Just In
Don't Miss!
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత భావోద్వేగ పోస్ట్.. ఎట్టకేలకు తన కల నెరవేరుతోందంటూ సందేశం
స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత మాంచి జోష్‌లో ఉంది. అక్కినేని వారింట అడుగుపెట్టాక ఈమెకు అన్నీ శుభాలే కలుగుతున్నాయి. వరుస ఆఫర్స్ తలుపుతట్టడమే గాక, ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలుస్తూ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తన కల నెరవేరుతోందంటూ భావేద్వేగపూరిత స్నెదేశం పోస్ట్ చేసింది సామ్. వివరాల్లోకి పోతే..

అక్కడే కాదు ఇక్కడ కూడా..
కేవలం సినిమాలే గాక డిజిటల్ రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయిన సమంత వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. సినిమాలు చేస్తూనే డిజిటల్ రంగంలో హవా కొనసాగిస్తానని ఆమె చెబుతోంది. ఇదిలా ఉండగానే మరో కొత్త స్టెప్ తీసుకుంది అక్కినేని సమంత. త్వరలో ఎడ్యుకేషన్ బిజినెస్ లోకి కూడా ప్రవేశిస్తోంది.

చిన్నారులపై ప్రేమతో సమంత..
ఇప్పటికే ప్రత్యూష అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తున్న సమంత త్వరలో ప్రీ స్కూల్ ప్రారంభించబోతుంది. శిల్పా రెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని ప్రారంభించబోతుంది ఈ అక్కినేని కోడలు.

భావోద్వేగపూరిత సందేశం.. కారణం అదే
జూబ్లిహిల్స్‌లోని ఈ ప్రీ స్కూల్.. పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని సమంత అంటోంది. సంవత్సరానికి పైగా ఈ స్కూల్ కోసం పనిచేశామని, ఫిబ్రవరి 22న ఈ ప్రీ స్కూల్ 'ఏకం లెర్నింగ్ సెంటర్' తలుపులు తెరుచుకోబోతున్నాయని చెప్పింది సామ్. ఎట్టకేలకి తమ కల నెరవేరిందని భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేసింది సమంత.

|
సమంత జాను..
ఇకపోతే ఇటీవల 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత ఆశించిన మేర ఫలితం రాబట్టలేకపోయింది. కలెక్షన్స్ సంగతెలా ఉన్నా ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. చిత్రంలో సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. త్వరలో ఈమె విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమా చేయనుందని తెలుస్తోంది.