశాయి.

    కరోనావైరస్‌ను ప్రతిఘటించే వ్యాక్సిన్‌ను తీసుకొన్న వారినే షూటింగులకు అనుమతించాలని ఈ సమావేశం ప్రధానంగా తీర్మానించింది. గత ఏప్రిల్‌లో ఆగిపోయిన షూటింగ్స్‌కు ఆర్టిస్టులు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను పూర్తి చేయాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. గత రెండు నెలల క్రితం కేటాయించిన డేట్స్ ప్రకారం త్వరలో ప్రారంభం కాబోయే షూటింగులకు, సినిమాలకు సహకరించి వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.

    No Vaccine.. No Shooting: Tollywood film associations set new guidelines for the Shooting

    షూటింగుకు హాజరయ్యే ఆర్టిస్టులు, నిపుణులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ తీసుకొన్నట్టు వారి నుంచి ప్రొడక్షన్ హౌస్‌లు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అని ఈ సమావేశంలో సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అలాగే షూటింగులో పాల్గొనే వారికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్, సంబంధిత యూనియన్లను తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతతో మెలుగుతూ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని మనవి చేశారు.

    తాజా మార్గదర్శకాలపై సినీ వర్గా లనుంచి ఎలాంటి సలహాలుగానీ, ఫిర్యాదులు గానీ, ఏమైనా ఉన్నట్లయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియజేయాలని సూచించారు.

    English summary
    Telugu film Industry formulates new protocals for Shootings. Commitees of Tollywood made clear that No Vaccine.. No Shooting. Telugu film Producers council, Telugu film directors association, MAA members met for fromulation of this guidelines
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X