Just In
- 12 min ago
అదిరిపోయిన అప్డేట్.. పవన్ కళ్యాణ్ కోసం కదిలి వచ్చిన త్రివిక్రమ్
- 41 min ago
సంక్రాంతిని అలా ప్లాన్ చేశారన్నమాట.. అలీ రెజా-సోహెల్ రచ్చ
- 1 hr ago
అలా చేస్తే అల్లుడు అదుర్స్ టికెట్స్ ఫ్రీ.. అందుకేనా అంటూ ట్రోల్స్
- 1 hr ago
మరో హిస్టారికల్ బయోపిక్.. డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్న కాంట్రవర్సీ క్వీన్
Don't Miss!
- News
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Sports
IPL 2021 auction: ఇద్దరు స్టార్ విదేశీ ఆటగాళ్లను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.. ఎవరంటే?
- Finance
బ్యాంకులు, ఐటీ స్టాక్స్ దెబ్బ, భారీ నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, హెచ్సీఎల్, టీసీఎస్ పతనం
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెరపైకి మరోసారి మర్యాద రామన్న కాంబో.. సునీల్ లక్కు మామూలుగా లేదుగా!
బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా క్రేజ్ అందుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక ప్రస్తుతం ఆడియెన్స్ ఆలోచనా విధానాలు కూడా మారాయి. వారిని ఆకట్టుకోవాలి అంటే కూడా అంతకు మించి అనేలా ప్రయోగాలు చేయాల్సిందే. మొదట్లో సునీల్ కమెడియన్ గా ఏ రేంజ్ లో క్రేజ్ అందుకునేవాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక హీరోగా మొదటి మూడు అడుగులలో బాక్సాఫీస్ హీరోగా మారాడు అనుకునే లోపే డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక సునీల్ కెరీర్ బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమా మర్యాదరామన్న. మరోసారి ఆ కాంబినేషన్ తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా తరువాత.. కుప్పలు కుప్పలుగా ఆఫర్స్
అదృష్టం తలుపుతట్టినప్పుడు ఎవరైనా సరే తెరవకుండా ఉండలేరు. కానీ ఒక్కసారి మాత్రమే వచ్చే ఆ అవకాశంతోనే భవిష్యత్తుకు ఒక స్పెషల్ ట్రాక్ సెట్ చేసుకోవాలి. ఆ విషయంలో సునీల్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అందాల రాముడు తరువాత ఏకంగా దర్శకధీరుడుని ఎట్రాక్ట్ చేసి మర్యాదరామన్నలో అవకాశం అందుకున్నాడు. ఆ సినిమా తరువాత సునీల్ కు కుప్పలు కుప్పలుగా ఆఫర్స్ వచ్చాయి.

సలోని కూడా అదే తప్పు చేసింది
సునీల్ కెరీర్ లో ఎన్ని స్పెషల్ సినిమాలు ఉన్నా కూడా ఆ ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్నడు. ఏదేమైనా సునీల్ మళ్ళీ ఆ తరువాత అలాంటి సక్సెస్ ని మాత్రం చూడలేదు. ఆ సినిమాలో సునీల్ సరసన నటించిన సలోని అశ్వనికి కూడా అదే బెస్ట్ హిట్టు. ఆ సినిమా తరువాత ఆ బ్యూటీ కూడా ఎందుకో సరైన రేంజ్ లో క్లిక్కవ్వలేకపోయింది. సునీల్ లాగానే ఆమె కూడా కొన్ని అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకుంది.

ప్లాప్స్ వచ్చినా.. తగ్గని అవకాశాలు
సునీల్ ప్రస్తుతం కమెడియన్ గా సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే నెగిటివ్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అంటున్నాడు. కలర్ ఫోటో సినిమాలో అతని పెర్ఫెమెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా సునీల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే హీరోగా కూడా ఆఫర్స్ అందుతున్నాయి. కానీ సునీల్ తొందరపడకుండా చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు.

మరోసారి మర్యాదరామన్న కాంబో..
అయితే చాలా రోజుల తరువాత మర్యాదరామన్న జంట మళ్ళీ తెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మనసంతా నువ్వే దర్శకుడు విఎన్.ఆదిత్య త్వరలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమాలో సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా నటించబోతొంది. చాలా రోజుల తరువాత ఒక్కటైన ఈ హిట్ కాంబో ఇప్పుడు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.