నటుడిగా రానాకు పదేళ్లు.. ఓ సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నారట..ఇంట్రెస్టింగ్‌గా సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్
దగ్గుబాటి వారసుడిగా లీడర్ సినిమాతో రానా ఎంట్రీ ఇచ్చాడు. ఓ పెద్ద సంస్థ అండ ఉండీ, విక్టరీ వెంకటేష్ లాంటి బాబాయ్ సపోర్ట్ ఉండీ కూడా లీడర్ వంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు రానా. ఈ చిత్రం వంద రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా అప్పటి పరిస్థితులకు అద్దం పట్టడం, రానా నటన ఆకట్టుకునేలా ఉండటంతో లీడర్ ఓ క్లాసిక్‌లా మిగిలిపోయింది.
రానా నటుడిగా పరిచయమై దశాబ్దమవుతోంది. ఈ సందర్భంగా లీడర్‌కు పదేళ్లు నిండాయని, నటుడిగా రానాకు పదేళ్లు అంటూ సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. లీడర్ సినిమా పోస్టర్, అరణ్య పోస్టర్ పక్కపక్కనే పెట్టి.. ఈ దశాబ్దకాలంగా రానా వెంట ఉన్నవారందరికీ థ్యాంక్స్ అని చెబుతూ ఓ ట్వీట్ చేశారు.

ఇంతకాలంగా అభిమానిస్తూ.. ఆదరిస్తూ.. ప్రేమిస్తూ వస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్స్. మీ అందరికీ ఈ మూమెంట్ మెమరబుల్‌గా ఉండేందుకు ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాం.. చూస్తూనే ఉండండంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో అని నెటిజన్లుఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











